తెలంగాణ

telangana

ETV Bharat / city

Telangana News Today : టాప్​న్యూస్​ @ 7AM - తెలంగాణ వార్తలు

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

Telangana News Today
Telangana News Today

By

Published : Sep 19, 2022, 7:00 AM IST

  • నేడు బ్రిటన్ క్వీన్ ఎలిజబెత్-2 అంత్యక్రియలు

UK queen funeral : బ్రిటన్ క్వీన్ ఎలిజబెత్-2 అంత్యక్రియలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. రాచరికపు సంప్రదాయాలతో వందల ఏళ్ల నుంచి వస్తున్న ఆచారవ్యవహారాలను పాటిస్తూ రాణికి సోమవారం తుది వీడ్కోలు పలకనున్నారు.

  • రాష్ట్రానికి మరోసారి భారీ వర్ష సూచన..!

TS Weather Report: రాష్ట్రంలో నేడు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ సూచించింది. రాష్ట్రంలోకి వాయువ్య దిశ నుంచి గాలులు వీస్తున్నాయని ప్రకటించిన వాతావరణ శాఖ.. ఈ నెల 20న వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని హెచ్చరించింది.

  • తెలుగు రాష్ట్రాల్లో ఎన్ఐఏ సోదాలు

NIA Searches in PFI case: తెలుగు రాష్ట్రాల్లో జాతీయ దర్యాప్తు సంస్థ సోదాలు కలకలం రేపాయి. పాపులర్​ ఫ్రంట్​ ఆఫ్​ ఇండియా కేసులో.. తెలుగు రాష్ట్రాల్లో 40 చోట్ల అధికారులు విస్తృత తనిఖీలు నిర్వహించారు. ఉగ్రమూలాలు ఉన్నాయనే కోణంలో దేశవ్యాప్తంగా పీఎఫ్​ఐ శిక్షణా కార్యక్రమాలపై నిఘా పెట్టిన అధికారులు.. నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. మరో 26 మందిపై కేసులు నమోదు చేసినట్లు వెల్లడించారు.

  • ఘనంగా తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలు

Telangana National Unity Vajrotsavam: తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలు మూడోరోజూ ఘనంగా జరిగాయి. జిల్లాల్లో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు తెలంగాణ సంస్కృతికి ప్రతీకగా నిలిచాయి. స్వాతంత్య్ర సమరయోధులు, కవులు, కళాకారులను ఘనంగా సన్మానించుకున్నారు. మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు హాజరై నాటి తెలంగాణ సాయుధ పోరాటంలో అసువులు బాసిన అమరుల త్యాగాలను స్మరించుకున్నారు.

  • సిటీ బస్సులో భారీగా మంటలు.. లోపల 12 మంది ప్రయాణికులు

ప్రయాణంలో ఉన్న బస్సులో భారీగా మంటలు చెలరేగాయి. మహారాష్ట్రలోని ఔరంగాబాద్​లో ఈ ఘటన జరిగింది. కర్మాడ్ నుంచి ఔరంగాబాద్ సెంట్రల్ బస్ స్టేషన్​కు వెళ్తున్న ఈ స్మార్ట్ సిటీ బస్సులో.. వరూద్ ఫతా ప్రాంతంలో ఉండగా మంటలు అంటుకున్నాయి. ఘటన సమయంలో బస్సులో 10 నుంచి 12 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలిసింది. అదృష్టవశాత్తూ ప్రాణనష్టం సంభవించలేదు. బస్సులో ఎలా మంటలు వ్యాపించాయనే విషయం ఇంకా తెలియలేదు.

  • కళ్లు ఆర్పిన హనుమంతుడు.. కెమెరాకు చిక్కిన అద్భుత దృశ్యం!

Hanuman Idol blinking eyes : మధ్యప్రదేశ్​లో అద్భుతం జరిగింది. హనుమంతుడు కళ్లు ఆర్పడం కెమెరాకు చిక్కింది. ఖార్​గోన్ జిల్లా బడవా మున్సిపాలిటీ పరిధి, ఓఖ్లా గ్రామంలోని ఓఖ్లేశ్వర్ ధామ్​లో ఉన్న హనుమాన్ మందిరంలో ఈ ఆసక్తికరమైన ఘటన చోటుచేసుకుంది. ప్రస్తుతం హనుమంతుడు కళ్లు ఆర్పిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

  • తైవాన్​లో మరోసారి భారీ భూకంపం

తైవాన్​ను​ భారీ భూకంపం అతలాకుతలం చేసింది. ఓ మూడంతస్తుల భవనం కూలిపోగా.. పలు చోట్ల ఆస్తి నష్టం జరిగింది. యూలిలో కొండచరియలు విరిగిపడగా అక్కడున్న దాదాపు 400 మంది పర్యటకులు చిక్కుకుపోయారు.


  • 'క్రెడిట్‌ కార్డ్' vs 'బయ్ నౌ పే లేటర్'

పండగలు వచ్చేస్తున్నాయి. కొనుగోలుదారులను ఆకర్షించేందుకు పలు ఆఫర్లూ సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే ఇ-కామర్స్‌ దిగ్గజాలు తమ రాయితీ అమ్మకాల తేదీలనూ ప్రకటించాయి. మరోవైపు కొనుగోలుదారులూ వీటిని నిశితంగా గమనిస్తున్నారు. రెండేళ్లతో పోలిస్తే ఈ ఏడాది పండగ కొనుగోళ్లు అధికంగా ఉంటాయని అంచనాలున్నాయి. ఈ నేపథ్యంలో క్రెడిట్‌ కార్డు, 'ఇప్పుడు కొనండి.. తర్వాత చెల్లించండి' (బీఎన్‌పీఎల్‌) ప్రధాన పాత్ర పోషించనున్నాయి. మరి ఈ రెండింటిలో ఏది మనకు అనుకూలమో చూద్దాం.

  • టీమ్ ఇండియా కొత్త జెర్సీ వచ్చేసింది..

Team India New Jersey : టీమ్​ ఇండియా జెర్సీలో మార్పులు చేసింది బీసీసీఐ. తాజాగా కొత్త జెర్సీ పొటోలను విడుదల చేసింది. మునుపటి దాని కంటే జెర్సీ లేత నీలి రంగులో ఉంది.

  • 'నా పిల్లల కన్నా మోదీనే ఇష్టం'.. స్టార్ నటుడి తల్లి పోస్ట్

కంగనా రనౌత్.. ఈ పేరు చాలా మందికి సుపరిచితమే ఎప్పుడూ వార్తల్లో ఉండే ఈ బాలీవుడ్ బ్యూటీ.. సోషల్ మీడియాలో ఎప్పుడూ చురుకుగానే ఉంటుంది. తెలుగులో 'ఏక్​ నిరంజన్​' చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. అయితే తాజాగా ఓ ఇన్​స్టాగ్రామ్​ పోస్ట్​కు స్పందించింది. అది ఏంటంటే..

ABOUT THE AUTHOR

...view details