తెలంగాణ

telangana

ETV Bharat / city

Telangana News Today: టాప్​న్యూస్​ @ 1PM

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

Telangana News Today
Telangana News Today

By

Published : Oct 4, 2022, 1:08 PM IST

  • మరోసారి ఉత్తర కొరియా క్షిపణి పరీక్ష.. పది రోజుల్లో ఐదు సార్లు!

హెచ్చరికలు వస్తున్నా లెక్కచేయకుండా ఉత్తర కొరియా తన క్షిపణి పరీక్షలను కొనసాగిస్తూనే ఉంది. గత 10 రోజుల్లో ఐదు పరీక్షలు నిర్వహించిన కిమ్‌ సర్కార్‌... మంగళవారం మరోసారి బాలిస్టిక్‌ క్షిపణిని పరీక్షించిందని దక్షిణ కొరియా సైన్యం తెలిపింది.

  • సరదాగా ఈతకు వెళ్లారు.. అనంత లోకాలకు చేరుకున్నారు..

Two young man died After falling into the river: ఈత సరదా ఇద్దరు యువకుల ప్రాణాలను బలితీసుకుంది. వాగులో ఈతకు దిగి.. నీటి ప్రవాహం పెరగడంతో గల్లంతయ్యారు. గజ ఈతగాళ్లు వారి మృతదేహాలను బయటకు తీశారు. ఈ ఘటన హైదరాబాద్ శివారు శంషాబాద్​లో చోటుచేసుకుంది.

  • బీ అలర్ట్​.. దసరా, ఆ తర్వాతి రోజు భారీ వర్షాలు..

TS WEATHER REPORT: బంగాళాఖాతం పశ్చిమ మధ్య ప్రాంతంపై అల్పపీడనం ఏర్పడింది. దీనికి అనుబంధంగా సముద్రమట్టం నుంచి 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు గాలులతో ఉపరితల ఆవర్తనం విస్తరించింది. దీని ప్రభావంతో రాష్ట్రంలో దసరా, ఆ తర్వాతి రోజు భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది.

  • అనారోగ్యంతో మరణించిన భర్త.. దహన సంస్కారాలు నిర్వహించిన భార్య..

wife made Husband Funerals: భర్త మరణిస్తే.. కట్టుకున్న భార్యే దహన సంస్కారాలు నిర్వహించడం లాంటివి సాధారణంగా మనం సినిమాల్లో చూస్తుంటాం. నిజ జీవితంలో ఇలాంటి పనులు చేయకూడదు, చేస్తే అరిష్టం పట్టుకుంటుందంటూ పెద్దలు వారిస్తుంటారు. అయితే వీటిని పట్టించుకోకుండా.. ఓ మహిళ తన భర్త దహన సంస్కారాలు నిర్వహించింది. ఎక్కడో తెలియాలంటే ఇది చదివేయండి.

  • డీజీ దారుణ హత్య.. అతడిపైనే డౌట్.. 'ఉగ్ర కోణం'పై పోలీసుల క్లారిటీ

జమ్ముకశ్మీర్​ జైళ్ల శాఖ డైరక్టర్ జనరల్ హత్యకు గురయ్యారు. ఈ ఘటన జరిగినప్పటి నుంచి కనిపించకుండా పోయిన పని మనిషిపై పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అతడి కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు. అయితే.. ఇదంతా తమ పనేనని ఓ ఉగ్రసంస్థ ప్రకటించుకోవడం చర్చనీయాంశమైంది. పోలీసులు మాత్రం ఉగ్రకోణం లేదని స్పష్టం చేశారు.

  • యాప్​లో రూ.5వేలు లోన్.. వడ్డీతో కలిపి రూ.80వేలు బాదుడు.. ఐటీ ఉద్యోగి ఆత్మహత్య

లోన్​ యాప్​ నిర్వాహకుల ధనదాహానికి మరొక ప్రాణం బలైంది. మూడు నెలల క్రితం రూ.5వేలు అప్పు ఇచ్చి.. రూ.80వేలు కట్టాలని ఓ లోన్​ యాప్​ సిబ్బంది వేధించగా.. 23ఏళ్ల ఐటీ ఉద్యోగి ఆత్మహత్య చేసుకున్నాడు. చెన్నై కేకే నగర్​లో సోమవారం జరిగిందీ ఘటన.

  • మూడొంతుల మురుగు నీరు నదుల్లోకే!

"ప్రస్తుతం దేశంలోని పట్టణ ప్రాంతాల నుంచి వెలువడే మురుగునీటిలో 28% (రోజుకు 20,236 మిలియన్‌ లీటర్లు) మాత్రమే శుద్ధి అవుతోంది. మిగిలిన 72% శుద్ధిచేయని మురుగునీరు నదులు, సరస్సులు, భూగర్భంలో కలుస్తోంది. దానివల్ల ఆ జలవనరుల్లోని నీరు కలుషితమై నాణ్యత దిగజారుతోంది." అని నీతి ఆయోగ్ ఓ నివేదికలో పేర్కొంది.

  • కుమారుడికి ప్రాణాంతక వ్యాధి.. రూ.కోటి సాయమందిస్తామన్న దాతలు.. అంతలోనే..!

Couple Death in Road Accident: వారిది నిరుపేద కుటుంబం. ఇద్దరు కుమారులతో సంతోషంగా జీవిస్తున్నారు. అంతలోనే చిన్న కుమారుడికి ప్రాణాంతక వ్యాధి సోకడంతో వారి కాళ్లకింద భూమి కంపించింది. వీరి గుండెకోతను అర్థం చేసుకున్న దాతలు.. ఏకంగా రూ.కోటి సాయం చేస్తామన్నారు. బిడ్డను బతికించుకుంటామనే ఆశ చిగురించింది. చికిత్స కోసం వెళ్తూ తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు.

  • 'ఇప్పుడే ఫామ్​లోకి వచ్చారు.. అప్పుడే రెస్ట్​ ఇస్తే ఎలా?'.. మేనేజ్​మెంట్​పై మాజీలు ఫైర్​!

'ఇప్పుడే ఫామ్‌లోకి వచ్చారు.. అప్పుడే రెస్ట్‌ ఇస్తే ఎలా? అంటూ టీమ్​ఇండియా మేనేజ్‌మెంట్‌పై మండిపడుతున్నారు పలువురు మాజీ క్రికెటర్లు, అభిమానులు. సౌతాఫ్రికాతో మూడో టీ20కి కోహ్లీ, రాహుల్‌కు విశ్రాంతినివ్వడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

  • దీపావళి రేసు నుంచి రవితేజ 'ధమాకా' ఔట్.. శ్రీనువైట్లతో గోపీచంద్ కొత్త మూవీ!

హీరో రవితేజ నటించిన 'ధమాకా' చిత్రం షూటింగ్‌ పూర్తి చేసుకుని ప్రస్తుతం పోస్టు ప్రొడక్షన్​ పనులు జరుపుకుంటుంది. అయితే దీపావళి కానుకగా ఈ సినిమాను మేకర్స్​ రిలీజ్​ చేద్దామని మొదట అనుకున్నా.. ఇప్పుడు నిర్ణయం మార్చుకున్నట్లు తెలుస్తోంది. మరోవైపు, హీరో గోపీచంద్.. డైరెక్టర్​ శ్రీను వైట్లతో సినిమా చేయబోతున్నారని సమాచారం.

ABOUT THE AUTHOR

...view details