తెలంగాణ

telangana

ETV Bharat / city

Telangana News Today : టాప్​న్యూస్​ @ 7AM - తెలంగాణ వార్తలు

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

Telangana News Today
Telangana News Today

By

Published : Sep 21, 2022, 6:59 AM IST

  • భారీ అగ్నిప్రమాదం.. ముగ్గురు సజీవదహనం

Fire Accident in Paper Plates Manufacturing Industry: ఆంధ్రప్రదేశ్​లోని చిత్తూరు జిల్లా కేంద్రంలోని ఓ పేపర్‌ ప్లేట్ల తయారీ పరిశ్రమలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. అర్ధరాత్రి సమయంలో పరిశ్రమలో మంటలు చెలరేగి.. ముగ్గురు వ్యక్తులు సజీవ దహనమయ్యారు.

  • బైక్ లిఫ్ట్ మిస్టరీ ఛేదించిన పోలీసులు

Khammam bike lift murder case update : రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఇంజక్షన్ దాడి హత్య ఘటనలో ఖమ్మం జిల్లా పోలీసులు కీలక పురోగతి సాధించారు. ద్విచక్ర వాహనంపై లిఫ్ట్ ఇచ్చిన వ్యక్తిని ఇంజక్షన్ ఇచ్చి చంపేసిన ఘటనపై 24 గంటల్లోనే నిందితులకు సంబంధించి పూర్తి ఆధారాలు సేకరించారు. వివాహేతర సంబంధం కోణంలోనే పోలీసుల విచారణ సాగుతున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది.

  • అక్టోబర్​లో మునుగోడు ఉపఎన్నిక నోటిఫికేషన్​..!

KCR Review on Munugode By Poll : మునుగోడు ఉపఎన్నిక షెడ్యూలు అక్టోబరులో రావచ్చని, నవంబరులో ఎన్నిక జరగవచ్చని, తెరాస అందుకు సర్వసన్నద్ధంగా ఉండాలని తెరాస పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కేసీఆర్‌ సూచించారు. మునుగోడు ఉప ఎన్నికపై ప్రగతిభవన్‌లో ఉమ్మడి నల్గొండ జిల్లా నాయకులతో కేసీఆర్‌ సమీక్షించారు. పార్టీ జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి జగదీశ్‌రెడ్డి, పార్టీ జిల్లా ఇన్‌ఛార్జి, ఎమ్మెల్సీ తక్కళ్లపల్లి రవీందర్‌రావు, ఎమ్మెల్యేలు రవీంద్రకుమార్‌, చిరుమర్తి లింగయ్య, గ్యాదరి బాలమల్లు, మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి సమీక్షలో పాల్గొన్నారు.

  • 'దసరా సెలవులు తగ్గించండి'

dussehra holidays in telangana తెలంగాణలో పాఠశాలలకు ఇప్పటికే ఖరారు చేసిన దసరా సెలవుల్ని తగ్గించాలని ఎస్‌సీఈఆర్‌టీ ప్రతిపాదించినట్టు వార్తలు వస్తున్నాయి. దసరాకు 14 రోజులకు బదులుగా తొమ్మిది రోజులే సెలవులు ఇవ్వాలని పాఠశాల విద్యాశాఖకు సూచించినట్టు తెలుస్తోంది.

  • దసరాకు సాధారణ ఛార్జీలతోనే స్పెషల్ బస్సులు

TS RTC runs special buses for Dussehra: దసరా పండుగ వేళ సొంతూళ్లకు వెళ్లే వారి కోసం ఆర్టీసీ ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేస్తోంది. హైదరాబాద్‌లోని ప్రధాన బస్‌స్టేషన్‌లైన ఎంజీబీఎస్​, జేబీఎస్‌తో నగరంలోని మరిన్ని పాయింట్‌ల నుంచి ప్రత్యేక బస్సులు నడపనున్నారు. ఈ నెల 24నుంచి అక్టోబర్‌ 5 వరకు ఈ ప్రత్యేక బస్సులు అందుబాటులో ఉంటాయని అధికారులు చెబుతున్నారు.

  • గుజరాత్‌లో కేజ్రీవాల్​కు చేదు అనుభవం

గుజరాత్ పర్యటనలో ఆప్ అధినేత కేజ్రీవాల్​కు చేదు అనుభవం ఎదురైంది. ఎయిర్​పోర్టు నుంచి బయటకు రాగానే కొందరు వ్యక్తులు ఆయన ముందే 'మోదీ.. మోదీ..' అంటూ నినాదాలు చేశారు. దీనిపై కేజ్రీవాల్ మండిపడ్డారు.

  • కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలకు రాహుల్ దూరం

కాంగ్రెస్​ పార్టీ అధ్యక్ష పదవిని ఎవరిని వరిస్తుందా అన్న విషయం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. పార్టీలోని అగ్రనేతలు ఎన్నికల్లో బరిలోకి దిగేందుకు సిద్ధమవుతుండగా.. రాహుల్ గాంధీ పోటీ చేస్తారా లేదా అన్న విషయంపై స్పష్టత కొరవడింది. అయితే తాజాగా దీనిపై పార్టీ వర్గాలు కీలక వ్యాఖ్యలు చేశాయి.

  • హిజాబ్ ఆందోళనల వెనక భారీ కుట్ర

కర్ణాటకలో హిజాబ్ నిరసనలు కుట్ర ప్రకారమే జరిగాయని ఆ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీకోర్టుకు తెలిపింది. నిరసనల వెనక పీఎఫ్ఐ హస్తం ఉందని ఆరోపించింది.

  • తొలి టీ20లో ఆసీస్​దే విజయం

తొలి టీ20లో టీమ్​ఇండియాపై విజయం సాధించింది ఆస్ట్రేలియా. నాలుగు వికెట్ల తేడాతో గెలుపొందింది.

  • 'గిరి గీసుకొని ఉంటానంటే ఎలా?

Alluri Movie : టాాలీవుడ్ యువ నటుడు శ్రీవిష్ణు మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. ఎప్పుడూ కొత్తదనం నిండిన కథల్ని ఎంచుకునే శ్రీవిష్ణు.. ఈసారి ఖాకీ చొక్కా వేసుకుని ప్రేక్షకుల్ని అలరించనున్నాడు. సెప్టెంబర్​ 23న విడుదయ్యే 'అల్లూరి' చిత్ర విశేషాలు విలేకర్లతో పంచుకున్నారు.

ABOUT THE AUTHOR

...view details