తెలంగాణ

telangana

ETV Bharat / city

ఈటీవీ భారత్- ముఖ్యాంశాలు

top news in telangana
ఈటీవీ భారత్- ముఖ్యాంశాలు

By

Published : Dec 14, 2021, 5:52 AM IST

Updated : Dec 14, 2021, 9:58 PM IST

21:52 December 14

టాప్​ న్యూస్​@ 10 PM

  • స్టాలిన్​తో కేసీఆర్​ భేటీ

KCR - STALIN MEET: తమిళనాడు సీఎం స్టాలిన్​తో ముఖ్యమంత్రి కేసీఆర్​ భేటీ ముగిసింది. కేంద్రంలోని భాజపా వైఖరి, ధాన్యం కొనుగోళ్లలో విధానం, రాష్ట్ర ప్రభుత్వాలతో కేంద్రం సంబంధాలపైన చర్చించినట్లు సమాచారం.

  • అత్యాచారం కేసులో వాంగ్మూలం ఇచ్చేందుకు వచ్చిన మహిళపై మరోసారి..

ఆమెపై గతంలో అత్యాచారానికి పాల్పడ్డాడు. వేరే వ్యక్తిని పెళ్లి చేసుకుని వెళ్లిపోయిన ఆ మహిళను.. నమ్మించి.. దగ్గరయ్యాడు. ఈ క్రమంలో గదిలో బంధించి మరోసారి అత్యాచారం చేశాడు ఓ ప్రబుద్ధుడు.

  • 'వారణాసిలో శరవేగంగా అభివృద్ధి పనులు'

Modi in UP today: ఉత్తర్​ప్రదేశ్​ వారణాసిలోని స్వర్​వేద్ మహామందిర్​లో జరిగిన సద్గురు సదాఫల్దేవ్ విహంగం యోగ్ సంస్థాన్ 98వ వార్షిక ఉత్సవాల్లో ప్రధాని మోదీ పాల్గొన్నారు. వారణాసిలో అభివృద్ధ పనులు శరవేగంగా సాగుతున్నాయన్నారు.

  • 'శ్యామ్‌ సింగరాయ్‌' ట్రైలర్‌..

Shyam Singha Roy: నేచురల్ స్టార్ నాని నటించిన 'శ్యామ్‌ సింగరాయ్‌' ట్రైలర్​ విడుదలైంది. ద్విపాత్రభినయంలో నాని అదరగొట్టాడు. తమిళ స్టార్ హీరో అజిత్ నటించిన 'వాలిమై' మేకింగ్ వీడియో కూడా ఆకట్టుకుంటోంది.

  • 'కోహ్లీ.. లంక ప్రీమియర్‌ లీగ్‌లో..'

Bhanuka Rajapaksa on Kohli: టీమ్​ఇండియా టెస్టు జట్టు సారథి విరాట్ కోహ్లీపై అభిమానాన్ని చాటుకున్నాడు శ్రీలంక క్రికెటర్ భనుక రాజపక్స. కోహ్లీ లంక ప్రీమియర్ లీగ్​లో ఆడితే చూడాలని ఉందని అన్నాడు.

20:40 December 14

టాప్​ న్యూస్​@ 9PM

  • 'మనిషికో పురుగుల మందు డబ్బా ఇవ్వండి..'

Farmers protest: 'ఒక్కొక్క రైతుకు ఒక్కొ పురుగుల మందు డబ్బా.. ఓ ఉరి తాడు ఇవ్వండి. ప్రశాంతంగా చచ్చిపోతాం. లేదంటే మేము ధాన్యం పండిస్తాం.. మీరు ఫ్రీగా తీసుకోండి. పండించిన ధాన్యాన్ని తరుగు పేరుతో దోచుకుంటే మేము బతికుండి కూడా దండగే..' అంటూ అన్నదాతలు తమ ఆక్రోశాన్ని వెళ్లగక్కారు.

  • 'భారత్ విశ్వగురువు ఎప్పుడో అయ్యింది'

Geetha jayanthi: గీతా జయంతి సందర్భంగా హైదరాబాద్​లోని ఎల్బీ స్టేడియంలో లక్షమంది యువతీ యువకులతో విశ్వ హిందూ పరిషత్​ ఆధ్వర్యంలో లక్ష యువగళ గీతార్చన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి త్రిదండి చిన్న జీయర్ స్వామితో పాటు రామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టు కోశాధికారి గోవింద్ గిరి జీ మహారాజ్‌, అఖిల భారత విశ్వహిందూ పరిషత్‌ ప్రధాన కార్యదర్శి మిలింద్‌ పరాండే హాజరయ్యారు.

  • రాష్ట్ర మంత్రికి గాయాలు

Minister Road Accident: మంత్రి ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. ఉత్తరాఖండ్​లో జరిగిన ఈ ప్రమాదంలో ఆ రాష్ట్ర మంత్రి స్వల్పంగా గాయపడ్డారు.

  • 'వారికి ఆర్​టీపీసీఆర్ తప్పనిసరి'

Ministry of Civil Aviation Latest rules: 'ప్రమాదకర' దేశాల నుంచి వచ్చే అంతర్జాతీయ ప్రయాణికులందరూ తప్పనిసరిగా ఆర్​టీ-పీసీఆర్ పరీక్ష కోసం ముందస్తు బుకింగ్ చేసుకోవాలని కేంద్రం స్పష్టం చేసింది. మరోవైపు.. అంతర్జాతీయ విమానాల పునరుద్ధరణ అనేది ఒమిక్రాన్ పరిస్థితులపై ఆధారపడి ఉంటుందన్నారు పౌర విమానయాన శాఖ మంత్రి సింధియా.

  • 'బాలీవుడ్​ కాదు.. నా టార్గెట్​ అదే'

Pushpa Movie: తన సినిమాలకు బాలీవుడ్​లో విశేష స్పందన లభిస్తున్నా.. తనకు మాత్రం కోలీవుడ్​లోనే గెలవాలని ఉందని చెప్పారు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. 'పుష్ప' ప్రమోషన్లలో భాగంగా చెన్నై వెళ్లిన ఆయన.. తన హోమ్​ స్టేట్​లో విజయం అందుకోవాలని ఎప్పటి నుంచో కలలు కంటున్నట్లు తెలిపారు.

19:48 December 14

టాప్​ న్యూస్​@ 8PM

  • దేశంలో ఒమిక్రాన్​ 'పీక్​' ఎప్పుడు?

Omicron's peak stage in India: దేశంలో ఒమిక్రాన్​ కేసులు వచ్చే ఏడాది జనవరి, ఫిబ్రవరి నాటికి తారస్థాయికి చేరే అవకాశముందని.. ఈటీవీ భారత్​తో జరిగిన సంభాషణలో వైరాలజిస్ట్​ జాకబ్​ జాన్​ అంచనా వేశారు. అయితే ఒమిక్రాన్​ తీవ్రతను ఎదుర్కొనేందుకు దేశం సిద్ధంగా ఉందని అభిప్రాయపడ్డారు.

  • ఉత్తనూరు ఆదర్శ విద్యాలయం

uttanur Government school: సర్కారు బళ్లంటే.. గుర్తొచ్చేది సమస్యలే. కానీ ఊరు తలచుకుంటే ప్రభుత్వ పాఠశాలల్ని ఎంత అందంగా తీర్చిదిద్దవచ్చో నిరూపిస్తున్నారు జోగులాంబ గద్వాల జిల్లా ఉత్తనూరు గ్రామస్థులు. అందమైన భవనాలు, పచ్చని ఉద్యానవనాలు.. విశాలమైన క్రీడామైదానం, సకల సౌకర్యాలతో విద్యాలయాల్ని తీర్చిదిద్దారు. భావిపౌరులకు విద్యాబుద్ధులు నేర్పే బడిని.. దాతల సహకారంతో దేవాలయంగా మలిచి ఆదర్శంగా నిలిచారు. ఆ ఉత్తమ స్కూల్​పై ఈటీవీ భారత్ ప్రత్యేక కథనం.

  • అమరవీరుడి అంత్యక్రియలకు వెళ్లొస్తూ..

Kashmir Tempo Accident: జమ్ముకశ్మీర్​లో ఓ మినీ బస్సు అదుపుతప్పి లోయలోపడింది. ఈ ఘటనలో ఆరుగురు అక్కడికక్కడే మృతిచెందారు. మరో 10 మందికి గాయాలైనట్లు అధికారులు తెలిపారు.

  • 'సైఫ్‌ అలీ ఖాన్‌ ఎక్కడున్నారో...!'

Kareena Kapoor Corona: బాలీవుడ్​ నటి కరీనా కపూర్​ కరోనా బారిన పడటం వల్ల ఆమె నివాసాన్ని సీల్​ చేశారు బృహన్‌ ముంబయి కార్పొరేషన్‌ అధికారులు. అయితే కాంటాక్ట్‌ ట్రేసింగ్‌ విషయంలో కరీనా కుటుంబం తమకు సహకరించడం లేదని వారు ఆరోపించారు. సైఫ్ అలీ ఖాన్​ ఆచూకీ కూడా తెలపడం లేదని చెప్పారు.

  • 'దక్షిణాఫ్రికా పర్యటన రద్దు చేయాలా?'

SA vs IND Test: దక్షిణాఫ్రికా పర్యటన నేపథ్యంలో టీమ్​ఇండియా కీలక ఆటగాళ్లు గాయాలపాలవడంపై ఆందోళన వ్యక్తం చేశాడు మాజీ ఆటగాడు, వ్యాఖ్యాత ఆకాశ్ చోప్రా. జట్టులో రోహిత్ శర్మ లేకపోవడం పెద్ద లోటే అని అభిప్రాయపడ్డాడు.

18:53 December 14

టాప్​ న్యూస్​@ 7PM

  • కొంతమేరకు క్రాస్ ఓటింగ్!

Independents MLC Election 2021 : స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్‌, భాజపా మద్దతుదారులుగా బరిలోకి దిగిన స్వతంత్రులు ఉనికిని చాటుకున్నారు. ఎన్నికలు జరిగిన ఆరు స్థానాల్లోనూ ప్రభావం చూపగలిగారు. అధికార తెరాసకు చెందిన ఓట్లు కొంతమేరకు క్రాస్‌ ఓటింగ్‌ జరిగేలా చేయగలిగారు. రెండో ప్రాధాన్యత ఓట్లు లెక్కించాల్సిన పరిస్థితి వస్తే ఫలితాలు మరోలా ఉండేవని స్వతంత్రులు వ్యాఖ్యానించారు.

  • కశ్మీర్​పై పాక్ మరో కుట్ర

Terror Groups In Kashmir: జమ్ముకశ్మీర్‌లో కొత్త ఉగ్రవాద సంస్థలు పుట్టుకురావడం కలవరపాటుకు గురిచేస్తోంది. రెండేళ్లలో కొత్తగా 4 ఉగ్రమూకలను భద్రతాదళాలు గుర్తించాయి. సెక్యులర్‌ పేర్లతో పూర్తిగా కశ్మీర్‌లో పుట్టుకొచ్చిన ఉగ్రవాదంగా వీటిని చూపాలని పాక్‌ ప్రయత్నాలు చేస్తోంది. తాజాగా పోలీసుల బస్సుపై జరిగిన ఉగ్రదాడిలో 'కశ్మీరీ టైగర్స్‌' సంస్థ హస్తం ఉన్నట్లు అనుమానాలున్నాయి. కశ్మీర్‌లో 370 అధికరణ రద్దు తర్వాత పోలీసులపై జరిగిన అతిపెద్ద దాడి ఇదే కావడం గమనార్హం.

  • పెట్రోల్​ ట్యాంకర్ పేలి 40 మంది దుర్మరణం

Petrol tanker blast: హైతీలో ఓ పెట్రోల్​ ట్యాంకర్ పేలిన ఘటనలో 40మంది మరణించారు. అనేక మంది తీవ్రంగా గాయపడి ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

  • బడ్జెట్​పై నిర్మల కసరత్తు..

Pre Budget Consultations: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్.. బుధవారం బడ్జెట్ కసరత్తు మొదలు పెట్టనున్నారు. బడ్జెట్ తయారీకి ముందు వివిధ వర్గాలు, నిపుణులతో సంప్రదింపులు జరపనున్నారు.

  • రానాకు 'భీమ్లా నాయక్' సర్​ప్రైజ్​!

Bheemla Nayak: నటుడు రానా దగ్గుబాటి పుట్టినరోజు సందర్భంగా స్పెషల్ వీడియోను విడుదల చేసింది 'భీమ్లా నాయక్' చిత్రబృందం. 'వాడు అరిస్తే భయపడతావా?' అంటూ రానా చెప్పే డైలాగ్ ఈలలు కొట్టించేలా ఉంది.

17:55 December 14

టాప్​ న్యూస్​@ 6PM

  • కేసీఆర్, స్టాలిన్​​ భేటీ

తమిళనాడు సీఎం స్టాలిన్‌తో సీఎం కేసీఆర్‌ సమావేశమయ్యారు. రాజకీయ, పాలన అంశాలపై స్టాలిన్‌, కేసీఆర్‌ చర్చిస్తున్నట్లు సమాచారం.

  • 'అకాలీదళ్​ను బలహీనపరిచేందుకు భాజపా కుట్ర'

SAD 100th Anniversary: అకాలీదళ్​ను బలహీన పరచాలని భాజపా యత్నిస్తోందని ఆ పార్టీ అధ్యక్షుడు సుఖ్​బీర్​ సింగ్​ బాదల్ ఆరోపించారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అకాలీదళ్​- బీఎస్పీ కూటమిదే అధికారమని ధీమా వ్యక్తంచేశారు. శిరోమణి అకాలీదళ్​ పార్టీ స్థాపించి 100ఏళ్లు పూర్తయిన సందర్భంగా పంజాబ్​లోని మోగాలో భారీ ర్యాలీ నిర్వహించింది ఆ పార్టీ.

  • మెగాస్టార్ యమజోరు..

Chiranjeevi Venky Kudumula: మెగాస్టార్ చిరంజీవి తన జోరు చూపిస్తున్నారు. ఇప్పటికే నాలుగు చిత్రాల్లో నటిస్తున్న ఆయన.. తాజాగా మరో మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. యువ డైరెక్టర్ వెంకీ కుడుముల ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు.

  • కోహ్లీ, అనుష్క బాడీగార్డ్ జీతం మరీ అంతా?

Kohli Bodyguard: టీమ్ఇండియా టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ, హీరోయిన్ అనుష్క శర్మ జోడీ.. వారి బాడీగార్డ్​కు ఇచ్చే జీతం ఎంతో తెలిస్తే షాకవుతారు. ఎన్నో బడా కంపెనీల సీఈఓల కంటే అతడి జీతం చాలా ఎక్కువ. మరి అతడు ఎవరు? అతడి జీతమెంతో తెలుసుకుందామా!

  • ధరెంతైనా తగ్గేదేలే..!

BMW iX SUV: బీఎండబ్ల్యూ మార్కెట్​లోకి తీసుకువచ్చిన పూర్తి స్థాయి విద్యుత్‌ స్పోర్ట్స్‌ యాక్టివిటీ వాహనం (ఎస్‌ఏవీ) 'ఐఎక్స్‌'కు అనూహ్య స్పందన లభించింది. మొదటి దశలో అమ్మకానికి ఉంచిన కార్లన్నీ తొలి రోజునే అమ్ముడయ్యాయి.

17:03 December 14

టాప్​ న్యూస్​@ 5PM

  • తమిళనాడు సీఎం స్టాలిన్​తో కేసీఆర్​ భేటీ

తమిళనాడు సీఎం స్టాలిన్‌తో ముఖ్యమంత్రి కేసీఆర్‌ భేటీ అయ్యారు. రాజకీయ, పాలన అంశాలపై చర్చించనున్న స్టాలిన్‌, కేసీఆర్‌ చర్చించనున్నట్లు సమాచారం

  • సినిమా టికెట్ల రేట్లు తగ్గిస్తూ ఇచ్చిన జీవో రద్దు

ఏపీ ప్రభుత్వానికి మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. సినిమా టికెట్​ ధరల విషయంలో ఏపీ సర్కార్​ ఇచ్చిన జీవో 35ను ఏపీ హైకోర్టు రద్దు చేసింది.

  • 'వారణాసిలో శరవేగంగా అభివృద్ధి పనులు'

Modi in UP today: ఉత్తర్​ప్రదేశ్​ వారణాసిలోని స్వర్​వేద్ మహామందిర్​లో జరిగిన సద్గురు సదాఫల్దేవ్ విహంగం యోగ్ సంస్థాన్ 98వ వార్షిక ఉత్సవాల్లో ప్రధాని మోదీ పాల్గొన్నారు. వారణాసిలో అభివృద్ధ పనులు శరవేగంగా సాగుతున్నాయన్నారు.

  • బాలయ్య కథతో శ్రీకాంత్ హీరోగా..!

srikanth movies as hero: ఫ్యామిలీ హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్న శ్రీకాంత్​.. బాలకృష్ణ హీరోగా నటించిన 'అఖండ'లో విలన్​గా మెప్పించారు. అయితే శ్రీకాంత్​ను మరి కొన్ని సినిమాల్లో హీరోగానే చేయాలని బాలయ్య సూచించారట. అందుకు అయనే ఓ కథ చెప్పి, దర్శకుడు ఎవరైతే బాగుంటుందో కూడా చెప్పారట. ఈ విషయాన్ని స్వయంగా శ్రీకాంత్ వెల్లడించారు.

  • 'రోహిత్-విరాట్ వివాదం..'

Azharuddin on Rohit Virat Captaincy: టీమ్​ఇండియా కెప్టెన్లు రోహిత్ శర్మ, విరాట్​ కోహ్లీ మధ్య వివాదం మరింత ముదురుతోంది! భారత జట్టు దక్షిణాఫ్రికా పర్యటన నేపథ్యంలో రోహిత్​ టెస్టు సిరీస్​కు దూరమవడం, విరాట్ వన్డేలకు దూరమవుతుండటం ఇందుకు ప్రధాన కారణంగా తెలుస్తోంది. దీనిపై టీమ్​ఇండియా మాజీ సారథి అజారుద్దీన్ ఏమన్నాడంటే!

15:53 December 14

టాప్​ న్యూస్​@ 4PM

  • నడవలేని అమ్మాయిపై రేప్​..

Rape Attempt on Disabled: వావి వరసలు ఉండవు.. ఏ స్థితిలో ఉన్నా సంబంధం లేదు. అమ్మాయి అయితే చాలు వాళ్లకు. ఇంగితం కళ్లు మూసుకుపోతుంది. పైశాచికత్వం ఒళ్లు విరుచుకుంటుంది. కామం కోరలు చాస్తుంది. మంచానికి పరిమితమైన ఓ దివ్యాంగురాలిపై ఓ కామాంధుడు అఘాయిత్యానికి యత్నించిన ఘటన.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో చోటుచేసుకుంది.

  • స్పేస్​లో చికెన్ బిర్యానీ, సాంబార్​ రైస్

Food for Gaganyaan astronauts: దేశ ప్రజలు ఎంతగానో ఎదురుచూస్తున్న గగన్​యాన్​ మిషన్​ పనులు శరవేగంగా సాగుతున్నాయి. వ్యోమగాములు శిక్షణలో మునిగిపోయారు. మరి వారికి 'ఫుడ్​' ఎలా.. అని మీకు ఎప్పుడైనా సందేహం వచ్చిందా?

  • మార్కెట్లకు నష్టాలు

Stock Market Today: మంగళవారం సెషన్​లో స్టాక్ మార్కెట్లు ఒడుదొడుకులను ఎదుర్కొన్నాయి. చివరకు నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్ 166 పాయింట్లు కోల్పోయింది. నిఫ్టీ 43 పాయింట్లు పైగా క్షీణించింది.

  • పాన్‌ ఇండియా చిత్రంగా సూర్య 'ఈటీ'

Surya Pan India Movie: హీరో సూర్య నటిస్తున్న కొత్త చిత్రం 'ఈటీ' (ఎతర్​క్కుమ్​ తునిందవన్). ఈ సినిమాను తెలుగు, తమిళం సహా ఐదు భాషల్లో విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది.

  • 'రాయుడిని అందుకే తీసుకోలేదు'

Sarandeep on Ravi Shastris comments: 2019 ప్రపంచకప్ జట్టులో అంబటి రాయుడికి చోటు దక్కలేదు. అలాగే జట్టులోకి ముగ్గురు కీపర్లను తీసుకున్నారు. ఈ విషయాలపై టీమ్ఇండియా మాజీ కోచ్ రవిశాస్త్రి మాట్లాడాడు. రాయుడును ఆడించకపోవడం తప్పేనని అన్నాడు. అయితే ఈ విషయంలో తానేమీ జోక్యం చేసుకోలేదని స్పష్టం చేశాడు. తాజాగా ఇతడి మాటలపై స్పందించాడు అప్పటి సెలెక్షన్ కమిటీ సభ్యుడు శరణ్ సింగ్.

14:45 December 14

టాప్​ న్యూస్​@ 3PM

  • ఎమ్మెల్యే రోజా ప్రయాణిస్తున్న విమానంలో సాంకేతిక సమస్య

Indigo Flight Diverted: రాజమహేంద్రవరం-తిరుపతి ఇండిగో విమానాన్ని దారి మళ్లించారు. సాంకేతిక సమస్యలు తలెత్తడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎయిర్​ పోర్ట్ అథారటీస్ తెలిపారు. విమానంలో ఏపీ ఎమ్మెల్యే రోజా, ప్రముఖులు ఉన్నట్లు తెలిపారు.

  • కోతికి నోటితో శ్వాస అందించి..

Man Saves Monkey: కుక్కల వేటలో గాయపడిన కోతిని రక్షించి గొప్ప మనసు చాటుకున్నాడు తమిళనాడుకు చెందిన వ్యక్తి. శ్వాస తీసుకునే పరిస్థితిలో లేని కోతికి తన నోటితో శ్వాసను అందించి దాని ప్రాణాన్ని నిలిపాడు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారింది.

  • కరోనా పంజా- ఆస్పత్రులు ఫుల్​

Corona in South Korea: దక్షిణ కొరియాలో రోజురోజుకు కొవిడ్​ పరిస్థితులు దారుణంగా మారుతున్నాయి. కరోనాతో ఆస్పత్రుల్లో చేరేవారి సంఖ్య పెరుగుతోంది. ఆస్పత్రుల్లో పడకల్లేక.. పడిగాపులు కాస్తూ చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు. దీంతో తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి సూచించారు నిపుణులు. లేదంటే భారీగా మరణాలు నమోదయ్యే అవకాశముందని హెచ్చరించారు.

  • సూపర్​స్టార్​ మహేశ్​కు సర్జరీ..

సూపర్​స్టార్ మహేశ్ బాబుకు మోకాలి శస్త్ర చికిత్స జరిగింది. ప్రస్తుతం ఆయన దుబాయ్​లో విశ్రాంతి తీసుకుంటున్నారు.

  • పెన్షన్‌ ప్లాన్‌ తీసుకుంటున్నారా?

Retirement Planning: బాగా సంపాదిస్తున్నప్పుడే రిటైర్మెంట్‌ కోసం పటిష్ఠ ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలి. సరైన మార్గంలో పెట్టుబడి పెట్టాలి. అప్పుడే సుఖప్రదమైన రిటైర్మెంట్‌ జీవితాన్ని అనుభవించగలం. మార్కెట్‌లో రిటైర్మెంట్ ప్లాన్ల పేరిట అనేక పెట్టుబడి పథకాలు ఉన్నాయి. ఉద్యోగ విరమణ తర్వాత క్రమం తప్పని ఆదాయాన్ని అందించడమే వీటి ప్రధాన లక్ష్యం. అయితే మీరు తీసుకునే ప్లాన్‌లో కొన్ని అంశాలను కచ్చితంగా పరిగణనలోకి తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. అవేంటో చూద్దాం.

13:55 December 14

టాప్​ న్యూస్​@ 2PM

  • రైతుల మరణమృదంగం మోగుతోంది

Revanth Reddy on Farmers Suicide : రాష్ట్రంలో రైతుల మరణమృదంగం మోగుతుంటే.. ముఖ్యమంత్రి కేసీఆర్ తీర్థయాత్రల పేరిట రాష్ట్రాలు పట్టుకొని తిరుగుతున్నారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తన సమస్యల పరిష్కారం కోసం ఎన్నోరోజుల నుంచి పడిగాపులు కాస్తున్న అన్నదాత నిరాశతో చివరకు ఆత్మహత్యే శరణమని ప్రాణాలు తీసుకుంటున్నాడని ఆవేదన చెందారు.

  • దక్షిణ కొరియాపై కరోనా పంజా

Corona in South Korea: దక్షిణ కొరియాలో రోజురోజుకు కొవిడ్​ పరిస్థితులు దారుణంగా మారుతున్నాయి. కరోనాతో ఆస్పత్రుల్లో చేరేవారి సంఖ్య పెరుగుతోంది. ఆస్పత్రుల్లో పడకల్లేక.. పడిగాపులు కాస్తూ చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు. దీంతో తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి సూచించారు నిపుణులు. లేదంటే భారీగా మరణాలు నమోదయ్యే అవకాశముందని హెచ్చరించారు.

  • ఒప్పో నుంచి ఫోల్డబుల్ ఫోన్

Oppo Foldable Phone: మార్కెట్​లో మరో ఫోల్డబుల్​ ఫోన్​ రానుంది. ప్రముఖ స్మార్ట్​ ఫోన్​ తయారీ సంస్థ అయిన ఒప్పో దీనిని బుధవారం విడుదల చేస్తోంది. ఒప్పో ఫైండ్​ ఎన్​ పేరుతో రానున్న ఈ ఫోన్​ ధర ఎంతో తెలుసుకునేందుకు స్మార్ట్​ఫోన్​ ప్రియులు ఆసక్తితో ఎదురు చూస్తున్నారు.

  • 'రాధేశ్యామ్'​ సాంగ్​ టీజర్​

'రాధేశ్యామ్' నుంచి మరో అప్డేట్​ వచ్చేసింది. 'సంచారి' అంటూ సాగే పాట టీజర్​ను విడుదల చేసింది చిత్రబృందం. ఇందులో విజువల్స్​ చాలా రిచ్​గా ఉన్నాయి. పూర్తి పాటను 16వ తేదీన రిలీజ్​ చేయనున్నారు. కాగా, 1970ల నాటి యూరప్​ నేపథ్య కథతో 'రాధేశ్యామ్'ను తెరకెక్కించారు.

  • ఈ కాంబో కోసం ఫ్యాన్స్​ వెయిటింగ్​!

12:48 December 14

టాప్​ న్యూస్​@ 1PM

  • వాదన వినకుండా ఉత్తర్వులు ఇవ్వలేం

ఉద్యోగుల కేటాయింపు ప్రక్రియపై హైకోర్టు విచారణ జరిపింది. ఈ ప్రక్రియపై స్టే ఇచ్చేందుకు ఉన్నత న్యాయస్థానం నిరాకరించింది. నూతన జోనల్ విధానం కింద ఉద్యోగుల కేటాయింపుపై 226 మంది ఉపాధ్యాయులు హైకోర్టులో పిటిషన్ వేశారు. రాష్ట్రపతి, కోర్టు ఉత్తర్వులకు విరుద్ధంగా జీవోలు ఉన్నాయని వ్యాజ్యంలో పేర్కొన్నారు.

  • ఇండోనేసియాలో భారీ భూకంపం

Indonesia earthquake todayఇండోనేసియాలో భారీ భూకంపం సంభవించింది. సముద్రగర్భంలో వచ్చిన ఈ భూకంపం తీవ్రత 7.3గా నమోదైంది. సునామీ అవకాశాలు ఉన్నాయని ఆ దేశ వాతావరణ శాఖ హెచ్చరించింది.

  • మోదీ ఖాతా హ్యాక్​పై ప్రశ్నలు

Parliament IT panel Pegasus: ప్రధాని వ్యక్తిగత ట్విట్టర్ ఖాతా హ్యాకింగ్ సహా పెగసస్ అంశంపై కేంద్ర ఎలక్ట్రానిక్స్, సమాచార సాంకేతికత శాఖ ఉన్నతాధికారులను పార్లమెంట్ స్థాయీసంఘం ప్రశ్నించింది. కాంగ్రెస్ నేత శశిథరూర్ నేతృత్వంలోని ప్యానెల్ ముందు అధికారులు హాజరైనప్పటికీ.. హ్యాకింగ్, పెగసస్ గురించి సమాచారం ఇవ్వలేదని తెలుస్తోంది.

  • అదరగొట్టిన భారత బ్యాటర్లు వీరే!

మరో రెండు రోజుల్లో దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లనుంది టీమ్ఇండియా. కొంతకాలంగా విదేశాల్లో సత్తాచాటుతున్న భారత ఆటగాళ్లు సౌతాఫ్రికా పిచ్​లపై మాత్రం తేలిపోతున్నారు. ఇదే గడ్డపై 2007లో జరిగిన తొలి టీ20 ప్రపంచకప్​లో విజేతగా నిలిచింది టీమ్ఇండియా. కానీ ద్వైపాక్షిక సిరీస్​లో మాత్రం రాణించలేకపోతుంది.

  • హైపర్​ ఆది పేరునే తలచుకుంటా

Shanti Swaroop Jabardasth: చనిపోయేటప్పుడు హైపర్​ ఆది పేరునే తలుచుకుంటానని చెబుతూ భావోద్వేగానికి గురయ్యారు 'జబర్దస్త్'​ శాంతి స్వరూప్​. ఆది వల్లే తను ఈ రోజు కడుపునిండా భోజనం చేయగలుగుతున్నానని తెలిపారు.

11:51 December 14

టాప్​ న్యూస్​@ 12PM

  • వీవీఎస్ లక్ష్మణ్​కు కేటీఆర్ అభినందనలు

Minister KTR about VVS Laxman : నేషనల్ క్రికెట్ అకాడమీ డైరెక్టర్​గా బాధ్యతలు చేపట్టిన వీవీఎస్ లక్ష్మణ్​కు మంత్రి కేటీఆర్ అభినందనలు తెలిపారు. ఇద్దరు సీనియర్లు వీవీఎస్ లక్ష్మణ్, రాహుల్ ద్రవిడ్ సలహాలతో భారత్ క్రికెట్ బృందం అద్భుత ప్రతిభ చూపనుందని పేర్కొన్నారు. ఈ మేరకు మంత్రి ట్వీట్ చేశారు.

  • ఉగ్రదాడి ఘటనలో మరొకరు మృతి

Srinagar attack: జమ్ముకశ్మీర్‌లో పోలీసు బస్సుపై ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో అమరులైన పోలీసుల సంఖ్య మూడుకు పెరిగింది. మిగిలిన 11 మంది ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు అధికారులు తెలిపారు.

  • తగ్గిన నెట్​ఫ్లిక్స్​ సబ్​స్క్రిప్షన్​ ఛార్జీలు

Netflix Subscription Charges: అమెరికాకు చెందిన ఆన్​లైన్​ స్ట్రీమింగ్​ సంస్థ నెట్​ఫ్లిక్స్​ కీలక నిర్ణయం తీసుకుంది. సబ్​స్క్రిప్షన్​ ధరలను భారీగా తగ్గించింది. భారత్​లో వినియోగదారులను పెంచుకునే దిశగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంస్థ ప్రతినిధులు చెప్పారు.

  • వన్డే సిరీస్​కు కోహ్లీ దూరం

virat kohli SA ODI series: దక్షిణాఫ్రికా పర్యటనకు ముందు టీమ్ఇండియాకు దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. ఇప్పటికే గాయం కారణంగా టెస్టు సిరీస్​కు రోహిత్ శర్మ దూరం కాగా.. వ్యక్తిగత కారణాలతో వన్డే సిరీస్ నుంచి కోహ్లీ తప్పుకొనే వీలుందని తెలుస్తోంది.

  • 'విరాట పర్వం' స్పెషల్​ వీడియో

నేడు రానా పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ 'విరాట పర్వం' నుంచి 'ది వాయిస్​ ఆఫ్​ రవన్న' పేరుతో ఓ వీడియోను విడుదల చేసింది చిత్రబృందం. వేణు ఊడుగుల దర్శకత్వం వహించిన ఈ మూవీలో సాయిపల్లవి, నందితాదాస్‌, ప్రియమణి కీలక పాత్రల్లో నటించారు.

10:47 December 14

టాప్​ న్యూస్​@ 11AM

  • తెరాస ఘనవిజయం

స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల్లో తెరాస క్లీన్ స్వీప్ చేసింది. ఐదు ఉమ్మడి జిల్లాల్లో 6 ఎమ్మెల్సీ స్థానాల్లో గులాబీ విజయఢంకా మోగించింది. నల్గొండ, ఖమ్మం, మెదక్, ఆదిలాబాద్, కరీంనగర్​లోని రెండు స్థానాలు తెరాస కైవసమయ్యాయి.

  • గెజిట్ నోటిఫికేషన్​ విడుదల

గవర్నర్ కోటాలో నామినేటెడ్ ఎమ్మెల్సీగా మాజీ సభాపతి మధుసూదనాచారి నియమితులయ్యారు. మధుసూదనాచారిని నియమిస్తూ తెలంగాణ ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్​ను విడుదల చేసింది.

  • పెళ్లి బస్సు బోల్తా

Wedding Bus accident : పెళ్లి బస్సు బోల్తా పడిన ఘటనలో 30 మంది గాయపడ్డారు. క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదం ఒడిశాలోని గజపతి జిల్లాలో జరిగింది.

  • ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు

Vengsarkar about Ruturaj: దక్షిణాఫ్రికాతో జరగబోయే వన్డే సిరీస్​ కోసం ఎంపిక చేసే జట్టులో యువ ఆటగాడు రుతురాజ్ గైక్వాడ్​కు తప్పకుండా చోటివ్వాలని సూచించాడు మాజీ క్రికెటర్ దిలీప్ వెంగ్​ సర్కార్. ప్రస్తుతం అతడు విజయ్ హజారే ట్రోఫీలో అదరగొడుతున్నాడని గుర్తు చేశాడు.

  • ఈటీవీ వల్లే నాకు అవకాశం

'అఖండ' సినిమాలో విలన్​గా శ్రీకాంత్​, కీలక పాత్రలో పూర్ణ నటించి ప్రేక్షకుల మన్నలను పొందారు. తాజగాా ఈ ఇద్దరూ కలిసి ఆలీ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న 'ఆలీతో సరదాగా' కార్యక్రమంలో పాల్గొని తమ కెరీర్‌ గురించి ఎన్నో ఆసక్తికర సంగతులను చెప్పారు. ఇందులో భాగంగా 'అఖండ'లో తమకు అవకాశం ఎలా వచ్చిందో వివరించారు.

10:00 December 14

టాప్​ న్యూస్​@ 10AM

  • ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెరాస క్లీన్ స్వీప్

తెలంగాణలో స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెరాస విజయ ఢంకా మోగించింది. ఎన్నికల్లో తెరాస ఆరు స్థానాలు గెలుచుకుంది. ఆదిలాబాద్, ఖమ్మం, మెదక్, నల్గొండ, కరీంనగర్​లో రెండు స్థానాల్లో విజయం సాధించింది.

  • భర్త అంగం కోసిన భార్య

బలవంతంగా శృంగారంలో పాల్గొనేందుకు యత్నించిన భర్తపై ఆగ్రహం వ్యక్తంచేసింది భార్య(24). అంతటితో ఆగకుండా ఏకంగా ఆ వ్యక్తి అంగాన్నే కోసేసింది. మధ్యప్రదేశ్​లోని టీకంగఢ్​ జిల్లాలో ఈ దారుణం జరిగింది. ఈ నెల ఏడో తేదీన టీకమ్​గఢ్ నగరంలోని రామ్​నగర్ ప్రాంతంలో ఈ ఘటన జరిగిందని పోలీసులు తెలిపారు.

  • భారీగా తగ్గిన కరోనా కేసులు

Corona Cases in India: భారత్​లో కరోనా వ్యాప్తి స్థిరంగా కొనసాగుతోంది. కొత్తగా 5,784 కరోనా కేసులు వెలుగులోకి వచ్చాయి. మరో 252 మంది ప్రాణాలు కోల్పోయారు. 24 గంటల వ్యవధిలో 7,995 మంది వైరస్​ను జయించారు.

  • విహారిని ముందుగా పంపాలి

anjay Bangar on Hanuma Vihari: దక్షిణాఫ్రికాతో జరగబోయే టెస్టు సిరీస్​లో శ్రేయస్ అయ్యర్​ కంటే ముందు హనుమ విహారిని బ్యాటింగ్​కు పంపించాలని సూచించాడు టీమ్ఇండియా మాజీ బ్యాటింగ్ కోచ్ సంజయ్ బంగర్. విదేశీ పిచ్​లపై విహారికి మెరుగైన రికార్డుందని గుర్తుచేశాడు.

  • ఈ తెలుగమ్మాయి టాలీవుడ్​ ఏంజెల్​!

తెలుగు ప్రేక్షకులకు తెలుగు ప్రేక్షకులకు ఎప్పుడూ కొత్త కథానాయికలు పరిచయమవుతూనే ఉంటారు. అలా వచ్చిన బ్యూటీనే శాన్వీ మేఘన. ఈ ముద్దుగుమ్మ తన​ ఫొటోషూట్​లను ఇన్​స్టాలో పోస్ట్​ చేస్తూ కుర్రోళ్లను కట్టిపడేస్తోంది. ఓ సారి ఈమె ఫొటోలపై ఓ లుక్కేద్దాం..

08:57 December 14

టాప్​ న్యూస్​@ 9AM

  • ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు షురూ

స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ప్రాధాన్యత ఓట్ల ఆధారంగా ఫలితాల ప్రకటన చేయనున్నారు.

  • రారండోయ్ రామోజీ ఫిలింసిటీ చూద్దాం

తాకాల సంబురాలకు రామోజీ ఫిలింసిటీ ముస్తాబైంది. ఈనెల 17 నుంచి జనవరి 30 వరకు లాంగెస్ట్ వింటర్ ఫెస్ట్ సంబురాలు జరగనున్నాయి. ఈ కార్నివాల్​ను ఎంజాయ్ చేయడానికి ఫిలింసిటీ.. పర్యాటకులకు ప్రత్యేక ప్యాకేజీలు అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇంకెందుకు ఆలస్యం.. మీరు ఓసారి సందర్శించండి.. ఎన్నో అద్భుతాలను.. అందమైన జ్ఞాపకాలను మీ జీవితంలోకి ఆహ్వానించండి.

  • 40 మంది బాలికలకు అస్వస్థత

Illness For 40 Girls: జగిత్యాలలోని బీసీ సోషల్ వెల్ఫేర్‌ వసతిగృహంలో 40 మంది బాలికలు అస్వస్థతకు గురయ్యారు. వసతి గృహంలోని 400 మందికి పైగా విద్యార్థినులు రాత్రి భోజనం చేశారు.

  • చీరకట్టుకొని పారిపోయిన వారెన్‌ హేస్టింగ్స్‌

Azadi Ka Amrit Mahotsav: కాశీ నగరం నుంచి అత్యంత బలీయమైన బ్రిటిష్‌ గవర్నర్‌ జనరల్‌ వారెన్‌ హేస్టింగ్స్‌ ప్రాణభయంతో చీరకట్టుకొని పారిపోయాడు. వారణాసికి కొత్త రూపును ఆవిష్కరిస్తూ సోమవారంనాడు ప్రధాని నరేంద్రమోదీ నోట వారన్ హేస్టింగ్​ పేరు వినిపించింది. ఈ నేపథ్యంలో ఆ గవర్నర్ జనరల్ ఎందుకు అలా పారిపోయాడో తెలుసుకుందాం!

  • బీఎమ్‌డబ్ల్యూ నుంచి విద్యుత్‌ ఎస్‌యూవీ

BMW IX Electric SUV: బీఎమ్‌డబ్ల్యూ మరో కొత్త మోడల్​ ఎస్​యూవీతో భారత్​లోకి వచ్చేసింది. పూర్తి స్థాయి విద్యుత్‌ స్పోర్ట్స్‌ వినియోగ వాహనం (ఎస్‌యూవీ) 'ఐఎక్స్‌'ను భారత్‌లో ఆవిష్కరించింది. ఈ ఎస్‌యూవీ ప్రారంభ ధర రూ.1.16 కోట్లు.

07:58 December 14

టాప్​ న్యూస్​@ 8AM

  • వివాదాస్పద ప్రశ్న తొలగించిన సీబీఎస్‌ఈ

CBSE English Paper Controversy: పదో తరగతి ఇంగ్లిష్‌ ప్రశ్నాపత్రంలో వివాదాస్పద ప్రశ్నను తొలగిస్తున్నట్లు సీబీఎస్‌ఈ ప్రకటించింది. ఈ ప్రశ్నకు సంబంధించి విద్యార్థులకు పూర్తి మార్కులు ఇస్తామని స్పష్టంచేసింది.

  • రాష్ట్రంలో ర్యాపిడో సాంకేతిక కేంద్రాలు

Rapido Technology Centers in Telangana: యాప్‌ ఆధారిత ద్విచక్రవాహనాల ట్యాక్సీ సంస్థ ర్యాపిడో రెండు సాంకేతిక కేంద్రాలు ఏర్పాటు చేయడానికి ముందుకొచ్చింది. రూ.100 కోట్లతో హైదరాబాద్‌, నిజామాబాద్‌లలో వాటిని స్థాపించేందుకు సంసిద్ధత వ్యక్తం చేసింది. వీటిద్వారా రెండేళ్లలో వెయ్యి మందికి ఉపాధి కల్పిస్తామంది.

  • 13 కంపెనీల ఎగవేత.. లక్షల కోట్లు నష్టం

అప్పును ఎగవేసి, దివాలా తీసిన 13 కంపెనీల వల్ల దేశంలోని ప్రభుత్వ రంగ బ్యాంకులకు రూ.2.85 లక్షల కోట్ల మేరకు నష్టం జరిగింది. దీనికి తోడు 2021 మార్చి నాటికి బ్యాంకులకు రూ.6.16 లక్షల కోట్ల మేర స్థూల నిరర్ధక ఆస్తుల (జీఎన్‌పీఏ) భారం ఉంది. రద్దుచేసిన పారు బకాయిల మొత్తం కూడా అధికంగానే ఉంది.

  • నేడు కొరియాతో భారత్‌ ఢీ

Asian Champions Trophy 2021:భారత పురుషుల హాకీ జట్టు.. ఆసియా ఛాంపియన్స్‌ ట్రోఫీలో సత్తా చాటడానికి సిద్ధమైంది. ఇందులో భాగంగా తొలి రోజు, మంగళవారం కొరియాతో తలపడనుంది. ఈ మ్యాచ్​లో తమ జట్టు గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశాడు కెప్టెన్​ మన్​ప్రీత్​ సింగ్​.

  • ఫ్యాన్స్ పై లాఠీఛార్జ్​.. స్పందించిన బన్నీ

Alluarjun fans inujred: తన ఫ్యాన్స్​పై జరిగిన లాఠీఛార్జ్​ గురించి తెలుసుకుని విచారం వ్యక్తం చేశారు హీరో అల్లుఅర్జున్​. ఇక నుంచి ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా జాగ్రత్త పడతాను అని అన్నారు.

06:48 December 14

టాప్​ న్యూస్​@ 7AM

  • మాదక ద్రవ్యాల చట్టం వర్తించదు

NDPS Act: 'మాదకద్రవ్యాల చట్టం' పరిధిలోకి పురుషుల్లో వీర్య వృద్ధికి ఉద్దేశించిన వనమూలిక మాత్రలు రావని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ కేసులో ఓ అరెస్టైన ఓ వ్యక్తికి బెయిల్‌ మంజూరు చేయడానికి అవకాశాలను పరిశీలించాలని ట్రయల్‌ కోర్టుకు సూచించింది.

  • సింగరేణి నెత్తిన 'వేలం' కుంపటి

దేశంలోని గనుల వేలానికి సంబంధించి కేంద్రం ఇటీవల ‘ఖనిజాలు, గనుల అభివృద్ధి’ విధానాన్ని అమల్లోకి తెచ్చింది. దేశంలోని గనులను వేలంవేసి అధిక ధర నమోదు చేసిన వారికి కేటాయించడమే ఈ విధానం. వేలం జాబితాలో తొలిసారి తెలంగాణలోని నాలుగు కొత్త బొగ్గు గనులను నమోదుచేసింది.

  • చాపకింద నీరులా 'ఒమిక్రాన్​'

China omicron first case: ప్రపంచ దేశాలను భయాందోళనకు గురి చేస్తున్న కరోనా కొత్త వేరియంట్ క్రమంగా అన్ని దేశాలకు విస్తరిస్తోంది. తాజాగా చైనాలో ఒమిక్రాన్​ తొలి కేసు నమోదైంది. విదేశాల నుంచి వచ్చిన ఓ వ్యక్తికి ఈ వేరియంట్​ సోకినట్లు తేలింది.

  • భూసార పరీక్షలకు కొత్త సాధనం

భూసార పరీక్షకు కొత్త పరికరాన్ని అభివృద్ధి చేశారు కాన్పుర్ ఐఐటీ పరిశోధకులు. కేవలం 5 గ్రాముల మట్టి నమూనాలతో, 90 సెకన్లలోనే ఫలితం వచ్చే సాధనాన్ని తయారు చేశారు.

  • శ్యామ్​సింగరాయ్​ కోసం సరికొత్తగా

Nani Shyam Singha Roy movie: నాని నటించిన 'శ్యామ్​సింగరాయ్'​ కోసం 70వ దశకంలో ఉపయోగించిన తబల, సితార్​ వంటి వాయిద్యాల్నే వాడి సంగీతమందించినట్లు తెలిపారు సంగీత దర్శకుడు మిక్కీ జే మేయర్​. ఇంకా ఈ చిత్ర విశేషాలు సహా తన కెరీర్​ గురించి కూడా మాట్లాడారు. అవన్నీ ఆయన మాటల్లోనే..

05:13 December 14

top news@ 6AM

  • తేలనున్న అభ్యర్థుల భవితవ్యం

Mlc Counting: స్థానికసంస్థల కోటా నుంచి ప్రాతినిధ్యం వహించే మరో ఆరుగురు ఎమ్మెల్సీలు ఎవరన్నది ఇవాళ తేలిపోనుంది. ఈ నెల పదో తేదీన జరిగిన పోలింగ్​కు సంబంధించిన ఓట్ల లెక్కింపు ఇవాళ జరగనుంది.

  • నేడే సీఎంల భేటీ

KCR meet Stalin: ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవాళ తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్​తో సమావేశం కానున్నారు. తమిళనాడు పర్యటనకు వెళ్లిన సీఎం కేసీఆర్ నిన్న శ్రీరంగంలో శ్రీరంగనాథస్వామి ఆలయాన్ని సందర్శించారు. రాత్రికి చెన్నైలో బస చేశారు.

  • ఉద్యోగుల విభజనపై పిటిషన్లు

Teachers Objections: కొత్త జోనల్ విధానానికి అనుగుణంగా విభజన, కేటాయింపుల కోసం అన్ని స్థాయిల ఉద్యోగుల నుంచి గురువారం లోపు ఐచ్చికాలు స్వీకరించాలని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. సీనియారిటీ, ప్రాధాన్యాలకు అనుగుణంగా 20వ తేదీలోగా కేటాయింపులు పూర్తి చేయాలని ఆదేశించింది.

  • కేటాయింపునకు షెడ్యూల్ విడుదల

కొత్త జోనల్ విధానం మేరకు ఉద్యోగుల కేటాయింపునకు రాష్ట్ర ప్రభుత్వం షెడ్యూల్ ప్రకటన చేసింది. జిల్లా, జోనల్‌, మల్టీ జోనల్‌ కేడర్‌ ఉద్యోగుల నుంచి 16 వరకు ఐచ్ఛికాల స్వీకరిస్తామని తెలిపింది. ఈ నెల 20 లోపు కేటాయింపు ఉత్తర్వులు జారీ చేయనున్నట్లు వెల్లడించింది.

  • మోదీ బిజీబిజీ

Modi varanasi visit: ఉత్తర్​ప్రదేశ్​​ పర్యటనలో భాగంగా సోమవారం అర్ధరాత్రి వారణాసిలోని రైల్వే స్టేషన్​ను ప్రధాని మోదీ సందర్శించారు. వివిధ అభివృద్ధి పనులను పరిశీలించారు. మోదీ వెంట యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్ కూడా ఉన్నారు.

  • 'ప్రధాని ఖాతాకే రక్షణ లేకపోతే ఎలా?'

Adhir ranjan chowdhury lok sabha: దేశ ప్రధాని ట్విటర్‌ ఖాతాకే భద్రత లేకపోతే మరి సామాన్యుల ఖాతాలు ఎలా సురక్షితమని లోక్​సభలో కాంగ్రెస్ సభాపక్ష నేత అధిర్ రంజన్ చౌదరి ప్రశ్నించారు. క్రిప్టో కరెన్సీపై కేంద్ర ప్రభుత్వం వైఖరేంటో స్పష్టంచేయాలని డిమాండ్ చేశారు.

  • ఎంతమంది పిల్లలు అనాథలయ్యారంటే?

Children orphaned during COVID: కొవిడ్ వేళ గతేడాది ఏప్రిల్ నుంచి డిసెంబరు 7 వరకు 9,800 మందికిపైగా చిన్నారులు అనాథలయ్యారని సుప్రీంకోర్టుకు జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్(ఎన్​సీపీసీఆర్​) తెలిపింది. 1.32లక్షల మంది చిన్నారులు తమ తల్లిదండ్రుల్లో ఎవరో ఒకరిని కోల్పోయారని చెప్పింది.

  • చైనాలో ఒమిక్రాన్ ఎంట్రీ​

China omicron first case: ప్రపంచ దేశాలను భయాందోళనకు గురి చేస్తున్న కరోనా కొత్త వేరియంట్ క్రమంగా అన్ని దేశాలకు విస్తరిస్తోంది. తాజాగా చైనాలో ఒమిక్రాన్​ తొలి కేసు నమోదైంది. విదేశాల నుంచి వచ్చిన ఓ వ్యక్తికి ఈ వేరియంట్​ సోకినట్లు తేలింది.

  • పీఎఫ్‌ వడ్డీ చెక్ చేసుకోండి ఇలా..

PF Interest Credit: 2020-21 ఆర్థిక సంవత్సరంలో పీఎఫ్ మొత్తాలపై వడ్డీని చందాదారుల ఖాతాల్లో ఈపీఎఫ్​ఓ జమ చేస్తోంది. 8.5శాతం చొప్పున 25కోట్ల మంది ఖాతాదారుల ఎకౌంట్​లో వడ్డీ జమ కానుంది. మరి మీ ఖాతాలో వడ్డీ జమ అయిందా? లేదా? ఓసారి చూసుకోండి.

  • టీమ్​ఇండియాతో ఆ స్టార్​ ప్లేయర్ దూరం!

Ind vs SA: టీమ్​ఇండియాతో జరగబోయే టెస్ట్​ సిరీస్​లో కొన్ని మ్యాచ్​లకు దక్షిణాఫ్రికా స్టార్​ క్రికెటర్ క్వింటన్ డికాక్ దూరంకానున్నట్లు తెలుస్తోంది. అతడి భార్య సాషా తమ తొలి బిడ్డకు జన్మనివ్వనుండటమే అందుకు కారణం.

Last Updated : Dec 14, 2021, 9:58 PM IST

ABOUT THE AUTHOR

...view details