తెలంగాణ

telangana

ETV Bharat / city

Telangana News Today : టాప్​న్యూస్​ @ 9AM - TOP NEWS IN TELANGANA TODAY

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

Telangana News Today : టాప్​న్యూస్​ @ 9AM
Telangana News Today : టాప్​న్యూస్​ @ 9AM

By

Published : Sep 25, 2022, 9:01 AM IST

  • ఆసుపత్రిలో అగ్నిప్రమాదం.. వైద్యుడి సజీవదహనం..

Fire Accident in Hospital in Renigunta: ఏపీలోని తిరుపతి జిల్లా రేణిగుంటలోని భగత్ సింగ్ కాలనీలో అగ్నిప్రమాదం జరిగింది. కార్తిక చిన్న పిల్లల ఆసుపత్రిలో మంటలు చెలరేగాయి. ఒక్కసారి మంటలు మొత్తం వ్యాపించడంతో.. ఆస్పత్రిపైనే ఉంటున్న వైద్యుడి కుటుంబం మంటల్లో చిక్కుకుపోయింది. వైద్యుడు రవిశంకర్‌రెడ్డి మంటల్లోనే సజీవ దహనమయ్యారు.

  • నేటి నుంచి బతుకమ్మ వేడుకలు షురూ..

రాష్ట్ర పండుగ బతుకమ్మ ఉత్సవాలు ఇవాళ్టి నుంచి ప్రారంభం కానున్నాయి. పెత్రమాస నాడు ఎంగిలి పూల బతుకమ్మగా కొలువుదీరే ఈ పూల పండుగ... సద్దుల బతుకమ్మతో ముగుస్తుంది. ఈసారి బతుకమ్మ వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోంది.

  • ఆకట్టుకుంటున్న 'మింట్​ మ్యూజియం'..

హైదరాబాద్​లోని సైఫాబాద్‌లో ఏర్పాటు చేసిన మింట్ మ్యూజియం నగరవాసులను ఆకట్టుకుంటుంది. ప్రపంచం క్రిప్టో కరెన్సీ వైపు పరుగులు పెడుతున్న వేళ భావితరాలకు అప్పటి నాణేల ముద్రణపై అవగాహన కల్పించేందుకు మ్యూజియం ఏర్పాటు చేశారు. దేశంలో అత్యుత్తమ మ్యూజియంగా తీర్చిదిద్దేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోంది.

  • భారత్‌-ఆసీస్ మ్యాచ్​కు సర్వం సిద్ధం..

భారత్‌ - ఆస్ట్రేలియా మధ్య టీ20 మ్యాచ్‌ నేడు హైదరాబాద్‌ ఉప్పల్‌ స్టేడియం వేదికగా జరగనుంది. మ్యాచ్‌కు సంబంధించిన అన్ని ఏర్పాట్లను హైదరాబాద్‌ క్రికెట్‌ అసోషియేషన్‌ పూర్తి చేసింది. భారత్‌ - ఆసిస్‌ జట్లు ఇప్పటికే హైదరాబాద్‌కు చేరుకుని తాజ్‌ కృష్ణ, పార్క్‌ హాయత్‌ హోటల్‌లో బస చేశాయి. క్రికెట్‌ మ్యాచ్‌ నేపథ్యంలో పోలీసులు కట్టదిట్టమైన భద్రతా ఏర్పాట్లు కల్పించారు. ఆటను తిలకించేందుకు క్రికెట్‌ అభిమానులు ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు.

  • బతుకమ్మ.. తెలంగాణ సంస్కృతిని విశ్వవాప్తం చేసింది..

రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రత్యేకంగా నిర్వహించే పండుగ బతుకమ్మ. ఈ సంవత్సరం బతుకమ్మ పండుగను గొప్పగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం రూ. 350 కోట్లతో చేనేత చీరలను ఆడపడుచులకు కానుకగా ఇచ్చింది. నేటి నుంచి జరిగే బతుకమ్మ పండుగ సందర్భంగా మహిళలకు ముఖ్యమంత్రి కేసీఆర్​ శుభాకాంక్షలు తెలిపారు.

  • 'విదేశాల్లో ఉద్యోగ ఆఫర్లు'.. గుడ్డిగా నమ్మితే అంతే సంగతి..

విదేశాల్లో స్థిరపడాలన్న ఆశతో ఉద్యోగ ప్రయత్నాలు చేసే వ్యక్తులను మోసం చేసేందుకు ఆయా దేశాల్లో ముఠాలు ఏర్పడుతున్నాయి. ఉద్యోగాలిప్పిస్తామని మభ్యపెట్టి తీరా అక్కడికి వెళ్లాక వారిని అక్కడ బందీలుగా చేస్తున్నాయి. ఇలాంటి విషయాల్లో అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తూ కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ శనివారం ప్రకటన జారీ చేసింది.

  • భారతీయులకు గుడ్​న్యూస్.. గ్రీన్​కార్డు దరఖాస్తుల ప్రక్రియ వేగవంతం!

అమెరికా గ్రీన్​ కార్డు దరఖాస్తులను వేగవంతం చేయాలని అమెరికా ప్రెసిడెన్షియల్‌ కమిషన్‌ నుంచి వచ్చిన సూచనలను వైట్​హౌస్ పరిశీలిస్తోంది. ఈ మేరకు ​మొత్తం పెండింగు దరఖాస్తులన్నింటినీ 2023 ఏప్రిల్‌లోగా పరిష్కరించాలని ప్రతిపాదనలో కోరింది.

  • 'ఈక్విటీ పెట్టుబడుల సంస్కృతి పెరుగుతోంది.. బాండ్లలో లావాదేవీలు నిర్వహిస్తాం'

నేషనల్‌ సెక్యూరిటీస్‌ డిపాజిటరీ లిమిటెడ్‌ కొత్త ఉత్పత్తులు, సేవలపై దృష్టి సారించింది. ఇప్పటివరకు ప్రధానంగా ఈక్విటీ మార్కెట్​కు సేవలు అందించిన ఎన్​ఎస్​డీఎల్.. 'ఎలక్ట్రానిక్‌ గోల్డ్‌ రిసీట్స్‌' వంటి కొత్త ఉత్పత్తులకు తన సేవలను విస్తరించే యోచనలో ఉంది. ఈ మేరకు ఎన్‌ఎస్‌డీఎల్‌ ఎండీ, సీఈఓ పద్మజ చుండూరు 'ఈనాడు'కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కీలక విషయాలు వెల్లడించారు.

  • టీమ్​ ఇండియాను వీడని సమస్యలు.. హైదరాబాద్​లో గట్టెక్కేనా..?

India Australia T20 Series : టీ20 ప్రపంచకప్‌ సమీపిస్తోంది.. పొట్టి కప్పు సంగ్రామానికి సరిగ్గా నెల కూడా లేదు.. కానీ ఇప్పటికీ టీమ్‌ఇండియాను సమస్యలు వదలడం లేదు. బ్యాటింగ్‌లో నిలకడ లేమి. బౌలింగ్‌లో నిలకడగా వైఫల్యం జట్టు సన్నద్ధతను ప్రశ్నార్థకం చేస్తోంది. ఈ నేపథ్యంలో మరో కీలక సమరానికి సిద్ధమైంది భారత జట్టు. ఆస్ట్రేలియాతో మూడు టీ20ల సిరీస్‌ను నిర్ణయించే మ్యాచ్‌ ఆదివారమే.

  • ఓటీటీలో నయన్ పెళ్లి వీడియో.. కోట్లు పెట్టి కొన్న నెట్​ఫ్లిక్స్​.. టీజర్ చూశారా?

Nayanthara Documentary Netflix : తమిళ ముద్దుగుమ్మ నయనతార.. దర్శకుడు విఘ్నష్ శివన్​ల పెళ్లి జూన్​లో జరిగింది. వివాహానికి సంబంధించిన వీడియోలు ఇంతవరకు బయటకు రాలేదు. ఇప్పుడు ఆ వీడియోను డాక్యుమెంటరీ రూపంలో తీసుకొస్తున్నారు ఈ జంట. దీనికి భారీ మొత్తాన్ని చెల్లించి నెట్​ఫ్లిక్స్​ కొనుగోలు చేసింది. తాజాగా ఈ డాక్యుమెంటరీకి సంబంధించిన టీజర్​ నెట్​ఫ్లిక్స్​లో రిలీజ్​ అయింది.

ABOUT THE AUTHOR

...view details