తెలంగాణ

telangana

ETV Bharat / city

టాప్‌ టెన్ న్యూస్‌ @ 3PM - తెలంగాణ ప్రధాన వార్తలు

టాప్‌ టెన్ న్యూస్‌ @ 3PM

top news in telangana
టాప్‌ టెన్ న్యూస్‌ @ 3PM

By

Published : Jan 3, 2022, 3:01 PM IST

  • ​ బండి సంజయ్‌కు రిమాండ్

బండి సంజయ్‌కు బెయిల్ నిరాకరించింది కోర్టు. బండి సంజయ్ బెయిల్ పిటిషన్‌ను తిరస్కరించిన కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది.

  • మెడికల్ కాలేజ్​లో ర్యాగింగ్..

suryapet Student Ragging Case : సూర్యాపేట వైద్యకళాశాలలో ర్యాగింగ్‌ ఘటనలో ఆరుగురు విద్యార్థులపై కేసు నమోదైంది. మంత్రి హరీశ్‌రావు ఆదేశాలతో ఉన్నతాధికారులు రంగంలోకి దిగారు. వైద్య కళాశాల వసతిగృహానికి వెళ్లిన డీఎస్పీ మోహన్‌కుమార్.. ఆరోపణలు ఎదుర్కొంటున్న 30 మంది విద్యార్థులను ప్రశ్నించారు.

  • లాక్​డౌన్‌పై డీహెచ్​ క్లారిటీ

DH Srinivas Interview: ప్రతి ఒక్కరూ తమ పిల్లలకు వ్యాక్సిన్ వేయించేందుకు ముందుకు రావాలని ప్రజారోగ్య సంచాలకులు శ్రీనివాసరావు సూచించారు. జనవరి చివరివారం నుంచి లాక్​డౌన్ పెడతారన్న ఊహాగానాలకు ఆయన చెక్ పెట్టారు.

  • 'ఏపీలో పార్టీ పెట్టడంపై షర్మిల రెస్పాన్స్ ఇదే..!

YS Sharmila sensational comments : ఏపీలో పార్టీ పెట్టడంపై వైతెపా అధ్యక్షురాలు వైఎస్ షర్మిల స్పందించారు. రాజకీయ పార్టీ ఎక్కడైనా పెట్టొచ్చని అన్నారు. పార్టీ పెట్టకూడదని రూల్‌ ఏం లేదు కదా? అని మీడియా చిట్​చాట్​లో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

  • ' థర్డ్ వేవ్​కు ముగింపు అప్పుడే'

IIT Kanpur Professor On Third Wave: భారత్​లో 2022, ఏప్రిల్ వరకు కరోనా థర్డ్​వేవ్​ వ్యాప్తి ఉంటుందని ఐఐటీ కాన్పుర్​ ప్రొఫెసర్ మహీంద్ర అగర్వాల్ తెలిపారు. ఎన్నికల ర్యాలీలు సూపర్ స్ప్రెడర్​లుగా మారతాయని హెచ్చరించారు.

  • 'ప్రధాని అహంకారి'..​!

Satya Pal Malik Attacks PM Modi: ప్రధాని మోదీ ప్రభుత్వాన్ని ఇరుకున పడేసే సంచలన వ్యాఖ్యలు చేస్తూ తరచూ వార్తల్లో నిలుస్తున్నారు మేఘాలయ గవర్నర్‌ సత్యపాల్‌ మాలిక్‌. తాజాగా ప్రధాని నరేంద్ర మోదీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రైతుల ఆందోళనలపై చర్చించిన సమావేశంలో ప్రధాని చాలా అహంకారిగా ప్రవర్తించారని చెప్పారు.

  • 'కేసులు పెట్టారని భయపడొద్దు'

JP NADDA About Bandi Sanjay Deeksha: జీవో 317 కు వ్యతిరేకంగా భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్​ చేస్తున్న పోరాటం అమోఘమని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అన్నారు. ఈ మేరకు బండి సంజయ్​ను ఫోన్​లో పరామర్శించారు. పోరాటంలో ముందుకెళ్లాలని సూచించారు. అనంతరం రాష్ట్ర ప్రభుత్వ చర్యలను ఖండిస్తూ ట్విటర్​ ద్వారా వీడియో విడుదల చేశారు.

  • ఈ త్రైమాసికంలో 24 సంస్థలు సిద్ధం!

IPOs in march quarter: ఈ ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో పెద్ద ఎత్తున ఐపీఓలు సందడి చేయనున్నాయి. హోటల్ అగ్రిగేటర్‌ ఓయో, సప్లయ్‌ చైన్‌ సంస్థ 'డెలివరీ', అదానీ విల్మర్‌, వేదాంత్ ఫ్యాషన్ సహా 24 సంస్థలు పబ్లిక్ ఇష్యూలకు రానున్నాయి.

  • 'ఆర్ఆర్ఆర్' అన్ని కోట్ల ఖర్చా?

RRR movie: 'ఆర్ఆర్ఆర్' చిత్రం మళ్లీ వాయిదా పడేసరికి దేశవ్యాప్తంగా సినీ అభిమానులందరూ నిరుత్సాహపడ్డారు. అయితే సినిమా ప్రమోషన్స్​ కోసం చేసిన ఖర్చు గురించి ఆసక్తికర సమాచారం బయటకొచ్చింది. ఆ మొత్తం ఎంతంటే?

  • టీమ్​ఇండియాకు బలం అదే..

IND vs SA Test: దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టెస్టులో విజయం సాధించిన టీమ్​ఇండియా ప్రస్తుతం జరుగుతున్న రెండో టెస్టు గెలుపుపైనా కన్నేసింది. ఈ మ్యాచ్​లోనూ గెలిస్తే భారత జట్టు చరిత్ర తిరగరాసినట్టవుతుంది. ఈ నేపథ్యంలో ఇరు జట్ల ప్రస్తుత పరిస్థితి ఎలా ఉంది? భారత బౌలింగ్‌ యూనిట్‌గా ఎలా ఉంది? గతంలో విదేశాల్లో మన బౌలర్లు ఎలాంటి ప్రదర్శన చేశారు? వంటి విశేషాల సమాహారమే ఈ కథనం.

ABOUT THE AUTHOR

...view details