తెలంగాణ

telangana

ETV Bharat / city

Telangana Top News: టాప్​న్యూస్ @9AM - తెలంగాణ వార్తలు

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

9AM TOPNEWS
9AM TOPNEWS

By

Published : Oct 18, 2022, 8:58 AM IST

  • అంతా మనీగోడు.. ఉప ఎన్నికలో మొదలైన డబ్బు ప్రవాహం

మునుగోడు ఉపఎన్నికలో డబ్బు ప్రవాహం నియోజకవర్గంలో మొదలైపోయింది. ఓటర్లను కొనుగోలు చేయడానికి డబ్బును విచ్చలవిడిగా విరజిమ్ముతున్నారు.

  • మునుగోడు ఉపఎన్నికతో వ్యవసాయానికి వచ్చిన తిప్పలు..

ఉప ఎన్నిక వేళ మునుగోడు పరిధి పల్లెల్లో కోలాహలం మొదలైంది. ఎటుచూసినా కార్లు, నేతలే కనిపిస్తున్నారు. వ్యవసాయ కూలీలంతా ప్రచారంలోనే నిమగ్నమవడంతో వ్యవసాయానికి కష్టం వచ్చి పడింది. దీంతో పొలం పనులు సాగడం లేదంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

  • మునుగోడు ప్రచారంలో జోరు పెంచేందుకు సిద్ధమైన హస్తం నేతలు

అధ్యక్ష ఎన్నికలు ముగియడంతో మునుగోడులో ప్రచారజోరు పెంచేందుకు కాంగ్రెస్‌ నాయకులు సిద్ధమయ్యారు. ఇవాళ్టి నుంచి 22 వరకు క్షేత్రస్థాయిలో ఇంటింటి ప్రచారం చేసేలా కార్యాచరణ రూపొందించుకున్నారు.

  • గోదావరి-కావేరి నదుల అనుసంధానంపై నేడు కీలక సమావేశం

గోదావరి-కావేరి నదుల అనుసంధానానికి సంబంధించి కొత్త ప్రతిపాదనపై భాగస్వామ్య రాష్ట్రాలతో జాతీయ జల అభివృద్ధి సంస్థ ఇవాళ చర్చించనుంది.

  • 'న్యాయం జరిగే వరకు కశ్మీర్​లో టార్గెట్‌ హత్యలు ఆగవు'

కశ్మీర్​లో టార్గెట్ హత్యలపై మాజీ ముఖ్యమంత్రి ఫరూఖ్ అబ్దుల్లా కీలక వ్యాఖ్యలు చేశారు. న్యాయం జరగకపోతే కశ్మీర్​లో టార్గెట్ హత్యలు ఆగవని అన్నారు. ఇటీవల షోపియాన్ జిల్లాలో హత్యకు గురైన పండిట్​ పూర్ణ కృష్ణ భట్‌ హత్యకు ఆర్టికల్‌ 370 తొలగింపే ఓ రకంగా కారణమని ఆయన పేర్కొన్నారు.

  • ఐరోపా దేశాలకు భారీగా ఔషధ ఎగుమతులు.. కలిసి రానున్న 'చైనా ప్లస్‌ వన్‌' విధానం

ఐరోపా దేశాలకు ఔషధ ఎగుమతులు పెంచుకునే అవకాశం భారత్​కు లభించనుంది. ఇకపై చైనాపై ఆధారపడడాన్ని తగ్గించాలని ఐరోపా దేశాలు భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలో దేశీయ ఫార్మా పరిశ్రమ లాభపడనుంది.

  • వయసును తగ్గించే డ్రైఫ్రూట్స్.. మీరు వీటిని తింటున్నారా!

వయసును ఎలా తగ్గిస్తారు అనుకుంటున్నారా! వయసు వచ్చినా ఆరోగ్యంగా, ఉత్సాహంగా ఉండటమే వయసు తగ్గించుకోవటం. చాలామంది వయసు మళ్లిన ఛాయలు కనిపించకుండా ఉండేందుకు అనేక ప్రయత్నాలు చేస్తుంటారు.

  • నైజీరియాలో వర్షాల బీభత్సం.. వరదల ధాటికి 600 మంది బలి

నైజీరియాను వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. భీకర వరదల కారణంగా నైజీరియాలో 600 మందికి పైగా ప్రజలు మరణించారని అధికారులు తెలిపారు. మరో 13లక్షల మంది నిరాశ్రయులుగా మారారని పేర్కొన్నారు.

  • చిన్న టీమ్​ల పెద్ద దెబ్బ.. ఛాంపియన్లకు వరుస షాక్​లు.. బహుపరాక్!

నమీబియా చేతిలో శ్రీలంక ఓటమి. టీ20 ప్రపంచకప్‌ తొలి రోజే పెద్ద సంచలనం! దీనికే షాకవుతుంటే.. స్కాట్లాండ్‌ చేతిలో వెస్టిండీస్‌ కంగుతింది! ఈ రెండు విజయాలు గాలివాటం అనుకుంటే పొరపాటే. ఆ జట్లేమీ చిన్న తేడాతోనో, అదృష్టం కలిసొచ్చో గెలిచేయలేదు.

  • ఆచితూచి అడుగులు.. ఆలస్యమైనా సరే అలాంటి కథతోనే ముందుకు..

రానున్న కొన్ని నెలల సమయాన్ని కథల కోసమే కేటాయిస్తా అంటారు నాగార్జున. మంచి కథ దొరికేవరకు ఎంతకాలమైనా ఎదురు చూడాల్సిందే అనేది వెంకటేష్‌ మాట. సరైన కథ కోసం, సరైన నిర్ణయం కోసం ఓ యువ కథానాయకుడి సన్నిహితులు బృందంగా ఏర్పడి కసరత్తులు కొనసాగిస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details