తెలంగాణ

telangana

ETV Bharat / city

ఈటీవీ భారత్- ముఖ్యాంశాలు - TOP NEWS

TOP NEWS
ఈటీవీ భారత్- ముఖ్యాంశాలు

By

Published : Dec 18, 2021, 5:55 AM IST

Updated : Dec 18, 2021, 9:55 PM IST

21:49 December 18

టాప్​ న్యూస్​ @10PM

  • స్వర్ణదేవాలయంలోకి చొరబడిన ఆగంతుకుడు.. కొట్టి చంపిన భక్తులు!

Golden Temple Death: పంజాబ్‌ అమృత్‌సర్‌లోని స్వర్ణదేవాలయాన్ని అపవిత్రం చేశాడన్న కారణంతో ఓ యువకుడ్ని కొట్టి చంపారు కొందరు భక్తులు. ఈ ఘటనపై పూర్తిస్థాయిలో దర్యాప్తు చేపట్టినట్లు అమృత్​సర్ డీఎస్పీ పరమీందర్ సింగ్ బందాల్​ తెలిపారు.

  • కంటోన్మెంట్​ను జీహెచ్​ఎంసీలో కలపాలని మంత్రి కేటీఆర్​ ప్రతిపాదన

KTR On Cantonment Roads: సికింద్రాబాద్​ కంటోన్మెంట్​ రోడ్ల మూసివేతపై మంత్రి కేటీఆర్​ స్పందించారు. అక్రమంగా రోడ్లు మూసివేయటాన్ని ఖండిస్తూ.. కేంద్రమంత్రులకు ట్వీట్​ చేశారు. కనీస వసతులు కల్పించకపోతే.. కంటోన్మెంట్​ను జీహెచ్​ఎంసీలో విలీనం చేయాలని మంత్రి ప్రతిపాదించారు.

  • లక్షలాది నగ్న చిత్రాలు, వీడియోలతో మ్యుజిషియన్‌ అరెస్ట్​!

Child Pornography News: లక్షలాది చిన్న పిల్లల నగ్న చిత్రాలు, వీడియోల్ని సేకరించిన ఓ సంగీతకారుడిని ఇటలీ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుని నుంచి వాటిని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.

  • బ్రిటన్​లో రెండు వారాలపాటు లాక్​డౌన్​?

Uk Lockdown: ఈ నెల చివర్లో రెండు వారాల పాటు సడలింపులతో కూడిన లాక్​డౌన్ విధించేందుకు బ్రిటన్ ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తున్నట్లు తెలుస్తోంది. దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకోనుందని సమాచారం.

  • 'పుష్ప' ఫస్ట్ డే కలెక్షన్.. ఈ ఏడాది సరికొత్త రికార్డు

Pushpa first day Collection: బన్నీ 'పుష్ప' సినిమాతో దుమ్ములేపుతున్నారు. ఓ వైపు థియేటర్లలో ఈలలు, గోల.. మరోవైపు అదిరిపోయే రేంజ్​లో వసూళ్లు. ఈ క్రమంలో తొలిరోజు భారీస్థాయిలో కలెక్షన్లు రాబట్టిందీ సినిమా.

21:10 December 18

టాప్​ న్యూస్​ @9PM

  • రాష్ట్రంలో మరో 12 ఒమిక్రాన్‌ వేరియంట్‌ కేసులు

Telangana Omicron Cases: రాష్ట్రంలో మరో 12 ఒమిక్రాన్‌ వేరియంట్‌ కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 20కి చేరింది. రిస్క్‌ దేశాల నుంచి నలుగురిలో ఒమిక్రాన్ వేరింయట్​ను గుర్తించారు. నాన్‌రిస్క్ దేశాల నుంచి వచ్చిన 16 మందిలో ఒమిక్రాన్ గుర్తించగా... మరో ముగ్గురి జీనోమ్ సీక్వెన్స్‌ ఫలితాలు పెండింగ్‌లో ఉన్నాయి. 12 మందిలో 9 మంది విదేశీయుల కాగా... ముగ్గురు భారతీయులని అధికారులు తెలిపారు.

  • దిల్లీకి చేరుకున్న రాష్ట్ర మంత్రులు, ఎంపీల బృందం

Ministers and MPs Delhi Tour: రాష్ట్రంలో యాసంగి ధాన్యం కొనుగోళ్లపై కేంద్రంతో అమీతుమీ తేల్చుకునేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఈ మేరకు తెరాస ప్రతినిధుల బృందం దిల్లీకి చేరుకుంది. మంత్రులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, గంగుల కమలాకర్, ఎర్రబెల్లి, జగదీశ్​ రెడ్డి, పువ్వాడ, వేముల ప్రశాంత్ రెడ్డితోపాటు పలువురు పార్లమెంట్ సభ్యుల బృందం హస్తినను చేరింది.

  • యువ రెజ్లర్​ చెంపపై కొట్టిన ఎంపీ

WFI President: యువ రెజ్లర్​ను భాజపా ఎంపీ చెంపదెబ్బకొట్టిన ఘటన ఝార్ఖండ్​ రాంచీలో జరిగింది. అండర్-15 జాతీయ రెజ్లింగ్ పోటీలు జరుగుతండగా ఈ సంఘటన చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్​గా మారింది.

  • బీసీసీఐకి షాక్‌.. కీలక అధికారి రాజీనామా

BCCI News Today: బీసీసీఐ చీఫ్ మెడికల్ ఆఫీసర్ అభిజిత్ సాల్వి రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాల రీత్యా ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు ఆయన వెల్లడించారు.

  • మిలియన్ డాలర్​ క్లబ్​లో 'పుష్ప

Pushpa collection: 'పుష్ప' చిత్రానికి సంబంధించిన కొత్త విశేషాలు వచ్చేశాయి. పార్ట్-2 షూటింగ్, యూఎస్​ కలెక్షన్లు, సక్సెస్​ మీట్​ గురించి ఈ స్టోరీలో ఉన్నాయి.

19:53 December 18

టాప్​ న్యూస్​ @8PM

  • 'వచ్చే ఏడాది ప్రారంభంలో కరోనా థర్డ్​ వేవ్​'

Third Wave In India: ఒమిక్రాన్ వేరియంట్​ కారణంగా దేశంలో వచ్చే ఏడాది ప్రారంభంలో థర్డ్​ వేవ్​ వచ్చే అవకాశం ఉందని జాతీయ కొవిడ్​-19 సూపర్​మోడల్ కమిటీ తెలిపింది. థర్డ్​ వేవ్​ కారణంగా దేశంలో రోజువారీ కరోనా కేసుల సంఖ్య భారీ స్థాయిలో పెరుగుతుందని చెప్పింది. దేశంలో ఒమిక్రాన్ సామాజిక వ్యాప్తి ప్రారంభమైందని అంచనా వేసింది.

  • 'రాష్ట్రాన్ని ఎలా కొల్లగొట్టాలనేదే కేసీఆర్‌ ఆలోచన'

Revanth reddy padayatra: రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే ఆలోచన కేసీఆర్​కు లేదని పీసీసీ అధ్యక్షుడు రేవంత్​ రెడ్డి విమర్శించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి చమురు, నిత్యావసర ధరలను పెంచి సామాన్యుల నడ్డి విరుస్తున్నాయని మండిపడ్డారు. ముడిమ్యాల నుంచి చేవెళ్ల వరకు పాదయాత్ర అనంతరం చేవెళ్లలో నిర్వహించిన బహిరంగ సభలో రేవంత్​ మాట్లాడారు.

  • 'హిందుత్వవాదులే గంగానదిలో ఒంటరిగా స్నానం చేస్తారు'

Rahul Hindutvawadi: ప్రధాని నరేంద్రమోదీపై మరోసారి విమర్శలు గుప్పించారు కాంగ్రెస్​నేత రాహుల్​గాంధీ. హిందుత్వవాది ఒంటరిగా గంగానదిలో స్నానం చేస్తాడని, హిందువు కోట్లమందితో కలిసి స్నానం చేస్తాడన్నారు రాహుల్​.

  • ఫెడ్ నిర్ణయాలతో భారత మార్కెట్​లో ఒడుదొడుకులు ఎందుకు?

Fed Decision Indian Market: అమెరికాలో వడ్డీరేట్లు పెరిగితే మన షేర్లు ఎందుకు పడిపోతాయి? అక్కడి నిర్ణయాలు ఇక్కడి మార్కెట్లను ఎందుకు ప్రభావితం చేస్తాయి? విదేశీయులు భారత్‌లో ఎందుకు మదుపు చేస్తారు?.. ఈ ప్రశ్నలకు సమాధానం మీకోసం..

  • 'వచ్చే ఐపీఎల్​లో ఆ జట్టులోనే ఆడాలనుంది'

Ashwin IPL: వచ్చే ఏడాది ఐపీఎల్​ సీజన్​ కోసం మెగా వేలం ప్రక్రియ త్వరలోనే ప్రారంభం కానున్న నేపథ్యంలో టీమ్​ఇండియా స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ కీలక వ్యాఖ్యలు చేశాడు. వచ్చే ఏడాది ఏ జట్టులో ఆడాలనుందో చెప్పేశాడు.

18:47 December 18

టాప్​ న్యూస్​ @7PM

  • ఈనెల 28 నుంచి రైతుబంధు పంపిణీ

తెలంగాణ ప్రభుత్వం రైతులకు శుభవార్త తెలిపింది. ఈనెల 28 నుంచి రైతుబంధు పంపిణీ చేయనున్నట్లు సీఎం కేసీఆర్​ ప్రకటించారు. ప్రారంభించిన 10 రోజుల్లో అందరికీ నగదు జమ పూర్తి అయ్యేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

  • 'ఒమిక్రాన్'​తో మరో ముప్పు తప్పదా?

India omicron variant: కరోనా ఒమిక్రాన్ వేరియంట్​​... ప్రపంచ దేశాలను ఈ పేరు వణికిస్తోంది. మనదేశంలోనూ ఒమిక్రాన్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. మరోవైపు.. టీకాలు తీసుకున్నవారూ ఈ వేరియంట్​ కారణంగా వైరస్ బాధితులుగా మారుతుండడం ఆందోళన కలిగిస్తోంది. మరి 'ఒమిక్రాన్'ను ఎదుర్కోవడమెలా? దేశంలో ఒమిక్రాన్​తో థర్డ్​ వేవ్ తప్పదా? దీనిపై వైద్య నిపుణులు ఏమంటున్నారంటే..?

  • 'అలాంటి చర్యలతోనే ఒమిక్రాన్​కు అడ్డుకట్ట'

WHO On Omicron: ఒమిక్రాన్ వేరియంట్ ప్రపంచ దేశాలకు ఆందోళన కలిగిస్తోంది. ఈ క్రమంలో డబ్ల్యూహెచ్​ఓ కీలక ఆదేశాలు జారీ చేసింది. కొవిడ్​-19 నిబంధనలు​, మాస్కు ధరించడం, భౌతిక దూరం పాటిచడం వంటి తక్షణ చర్యలు చేపట్టాలని సూచించింది.

  • లివర్​లో గర్భం దాల్చిన మహిళ

Fetus Inside Liver: సాధారణంగా మహిళలు గర్భం దాల్చినప్పుడు గర్భాశయంలో పిండం ఏర్పడుతుంది. కానీ కెనడాలో ఓ మహిళ లివర్​లో పిండాన్ని గుర్తించి వైద్యులు షాక్ అయ్యారు. ఇలా అత్యంత అరుదుగా జరుగుతుందని తెలిపారు. ఆమెకు చికిత్స అందించారు.

  • డే/నైట్ టెస్టులో స్టార్క్ సరికొత్త రికార్డు

Ashes 2021: యాషెస్​ సిరీస్​లోని ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ రెండో టెస్టులో భాగంగా ఆసీస్ పేసర్ మిచెల్ స్టార్క్ అరుదైన ఘనత సాధించాడు. డే/నైట్ టెస్టుల్లో 50 వికెట్లు తీసిన తొలి బౌలర్​గా నిలిచాడు.

18:04 December 18

టాప్​ న్యూస్​ @6PM

  • పిల్లల గొంతు కోసి తానూ గొంతుకోసుకున్న తల్లి

Mother Suicide Attempt: వేములవాడలో పిల్లలతో సహా ఓ తల్లి ఆత్మహత్యాయత్నం చేసింది. జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలానికి చెందిన మమత, కుమార్తె అక్షయ, వరుణ్​తేజతో పాటు తానూ గొంతుకోసుకుంది. వీరిని గమనించిన స్థానికులు సిరిసిల్ల ఆస్పత్రికి తరలించారు. తక్షణ చికిత్స వల్ల ముగ్గురికి ప్రాణాపాయం తప్పింది.

  • డీఎస్పీపై రాజాసింగ్​ ఫైర్

Rajasingh fire on DSP: పుష్ప చిత్రం మరోసారి వివాదంలో నిలిచింది. హైప్​ క్రియేట్​ చేయటంలో.. జనాల్లోకి దూసుకెళ్లిపోవటంలో.. విడుదలై కలెక్షన్లు సాధించటంలో తగ్గేదేలే అంటున్న పుష్ప.. వివాదాల్లోనూ తగ్గటం లేదు. ఊ అంటావా.. ఊఊ అంటావా.. అంటూ మాస్​ జనాలకు ఉర్రూతలూగిస్తోన్న పాట విడుదలైనప్పటి నుంచే వివాదాల్లో ఉంటోంది. తాజాగా దాన్ని స్వరపరిచిన డీఎస్పీ కూడా ఈ వివాదాల్లో చిక్కుకోక తప్పలేదు. ఏకంగా భాజపా ఎమ్మెల్యే రాజాసింగే.. వార్నింగ్​ ఇచ్చేంతగా డీఎస్పీ ఏం చేశాడంటే..?

  • హిమాచల్​లో భారీ హిమపాతం

Snowfall In Kinnaur: హిమాచల్​ ప్రదేశ్​ను మంచు దుప్పటి కప్పేసింది. రాష్ట్రంలోని గిరిజన జిల్లా కిన్నౌర్​లో భారీగా మంచు కురుస్తోంది. హిమపాతం కారణంగా వాహనాల రాకపోకలు రద్దు చేశారు అధికారులు. జిల్లాలోని చిత్కుల్, రఖమ్ ప్రాంతాలు పూర్తిగా హిమంతో నిండిపోయాయి. నెసాంగ్, హాంగ్​రాంగ్ వ్యాలీ ప్రాంతాలు 10 అంగుళాల మేర మంచుతో నిండిపోయినట్లు అధికారులు తెలిపారు.

  • ఏడేళ్ల బాలికపై 14 ఏళ్ల బాలుడు అత్యాచారం

Jaipur girl child rape case: ఏడేళ్ల బాలికపై 14 ఏళ్ల బాలుడు అత్యాచారం చేశాడు. రాజస్థాన్​, జైపుర్​లోని శాస్త్రి నగర్​ ప్రాంతంలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.

  • బాలయ్యతో సినిమా.. రాజమౌళి భయం అదే!

Unstoppable with nbk: 'అన్​స్టాపబుల్ విత్ ఎన్​బీకే' షోకు వచ్చిన స్టార్ డైరెక్టర్ రాజమౌళి.. పలు ఆసక్తికర విషయాల్ని చెప్పారు. 'మగధీర' కథ మొదట బాలయ్య దగ్గరికే తీసుకెళ్లిన అంశాల్ని గుర్తుచేసుకున్నారు.

16:50 December 18

టాప్​ న్యూస్​ @5PM

  • 'యాసంగిలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఉండవు'

"యాసంగిలో కేంద్రం వడ్లు కొనటం లేదు. కాబట్టి యాసంగిలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఉండవు. కేంద్ర వైఖరిని రైతులకు అర్థమయ్యేలా చెప్పాలి. ప్రత్యామ్నాయ, లాభసాటి పంటల దిశగా రైతులను మళ్లించాలి. రైతుల్లో అవగాహన పెంచే బాధ్యత అధికారులు తీసుకోవాలి. వచ్చే వానాకాలం పంటలపై ముందస్తు ప్రణాళికలను సిద్ధం చేయాలి. వానాకాలంలో ప్రధానంగా పత్తి, వరి, కంది సాగుపై దృష్టిపెట్టాలి." - కేసీఆర్​, సీఎం

  • స్థానికుల మూర్ఖత్వం.. శవ యాత్రకు ఆటంకం

హనుమకొండ జిల్లా ఐనవోలులో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. ఇంటి ముందు నుంచి దారి లేదంటూ ఇరుగుపొరుగు ఇళ్ల యజమానులు శవయాత్రకు ఆటంకం కలిగించారు. దారి మూసివేత వల్ల మృతదేహాన్ని శ్మశానవాటికకు తీసుకెళ్లలేని పరిస్థితి ఉంది.

  • బెళగావిలో విధ్వంసం- 27మంది అరెస్టు

Belagavi news: కర్ణాటక బెళగావిలో 27మంది నిరసనకారులను పోలీసులు అరెస్టు చేశారు. ఆ ప్రాంతంలో 144 సెక్షన్ విధించారు. అరెస్టయినవారికి కోర్టు 14 రోజుల జ్యుడిషియల్​ కస్టడీ విధించింది. శివాజీ మహరాజ్​ విగ్రహం అపవిత్రం చేశారని బెళగావిలో కొంతమంది చేపట్టిన ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. నిరసనకారులు సంగోలి రాయన్న విగ్రహం సహా 26 ప్రభుత్వ వాహనాలను ధ్వంసం చేశారు. దీంతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.

  • మురుగు కాలువలో గ్యాస్​ పేలుడు- 12 మంది మృతి

Pakistan karachi Explosion: మురుగు కాలువలో పేరుకుపోయిన ఓ శక్తిమంతమైన గ్యాస్​ కారణంగా భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 12 మంది మరణించారు. మరో 10 మందికిపైగా గాయాలయ్యాయి. పాకిస్థాన్​లోని కరాచీలో ఈ ఘటన జరిగింది.

  • కేఎల్ రాహుల్​కు బంపర్ ఆఫర్

IND vs SA Test: దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్​లో భాగంగా టీమ్​ఇండియా ఓపెనర్​ కేఎల్​ రాహుల్​కు కీలక బాధ్యతలు చేపట్టనున్నట్లు తెలుస్తోంది. గాయం కారణంగా జట్టుకు దూరమైన రోహిత్​ శర్మ స్థానంలో వైస్​ కెప్టెన్ బాధ్యతలు నిర్వర్తించనున్నాడట.

15:56 December 18

టాప్​ న్యూస్​ @4PM

  • రాజకీయ పార్టీని ప్రకటించిన రైతు నేత గుర్నామ్​ సింగ్​

సంయుక్త కిసాన్​ మోర్చా సభ్యుడు, సాగు చట్టాలపై ఏడాదికిపైగా పోరాటం చేసిన రైతు నేత గుర్నామ్​ సింగ్ చఢూనీ.. కొత్త రాజకీయ పార్టీని ప్రకటించారు. వచ్చే ఏడాది జరిగే పంజాబ్​ అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ పోటీ చేస్తుందని తెలిపారు. రాజకీయాలను ప్రక్షాళన చేయటమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు.

  • సరిహద్దుల్లో డ్రోన్​ కలకలం

Drone BSF: పంజాబ్​లోని ఇండో-పాక్​ సరిహద్దు వద్ద మరోమారు డ్రోన్​ కలకలం సృష్టించింది. పంజాబ్‌లోని ఫిరోజ్‌పుర్‌ సెక్టార్‌లో ఓ డ్రోన్‌ను శుక్రవారం రాత్రి కూల్చివేసినట్లు బీఎస్​ఎఫ్​ ఓ ప్రకటనలో తెలిపింది.

  • భవనంలో బాంబు పేలుడు- 10 మంది మృతి

ఓ భవనంలో బాంబు పేలగా.. పది మంది మరణించారు. పలువురికి గాయాలయ్యాయి. పాకిస్థాన్​ కరాచీలోని శేర్​షా పరాచా చౌక్ ప్రాంతంలో శనివారం మధ్యాహ్నం ఈ ఘటన జరిగింది.

  • తుపాను బీభత్సం.. 19 మంది మృతి

Philippines Typhoon: ఫిలిప్పీన్స్​ను రాయ్​ తుపాను అతలాకుతలం చేసింది. పెనుగాలులతో యావత్​ దేశం మొత్తం విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది. సమాచార, రవాణా వ్యవస్థలు స్తంభించిపోయాయి. భారీ వర్షాల కారణంగా 19 మంది ప్రాణాలు కోల్పోయారు.

  • ఐపీఎల్​లోకి గంభీర్​ రీఎంట్రీ

Gautam Gambhir mentor: టీమ్​ఇండియా మాజీ ఓపెనర్​ గౌతమ్ గంభీర్ ఐపీఎల్​లోకి రీఎంట్రీ ఇవ్వనున్నాడు. ఐపీఎల్​ రాబోయే సీజన్​లో లఖ్​నవూ జట్టుకు మెంటార్​గా వ్యవహరించనున్నాడు. ​

14:39 December 18

టాప్​ న్యూస్​ @3PM

  • కలెక్టర్లతో సీఎం కేసీఆర్‌ భేేటీ

ప్రగతిభవన్‌లో జిల్లాల కలెక్టర్లతో సీఎం కేసీఆర్‌ సమావేశమయ్యారు. దళితబంధు, వ్యవసాయం, ప్రభుత్వ పథకాల అమలు, ధాన్యం సేకరణ, తదితర అంశాలపై చర్చిస్తున్నారు. యాసంగిలో పంటలసాగుపై సీఎం కేసీఆర్​ దిశానిర్దేశం దిశానిర్దేశం చేస్తున్నారు.

  • లారీని ఢీకొన్న కారు.. ఆరుగురు దుర్మరణం

కామారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. జిల్లాలోని బిచ్కుంద మండలం జగన్నాథ్​పల్లి గేట్​ వద్ద ఆగి ఉన్న లారీని కారు ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఆరుగురికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానికులు బాన్సువాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వీరి పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.

  • గంగా ఎక్స్​ప్రెస్​వేకు ప్రధాని శంకుస్థాపన

Ganga Expressway: ఉత్తర్​ప్రదేశ్​లోని షాహ్​జహాన్​పుర్​ వద్ద గంగా ఎక్స్​ప్రెస్​వేకు శంకుస్థాపన చేశారు ప్రధాని నరేంద్ర మోదీ. 594 కిలోమీటర్ల పొడవు ఉన్న ఈ సిక్స్​లేన్​ ఎక్స్​ప్రెస్​వేను రూ.36,200 కోట్లతో నిర్మిస్తున్నారు.

  • 'వియత్నాంలో పిల్లలకు కొవాగ్జిన్​​'పై భారత్​ బయోటెక్ చర్చలు!

Covaxin for children: వియత్నాం ఆరోగ్య శాఖ సహాయ మంత్రితో భారత్ బయోటెక్ ఛైర్మన్ కృష్ణ ఎల్లా సమావేశమయ్యారు. ఆ దేశంలో పిల్లలకు కొవాగ్జిన్ టీకా విషయంపై భేటీలో చర్చించినట్లు తెలుస్తోంది. కృష్ణ ఎల్లా సతీమణి సుచిత్ర ఎల్లా కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు.

  • ఫ్యాన్స్​ చేతుల మీదుగా 'రాధేశ్యామ్​' ట్రైలర్​ లాంచ్​

Radhe Shyam Trailer: డార్లింగ్ ప్రభాస్ అభిమానులకు శుభవార్త. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న 'రాధేశ్యామ్'​ ట్రైలర్​ను ఫ్యాన్స్​ చేతుల మీదుగా విడుదల చేయాలని నిర్ణయించింది నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్​. ఈ నెల 23న జరగనున్న ప్రీ రిలీజ్​ ఈవెంట్​కు అభిమానులనే అతిథులుగా పిలిచిన మేకర్స్​.. వారిచేత ట్రైలర్​ లాంచ్​ చేయించనున్నారు.

13:52 December 18

టాప్ న్యూస్​@ 2PM

  • ప్రగతి భవన్ వద్ద ఆత్మహత్యాయత్నం..

Family suicide attempt at Pragati Bhavan : ప్రగతి భవన్ ముందు ఓ కుటుంబం ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నానికి చెందిన భార్య, భర్త, ముగ్గురు పిల్లలు పెట్రోల్ పోసుకున్నారు.

  • ఇంటర్ ఫలితాలపై బోర్డు వివరణ..

TS Inter results: ఇంటర్ మొదటి సంవత్సరంలో ఉత్తీర్ణులు కాని విద్యార్థులు మళ్లీ వార్షిక పరీక్షల వరకు ఆగాల్సిందేనని ఇంటర్‌ బోర్డు తెలిపింది. ఏప్రిల్‌లో జరగనున్న వార్షిక పరీక్షల్లో ద్వితీయ సంవత్సరంతో పాటు ఫెయిలైన సబ్జెక్టులు రాసుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేసింది.

  • 'అగ్ని-ప్రైమ్' విజయవంతం

Agni Prime Missile: 'అగ్ని-ప్రైమ్' క్షిపణిని రక్షణ శాఖ విజయవంతంగా పరీక్షించింది. అధునాతన ఫీచర్లతో దీనిని అభివృద్ధి చేసినట్లు తెలిపింది.

  • కలెక్షన్స్​లో తగ్గేదే లే!

Pushpa Collections: అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన పాన్ ఇండియా మూవీ 'పుష్ప'. ఈ చిత్రం శుక్రవారం థియేటర్లలో విడుదలైంది. ఈ నేపథ్యంలో మూవీ కలెక్షన్లు ఎలా ఉన్నాయో చూద్దాం.

  • క్రికెట్ చరిత్రలో సుదీర్ఘ టెస్టు ఇదే..

12:54 December 18

టాప్ న్యూస్​@ 1PM

  • 'మధ్యవర్తిత్వంలో ఐఏఎంసీది కీలకపాత్ర'..

IAMC Hyderabad Inauguration : తాను అడగగానే అంతర్జాతీయ ఆర్బిట్రేషన్, మీడియేషన్ కేంద్రాన్ని(ఐఏఎంసీ) హైదరాబాద్​లో ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్​కు సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ కృతజ్ఞతలు తెలిపారు. రాజీ, మధ్యవర్తిత్వంలో ఐఏఎంసీ కీలకపాత్ర వహిస్తుందని పేర్కొన్నారు.

  • ఇంటర్ బోర్డు వద్ద ఉద్రిక్తత..

High Tension at Inter Board office : ఇంటర్ బోర్డు కార్యాలయం వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఏబీవీపీ కార్యకర్తలు... ఇంటర్ బోర్డు కార్యాలయాన్ని ముట్టడించిన నేపథ్యంలో... ఏబీవీపీ కార్యకర్తలు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. ఇంటర్ మొదటి సంవత్సర ఫలితాలను నిరసిస్తూ ఏబీవీపీ ఆందోళన చేపట్టింది.

  • మతం మారితే 10 ఏళ్ల జైలు శిక్ష..

Anti-conversion bill in Karnataka: బలవంతపు మతమార్పిడిలను అరికట్టేందుకు కొత్త బిల్లును.. ప్రస్తుతం జరుగుతోన్న అసెంబ్లీ సమావేశాల్లోనే తీసుకురావాలని ప్రణాళికలు రచిస్తోంది కర్ణాటక ప్రభుత్వం. దీని ద్వారా మత మార్పిడిలకు పాల్పడితే గరిష్ఠంగా 10 ఏళ్లు జైలు శిక్ష, రూ.50 వేల వరకు జరిమానా విధించనున్నారు.

  • 'పుష్ప పార్ట్ 2'తో ఏం చెప్పబోతున్నారు?

Pushpa 2 Movie: దేశవ్యాప్తంగా థియేటర్లలో 'పుష్ప'రాజ్ హవా కొనసాగుతోంది.తొలి భాగంలో ఎర్రచందనం స్మగ్లింగ్‌ మాఫియాను శాసించే స్థాయికి ఎదిగిన పుష్పరాజ్​ రెండో పార్ట్​లో ఏం చేయబోతున్నాడన్నది ఆసక్తికరంగా మారింది.

  • ఎదురులేని రూట్..

Roe Root Test Record: ఇంగ్లాండ్ టెస్టు సారథి జో రూట్ అద్భుత రికార్డు కైవసం చేసుకున్నాడు. టెస్టు క్రికెట్​లో ఓ ఏడాదిలో ఎక్కువ పరుగులు సాధించిన బ్యాటర్ల జాబితాలో ఐదో స్థానానికి చేరుకున్నాడు. ఈ క్రమంలోనే టీమ్ఇండియా దిగ్గజ క్రికెటర్లు సచిన్, గావస్కర్​లను దాటేశాడు.


11:49 December 18

టాప్ న్యూస్​@ 12PM

  • ఐఏఎంసీని ప్రారంభించిన సీజేఐ..

IAMC Hyderabad Inauguration : దేశంలోనే తొలి అంతర్జాతీయ ఆర్బిట్రేషన్, మీడియేషన్ కేంద్రం హైదరాబాద్​లో ఏర్పాటైంది. హైదరాబాద్​ నగరంలోని నానక్​రామ్​గూడ ఫొనిక్స్ వీకే టవర్​లో ఏర్పాటు చేసిన ఈ కేంద్రాన్ని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ ప్రారంభించారు.

  • ప్రాణాలివ్వడానికైనా వెనకడుగు వేయొద్దు..

Passing out parade : దుండిగల్ ఎయిర్‌ఫోర్స్‌ అకాడమీలో పాసింగ్ ఔట్‌ పరేడ్ నిర్వహించారు. పరేడ్‌కు ఎయిర్ చీఫ్ మార్షల్ వివేక్ రామ్ చౌదరి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా దేశమే ప్రథమం కావాలని సూచించారు. సీడీఎస్ రావత్ మరణం దురదృష్టకరమని ఆయన అన్నారు.

  • టాయిలెట్లు కడిగిన మంత్రి

Minister toilet cleaning: మధ్యప్రదేశ్ మంత్రి ప్రద్యుమన్ సింగ్ తోమర్.. ఓ పాఠశాలలోని టాయిలెట్​లను స్వయంగా శుభ్రం చేశారు. శౌచాలయాలు దుర్గంధం వెదజల్లుతున్నాయని ఓ బాలిక ఇచ్చిన ఫిర్యాదుకు.. వెంటనే స్పందించారు.

  • కోహ్లీ అలాంటి రకం కాదు..

Rajkumar Sharma on Kohli: టీమ్ఇండియా టెస్టు సారథి విరాట్ కోహ్లీ దేనికి ఆశపడే రకం కాదని స్పష్టం చేశారు అతడి చిన్ననాటి కోచ్ రాజ్ కుమార్ శర్మ. ఒక్కసారి మైదానంలోకి దిగితే ఈ విషయాలన్నీ మర్చిపోతాడని చెప్పారు.

10:51 December 18

టాప్ న్యూస్​@ 11AM

  • కొత్తగా 7వేల మందికి కరోనా

Covid Cases in India: దేశంలో కొత్తగా 7,145 కరోనా కేసులు వెలుగులోకి వచ్చాయి. మరో 289 మంది వైరస్​కు బలయ్యారు.

  • '18ఏళ్లకు ఎందుకు పెళ్లి చేసుకోకూడదు?'

Asaduddin Owaisi: అమ్మాయిల కనీస వివాహ వయసు 21 ఏళ్లు చేయాలన్న ప్రతిపాదనను విమర్శించారు మజ్లీస్​ నేత అసదుద్దీన్​ ఓవైసీ. 18 ఏళ్ల యువతికి ప్రధానిని ఎన్నుకునే హక్కు ఉన్నప్పుడు వివాహం చేసుకోవడంలో తప్పేంటని ప్రశ్నించారు.

  • స్పుత్నిక్‌ లైట్‌ బూస్టర్‌తో 'ఒమిక్రాన్‌' దూరం

Omicron on Sputnik V: స్పుత్నిక్ రెండు డోసులకు తోడు.. స్పుత్నిక్ లైట్​ను బూస్టర్ డోసుగా తీసుకుంటే కరోనా ఒమిక్రాన్ వేరియంట్​ను ఎదుర్కోవచ్చని రష్యా వెల్లడించింది. స్పుత్నిక్‌ లైట్‌ బూస్టర్‌ తీసుకున్న వారందరిలో 2- 3 నెలల్లో యాంటీ బాడీలు బాగా అభివృద్ధి చెందాయని పేర్కొంది.

  • పర్యాటకులకు గుడ్​న్యూస్..

Papikondalu Boat Tourism resume: బోటు ప్రమాదంతో నిలిపివేసిన పాపికొండలు విహారయాత్ర... ప్రభుత్వాల అనుమతితో పునఃప్రారంభం కానుంది. ఇవాళ్టి నుంచి తెలుగురాష్ట్రాల పర్యాటకులను మరోసారి ఆనందాల్లో ముంచెత్తేందుకు పర్యాటకం సిద్ధమైంది.

  • సానియా వంటపై మాలిక్ ట్రోల్స్..

Shoaib Malik on Sania Mirza: భారత స్టార్ టెన్నిస్ ప్లేయర్ సానియా మీర్జాపై ఆసక్తికర కామెంట్స్ చేశాడు ఆమె భర్త, పాకిస్థాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్. ఆమెకు అసలు వంట రాదంటూ ఓ రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు సమాధానమిచ్చాడు.


09:53 December 18

టాప్ న్యూస్​@ 10AM

  • మూడు డోసులు తీసుకున్న వ్యక్తికి.. ఒమిక్రాన్!

కరోనా టీకా మూడు డోసులు తీసుకున్నప్పటికీ.. ఓ వ్యక్తికి ఒమిక్రాన్‌ పాజిటివ్​గా తేలింది. అమెరికా నుంచి ముంబయికి వచ్చిన వ్యక్తిలో ఒమిక్రాన్​ కేసు బయటపడింది. ప్రస్తుతం అతని ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.

  • 'సర్కార్ తప్పు వల్లే ఆత్మహత్యలు'

Bandi Sanjay on Students Suicide : తెరాస సర్కార్ తప్పులకు ఇంటర్ విద్యార్థులు బలవుతున్నారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. నూరేళ్లు బంగారు భవిష్యత్​తో బతకాల్సిన విద్యార్థుల బలవన్మరణాలు చూస్తుంటే గుండె తరుక్కుపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.

  • తగ్గిన బంగారం ధర..

Gold Rate Today: బంగారం, వెండి ధరల్లో క్రితం రోజుతో పోల్చితే స్వల్ప మార్పులు జరిగాయి. 10 గ్రాములు స్వచ్ఛమైన పసిడి ధర రూ.137 తగ్గింది. అందుకు భిన్నంగా వెండి.. స్వల్పంగా పెరిగింది.

  • సచిన్​తో స్నేహం చెక్కుచెదరనిది..

Sachin Vinod Kambli: క్రికెట్ దిగ్గజం సచిన్ తెందూల్కర్, మాజీ ఆటగాడు వినోద్ కాంబ్లీ బాల్యం నుంచి మంచి మిత్రులు. తాజాగా వారి ఫ్రెండ్​షిప్​ను గుర్తుచేసుకుంటూ సామాజిక మాధ్యమాల్లో ఓ ఫొటో పోస్ట్ చేశాడు కాంబ్లీ. ఇది నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తోంది.

08:46 December 18

టాప్ న్యూస్​@ 9AM

  • బడా ఇన్వెస్టర్లతో మోదీ భేటీ..

PM Modi global investors: వార్షిక బడ్జెట్ ముందస్తు చర్చల్లో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అగ్రశ్రేణి పెట్టుబడిదారులతో భేటీ అయ్యారు. పెట్టుబడులకు భారత్‌ ఆకర్షణీయ గమ్యస్థానం కావాలంటే ఏం చేయాలో సలహాలు స్వీకరించారు.

  • సిద్ధమైన 'పది కోర్టుల' న్యాయస్థానం..

CJI Justice NV Ramana Warangal Tour: లైంగిక దాడులకు గురైన బాలికలను విచారించే క్రమంలో వారు ఎలాంటి భయాలకు లోనుకాకుండా కోర్టులో భరోసా కల్పించేలా వాతావరణం ఉండాలని న్యాయమూర్తులు సూచిస్తుంటారు. ఈ మార్గదర్శకాలను అనుసరించి వరంగల్‌ నగరంలో కొత్తగా నిర్మించిన న్యాయస్థానంలో పలు సంస్కరణలకు శ్రీకారం చుట్టారు.

  • క్రమబద్ధీకరణపై చురుగ్గా కసరత్తు...

పేదలు ఆక్రమించుకుని ఇళ్లు నిర్మించుకున్న స్థలాల క్రమబద్ధీకరణపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిన నేపథ్యంలో పురపాలకశాఖ వివరాలను సిద్ధం చేస్తోంది. అయితే పేదల ఆక్రమణల క్రమబద్ధీకరణకే పరిమితం కావాలా? లేదా గతంలోలా ఇతరులకూ అవకాశం ఇవ్వాలా? అనే అంశంపై... సీఎం కేసీఆర్​ నిర్ణయం మేరకు ముందుకు వెళ్తామని ఉన్నతాధికారులు చెబుతున్నారు.

  • కొవిడ్​ నిమోనియాకు కొత్త విరుగుడు!

'నామిలుమాబ్‌' అనే యాంటీబాడీ ఔషధం కరోనాపై సమర్థవంతంగా పనిచేస్తున్నట్లు తేలింది. కొవిడ్‌-19 నిమోనియాతో ఆసుపత్రిపాలైన వారిపై జరిపిన ప్రయోగాల్లో ఈ విషయాన్ని గుర్తించారు బ్రిటన్‌ శాస్త్రవేత్తలు.

  • ఇంగ్లాండ్​కు ఐసీసీ షాక్​...

England WTC Points: మందకొడి బౌలింగ్​ కారణంగా ఇంగ్లాండ్​కు డబ్ల్యూటీసీ పాయింట్లలో విధించిన కోతను పెంచుతున్నట్లు ప్రకటించింది ఐసీసీ. ఇటీవల విధించిన ఐదు పాయింట్ల కోతను ఎనిమిదికి పెంచుతున్నట్లు పేర్కొంది.

07:49 December 18

టాప్ న్యూస్​@ 8AM

  • ఇద్దరు జూనియర్ ఆర్టిస్టులు మృతి

Gachibowli Road Accident Today : రంగారెడ్డి జిల్లా గచ్చిబౌలిలోని హెచ్​సీయూ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. అదుపుతప్పిన కారు డివైడర్​ మధ్యలో ఉన్న చెట్టును ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు జూనియర్ ఆర్టిస్టులు, కారు డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందారు.

  • గజగజలాడిస్తున్న చలి..

Temperatures decrease in telangana: రాష్ట్రంపై చలి పంజా విసురుతోంది. క్రమంగా ఉష్ణోగ్రతలు పడిపోతుండడంతో చలి తీవ్రత పెరిగి ప్రజలు గజగజ వణుకుతున్నారు. రానున్న వారం రోజుల పాటు ఉష్ణోగ్రతలు సాధారణంకన్నా నాలుగైదు డిగ్రీలు తగ్గి.. చలి తీవ్రత మరింత పెరుగుతుందని వాతావరణ కేంద్రం తెలిపింది.

  • సింగరేణికి మరో ముప్పు..

Singareni Coal Blocks Auction : సింగరేణి బొగ్గు గనులకు మరో ముప్పు పొంచి ఉంది. నాలుగో విడత వేలానికి కేంద్రం ఓ ప్రకటన జారీ చేసింది. మొత్తం వేలానికి రంగం సిద్ధం చేసిన 99 బొగ్గు బ్లాకుల్లో తెలంగాణనూ చేర్చింది. నాలుగో విడత బొగ్గు బ్లాకుల వేలానికి కేంద్రం సిద్ధమవుతుండటం సింగరేణిలో గుబులు రేపుతోంది.

  • 'న్యాయం' చేశారు..

Jai Bhim: ఈ ఏడాది తెలుగు చిత్రసీమలో నల్ల కోట్​లు సందడి చేశాయి. స్టార్​ హీరోల దగ్గర నుంచి చిన్న సినిమాల వరకు న్యాయవ్యవస్థ ఆధారంగా తీసిన సినిమాలు మంచి విజయాలను అందుకున్నాయి. పవర్​స్టార్​ పవన్ కల్యాణ్ 'వకీల్​సాబ్', సూర్య 'జై భీమ్'​ సహా ఈ నేపథ్యంలో వచ్చి హిట్​ అందుకున్న చిత్రాలపై ఓ లుక్కేయండి.

  • చరిత్ర సృష్టించేదెవరో?

World Badminton Championship 2021: స్పెయిన్​ వేదికగా జరుగుతున్నబ్యాడ్మింటన్​ ప్రపంచ ఛాంపియన్​షిప్​లో భాగంగా శనివరాం సెమీఫైనల్స్​ జరగనున్నాయి. భారత్​ తరపున శ్రీకాంత్​, లక్ష్యసేన్​ సెమీస్​లో ముఖాముఖి తలపడనున్నారు.

06:40 December 18

టాప్ న్యూస్​@ 7AM

  • డిగ్రీకి వచ్చినా నేలమీదే..

Gurukula Degree colleges: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన గురుకులాలకు కొత్త కష్టాలు ఎదురవుతున్నాయి. గురుకులాల్లో కనీస సౌకర్యాలు కరవవుతున్నాయి. కేజీ టూ పీజీ విద్యలో పేదలకు ఉచిత విద్య, పౌష్టికాహారంతో కూడిన వసతి కల్పిస్తున్నా ముందస్తు ప్రణాళికలు లేకపోవడంతో బాలారిష్టాలు తప్పడం లేదు.

  • రైతుబంధుపై స్పష్టత..!

Raithu bandhu:యాసంగి రైతుబంధు చెల్లింపుల కోసం రాష్ట్ర ప్రభుత్వం సిద్దమవుతోంది. రైతుల బ్యాంకు ఖాతాల్లో నగదు జమ చేసుకునేందుకు వీలుగా అవసరమైన మొత్తాన్ని సమీకరిస్తోంది. వానాకాలం పంటకు 7 వేల 377 కోట్ల రూపాయలను రైతుబంధు సాయంగా అందించింది.

  • ఎందుకు మాట తప్పారు..?

Amaravati Farmers Sabha: ఏపీ ఏకైక రాజధానిగా అమరావతిని ఒప్పుకునేదాకా.. రాజధాని పరిరక్షణ పోరాటం ఆపేదిలేదని అమరావతి రైతులు తేల్చిచెప్పారు. తిరుపతిలో పాదయాత్ర ముగింపు సభలో ఒకే రాష్ట్రం ఒకే రాజధాని అంటూ నినదించారు. ప్రభుత్వం తమను వేధిస్తోందని వాపోయారు

  • 'అలా జరిగితే భారత్​లో రోజుకు 14 లక్షల కేసులు'

covid surge in india: భారత్​లో కరోనా పరిస్థితులపై మరోసారి దేశ ప్రజలను కేంద్రం హెచ్చరించింది. బ్రిటన్​, ఫ్రాన్స్​ తరహా పరిస్థితులు మన దేశంలో నెలకొంటే రోజుకు 14 లక్షలకు పైగా కేసులు నమోదు అవుతాయని కరోనా టాక్స్​ఫోర్స్​ చీఫ్​ వీకే పాల్​ అన్నారు. కరోనా నిబంధనలు అందరూ కచ్చితంగా పాటించాలని కోరారు.

  • శృంగారంపై అవగాహన అవసరం...

Sex Education: తొలి కలయికలో సక్సెస్​ సాధించాలంటే శృంగారంపై సరైన అవగాహన అవసరం అని నిపుణులు అంటున్నారు. ఇందుకుగల కారణాలేంటో వివరిస్తున్నారు.

03:52 December 18

టాప్ న్యూస్​@ 6AM

  • ఓరుగల్లు పర్యటనకు సీజేఐ..

CJI NV Ramana Warangal Tour: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ రెండ్రోజులపాటు చారిత్రక నగరం వరంగల్‌లో పర్యటించనున్నారు. ప్రపంచ వారసత్వ సంపదగా యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప ఆలయాన్ని సీజేఐ ఇవాళ సందర్శిస్తారు. అనంతరం రాత్రి హనుమకొండలో బస చేసి రేపు నూతనంగా నిర్మించిన పది కోర్టుల భవనాన్ని ప్రారంభిస్తారు.

  • హైదరాబాద్​లో ప్రతిష్ఠాత్మక కేంద్రం

IAMC Inauguration: రాజధాని నగరంలో ప్రతిష్ఠాత్మక అంతర్జాతీయ ఆర్బిట్రేషన్, మీడియేషన్ కేంద్రం (ఐఏఎంసీ) నేడు ప్రారంభం కానుంది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ, ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించనున్నారు.

  • కేంద్రం వైఖరిపై నిరసనలు

CM KCR fire on BJP: ధాన్యం కొనుగోలుపై చేతులెత్తేసిన కేంద్రం వైఖరిపై ఈ నెల 20న నిరసనలు చేపడతామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఊరూరా చావు డప్పు మోగిస్తామని తెలిపారు. ఆ పార్టీ విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లి ఎండగడతామని, కేంద్రంతో తాడో పేడో తేల్చుకుంటామని పేర్కొన్నారు. రాష్ట్రంలో యథాతథంగా రైతుబంధు.. దశలవారీగా దళితబంధు అమలు చేస్తామన్నారు. హైదరాబాద్​లో జరిగిన తెరాస ప్రజా ప్రతినిధులు, పార్టీ నేతల సమావేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

  • నేడు కలెక్టర్లతో సీఎం సమావేశం

Collectors Meeting:వ్యవసాయం, దళితబంధు అంశాలు ప్రధాన ఎజెండాగా నేడు కలెక్టర్ల సమావేశం జరగనుంది. పథకాల అమలు, ప్రత్యామ్నాయ పంటల సాగుపై విస్తృతంగా చర్చించనున్నారు. హైదరాబాద్​లోని ప్రగతిభవన్ వేదికగా మంత్రులు, కలెక్టర్లతో సమావేశం కానున్న సీఎం కేసీఆర్ ఓ కార్యాచరణ ఖరారు చేసి వారికి మార్గనిర్దేశం చేయనున్నారు.

  • అట్టహాసంగా వింటర్‌ ఫెస్ట్‌

పర్యాటకుల స్వర్గధామం రామోజీ ఫిల్మ్‌ సిటీలో వింటర్‌ ఫెస్ట్‌ సంబరాలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. మిరుమిట్లు గొలిపే విద్యుద్దీపాల అలంకరణలు, లేజర్ తళుకులు, ప్రత్యేక వినోదాలు, కార్నివాల్ పరేడ్‌లతో చిత్రనగరి అందాలను తొలిరోజు సందర్శకులు ఆద్యంతం ఆస్వాదించారు. 45 రోజుల పాటు ఆటపాటలు, వినోదాలు, సరదా కార్యక్రమాలతో ఆబాల గోపాలానికి శీతాకాలపు ఉత్సాహాన్ని నింపనుంది

  • మరోసారి పరీక్షలు రాయొచ్చు

తెలంగాణలో జరిగిన ఇంటర్మీడియట్‌ మొదటి సంవత్సరం పరీక్షల్లో ఫెయిల్‌ అయిన విద్యార్థుల కోసం ఇంటర్‌ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. ఫెయిల్‌ అయిన వారికి వచ్చే ఏడాది ఏప్రిల్‌లోనే మరోసారి పరీక్షలు నిర్వహించనున్నట్లు బోర్డు కార్యదర్శి జలీల్‌ తెలిపారు

  • విచారణ వాయిదా

Shilpa Case:శిల్ప దంపతుల బెయిల్ పిటిషన్‌పై విచారణ మంగళవారానికి వాయిదా వేసింది ఉప్పరపల్లి కోర్టు. అధిక వడ్డీలు, స్థిరాస్తి వ్యాపారంలో పెట్టుబడులంటూ కోట్లు వసూళ్లకు వారిపై పోలీసులు మూడు కేసులు నమోదు చేశారు. ఇప్పటికే ఓ కేసులో బెయిల్ లభించగా.. మరో రెండు కేసుల్లో దాఖలు చేసిన బెయిల్‌ పిటిషన్‌లపై విచారణ వాయిదా పడింది.

  • త్వరలోనే కొత్త సీడీఎస్​

New CDS appointment: కొత్త సీడీఎస్ ఎంపికకు సంబంధించి అర్హుల జాబితాను త్వరలోనే రాజ్​నాథ్​ సింగ్​ వద్దకు పంపనున్నట్లు అధికారులు వెల్లడించారు. ఆయన ఆమోదం తర్వాత తుది నిర్ణయం కేబినెట్ నియామకాల కమిటీ తీసుకుంటుందన్నారు.

  • బ్రిటన్​లో ఆల్​టైం రికార్డు

Covid cases: బ్రిటన్​లో ఒక్కరోజే 93 వేలకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. వైరస్ వ్యాప్తి ప్రారంభమైన నాటి నుంచి ఇప్పటి వరకు ఇంత పెద్ద మొత్తంలో కేసులు వెలుగు చూడడం ఇదే తొలిసారి అని అధికారులు చెప్తున్నారు.

  • యువ ఆటగాళ్లకు హిట్​మ్యాన్ పాఠాలు

Cricket Lessons Rohit Sharma: గాయం కారణంగా బెంగళూరులోని నేషనల్​ క్రికెట్ అకాడమీ(ఎన్​సీఏ)కి వెళ్లాడు టీమ్​ఇండియా కెప్టెన్ రోహిత్​ శర్మ.ఈ క్రమంలో అక్కడ శిక్షణ తీసుకుంటున్న అండర్-19 ఆటగాళ్లను కలిశాడు హిట్​ మ్యాన్​. వారికి క్రికెట్​ పాఠాలు బోధించాడు.

Last Updated : Dec 18, 2021, 9:55 PM IST

ABOUT THE AUTHOR

...view details