తెలంగాణ

telangana

ETV Bharat / city

Telangana News Today : టాప్​న్యూస్​ @9PM - Telugu top ten news

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

టాప్​న్యూస్​
టాప్​న్యూస్​

By

Published : Sep 26, 2022, 8:55 PM IST

  • 'హైదరాబాద్​లో భారీ వర్షం..'​

Hyderabad Rains Today: హైదరాబాద్​లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. నగరంలో పలు ప్రాంతాల్లో కుండపోత వర్షం కురుసింది. రహాదారుల పైకి నీరు రావడంతో వాహనాదారులు, బాటసారులు ఇబ్బందులు పడ్డారు.

  • మీ దగ్గర అది నచ్చింది.. సమస్యలన్నీ పరిష్కరిస్తా: మంత్రి కేటీఆర్‌

KTR Basara Tour: భవన నిర్మాణం చేయడం తేలిక.. వసతుల నిర్వహణ సవాల్‌తో కూడుకున్నదని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. సంతృప్తికర స్థాయిలో సౌకర్యాలు, వసతులు కల్పించాలని విద్యార్థులు కోరారని ఆయన తెలిపారు.

  • 'ఐలమ్మ గొప్ప పోరాట యోధురాలు..'

Governor on Chakali Ilamma: తెలంగాణ వీరవనిత చాకలి ఐలమ్మ గొప్ప పోరాట యోధురాలని.. పీడిత వర్గ ప్రజల కోసం ఎనలేని పోరాటం చేశారని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ కొనియాడారు. నేడు ఆమె జయంతిని పురస్కరించుకుని లోయర్‌ట్యాంక్‌బండ్‌ వద్ద ఉన్న ఐలమ్మ విగ్రహానికి పూలమాల వేసి అంజలి ఘటించారు.

  • 'అధికారంలోకి వచ్చాక కూడా జగన్​ ఫ్యాక్షన్ స్టైల్‌లోనే ఉంటే ఎట్లా..?'

Jaggareddy on NTR University Name Change: ఎన్టీఆర్ వర్సిటీ పేరు మార్పు సరికాదని సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు. ఏపీ సీఎం జగన్ తీసుకున్న నిర్ణయాన్ని ఆయన ఖండించారు.

  • రాజస్థాన్ సంక్షోభం.. అధిష్ఠానం అలర్ట్..!

Rajasthan politics: ఏఐసీసీ అధ్యక్ష ఎన్నికలకు ముందు రాజస్థాన్‌ కాంగ్రెస్‌లో నెలకొన్న సంక్షోభ నివారణకు అధిష్ఠానం ప్రయత్నాలు చేస్తోంది. సచిన్ పైలెట్ రాజస్థాన్‌ సీఎం కాకుడదనే లక్ష్యంతో గహ్లోత్ వర్గం అధిష్ఠానానికే షరతులు విధించిన నేపథ్యంలో పరిస్థితి చక్కదిద్దేందుకు సీనియర్లతో కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీ మంతనాలు జరుపుతున్నారు.

  • గులాం నబీ ఆజాద్ కొత్త పార్టీ ప్రకటన.. పేరు ఏంటంటే?

Ghulam Nabi Azad new party : కాంగ్రెస్ మాజీ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ తన కొత్త పార్టీకి 'డెమొక్రటిక్ ఆజాద్ పార్టీ' అని పేరు ఖరారు చేశారు. నూతన జెండాను సైతం ఆవిష్కరించారు.

  • స్కూల్​లో కాల్పులు.. 15 మంది బలి..

సాయుధ దుండగుడు ఓ పాఠశాలలో బీభత్సం సృష్టించాడు. తుపాకీతో విచక్షణారహితంగా కాల్పులు జరిపి 11 మంది చిన్నారులు సహా మొత్తం 15 మందిని బలిగొన్నాడు. రష్యాలోని ఇజెవ్​స్క్​లో సోమవారం జరిగిందీ ఘటన.

  • మాంద్యం భయాలు.. స్టాక్ మార్కెట్లకు భారీ నష్టాలు..

దేశీయ స్టాక్ మార్కెట్లు భారీగా నష్టపోయాయి. సెన్సెక్స్ 900 పాయింట్లకు పైగా పతనమైంది. నిఫ్టీ 311 పాయింట్లు కోల్పోయింది. రూపాయి జీవితకాల కనిష్ఠస్థాయిని నమోదు చేసింది.

  • టీ20 ర్యాంకింగ్స్​లో భారత్​ టాప్..

ICC T20 Rankings 2022 : టీ20 ర్యాంకింగ్స్​ను ప్రకటించింది ఐసీసీ. తాజాగా సిరీస్ గెలిచిన భారత్​ 268 పాయింట్లతో మొదటి స్థానంలో నిలిచింది.

  • 'నా భర్త శ్రీహరి చనిపోయాక ఎవరూ పట్టించుకోలేదు.. బాలయ్య మాత్రమే'

తన భర్త చనిపోయాక ఎవ్వరూ పట్టించుకోలేదని అన్నారు శ్రీహరి భార్య డిస్కో శాంతి. బాలకృష్ణ ఒక్కరే కాల్​ చేసి తన బాగోగులు అడిగారని గుర్తుచేసుకున్నారు.

ABOUT THE AUTHOR

...view details