తెలంగాణ

telangana

ETV Bharat / city

Top news: టాప్ న్యూస్ @ 7PM

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

top news in telangana
టాప్ న్యూస్ @ 7PM

By

Published : Jan 5, 2022, 7:00 PM IST

  • రాష్ట్ర బంద్‌కు భాజపా పిలుపు

ఈనెల 10న రాష్ట్ర బంద్‌కు భాజపా పిలుపినిచ్చింది. జీవో 317 పునఃసమీక్షించాలనే డిమాండ్‌తో బంద్‌ చేస్తున్నట్లు ప్రకటించింది.

  • 'గతంలో నమ్ముకున్న సీఎం​.. ఇప్పుడు విస్మరించారు'

Etela Comments On CM KCR: సీఎం కేసీఆర్​ పాలనలో బల్దియా కార్మికుల దుస్థితి మారలేదని హుజూరాబాద్​ ఎమ్మెల్యే ఈటల రాజేందర్​ ఎద్దేవా చేశారు. గతంలో కార్మిక యూనియన్లను నమ్మకున్న కేసీఆర్​.... ఇప్పుడు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు జీహెచ్ఎంసీ​ కార్మికులకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు.

  • 'టీకా​ తీసుకున్నాక ఆ పని చేయొద్దు'

Bharat Biotech: దేశంలో 15-18 ఏళ్ల వయస్కులకు కొవాగ్జిన్​ టీకా పంపిణీ జరుగుతున్న నేపథ్యంలో కీలక ప్రకటన చేసింది వ్యాక్సిన్​ తయారీ సంస్థ భారత్​ బయోటెక్​. టీకా తీసుకున్న తర్వాత.. ఎలాంటి మందులు వాడాల్సిన పనిలేదని స్పష్టం చేసింది.

  • అలాంటి వారు పక్కకు తప్పుకోండి

Chandrababu on party leaders: ఏపీలో వచ్చే రానున్నవి ఆషామాషీ ఎన్నికలు కావని.. రౌడీయిజం, విధ్వంసాన్ని తట్టుకొని నిలబడాలని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. పార్టీ ప్రతినిధుల అంతర్గత భేటీలో మాట్లాడిన ఆయన.. పనిచేయకుండానే పదవులు ఆశించకూడదని స్పష్టం చేశారు. పని చేయలేని వారు పక్కకు తప్పుకోవాలంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు.

  • '8 రోజుల్లోనే 6.3 రెట్లు'

Rise in Covid cases: దేశంలో గత 8 రోజుల్లో కరోనా కేసులు 6.3 రెట్లు పెరిగినట్లు ప్రభుత్వం తెలిపింది. డిసెంబర్‌ 29న 0.79 శాతంగా ఉన్న పాజిటివిటీ రేటు జనవరి 5 నాటికి 5.03 శాతానికి పెరిగినట్లు వివరించింది. 28 జిల్లాల్లో కొవిడ్‌ పాజిటివిటీ 10 శాతానికిపైగా, 43 జిల్లాల్లో 5 నుంచి 10 శాతం మధ్యలో ఉన్నట్లు పేర్కొంది.

  • ఇక డిజిటల్ యుద్ధమే!

UP election 2022: అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ప్రచారంపై కరోనా ప్రభావం పడింది. భారీ సభలు నిర్వహించకూడదని పార్టీలు నిర్ణయం తీసుకుంటున్నాయి. చిన్న చిన్న కార్యక్రమాలతోనే ప్రచారాన్ని ముందుకు తీసుకెళ్లాలని కాంగ్రెస్ నిర్ణయించింది. ఫలితంగా.. అతిపెద్ద రాష్ట్రమైన యూపీలో.. ఎన్నికల ప్రచారం బోసిపోనుంది.

  • భారత విమానాలపై​ నిషేధం

Hong Kong bans flights: భారత్​తో పాటు మరో ఏడు దేశాల విమానాల రాకను నిషేధిస్తున్నట్లు ప్రకటించింది హాంకాంగ్​ ప్రభుత్వం. ఒమిక్రాన్​ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. జర్మనీ ప్రభుత్వం కూడా కఠిన ఆంక్షలు విధించేందుకు సిద్ధమైంది. బ్రిటన్​లో ప్లాన్​-బీ అమలుకు యోచిస్తున్నారు ప్రధాని బోరిస్​ జాన్సన్​.

  • 'షావోమి' భారీ మోసం

Xiaomi import duty evasion: షావోమి సంస్థ భారత విభాగం రూ.653 కోట్ల కస్టమ్స్​ సుంకం ఎగవేతకు పాల్పడింది. ఆ సంస్థకు చెందిన ప్రాంగణాల్లో జరిపిన సోదాల్లో డైరెక్టర్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు.. ఇందుకు సంబంధించిన కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. దీంతో ఆ సంస్థకు షోకాజ్​ నోటీసులను కేంద్ర ఆర్థిక శాఖ జారీ చేసింది.

  • వారిని ఎన్టీఆర్​ ఏ వంటకంతో పోల్చారంటే?

Jr NTR Interview: ప్రముఖ కథానాయకుడు జూనియర్​ ఎన్టీఆర్​ను ఇంటర్వ్యూ చేశారు బాలీవుడ్ నటి సాహెబా బాలీ. ఈ క్రమంలో సాహెబాను అతిథిగా భావించిన ఎన్టీఆర్‌ ఆమెకు హైదరాబాదీ బిర్యానీ, తెలంగాణ చేపల పులుసు, గుంటూరు చికెన్‌ను వడ్డించారు. వాటి ప్రాముఖ్యతను తెలియజేశారు.

  • లక్ష్యం దిశగా సఫారీలు

భారత్​తో జరుగుతున్న రెండో టెస్టులో దక్షిణాఫ్రికా లక్ష్యం దిశగా సాగుతోంది. రెండో ఇన్నింగ్స్​లో 240 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సఫారీ జట్టు మూడో రోజు టీ బ్రేక్ సమయానికి వికెట్ నష్టపోకుండా 34 పరుగులు చేసింది.

ABOUT THE AUTHOR

...view details