తెలంగాణ

telangana

ETV Bharat / city

Telangana Top News: టాప్‌న్యూస్‌ @ 7PM - Telangana Top News

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

Telangana Top News: టాప్‌న్యూస్‌ @ 7PM
Telangana Top News: టాప్‌న్యూస్‌ @ 7PM

By

Published : Sep 18, 2022, 7:01 PM IST

  • 125 సినిమా హాల్స్​లో రాణి అంత్యక్రియలు లైవ్.. 36కి.మీ బారికేడ్లు..

UK queen funeral : బ్రిటన్ క్వీన్ ఎలిజబెత్-2 అంత్యక్రియలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. రాచరికపు సంప్రదాయాలతో వందల ఏళ్ల నుంచి వస్తున్న ఆచారవ్యవహారాలను పాటిస్తూ రాణికి సోమవారం తుది వీడ్కోలు పలకనున్నారు.

  • బీ అలర్ట్​.. రాష్ట్రానికి మరోసారి భారీ వర్ష సూచన..!

TS Weather Report: రాష్ట్రంలో నేడు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ సూచించింది. రాష్ట్రంలోకి వాయువ్య దిశ నుంచి గాలులు వీస్తున్నాయని ప్రకటించిన వాతావరణ శాఖ.. ఈ నెల 20న వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని హెచ్చరించింది.

  • మునుగోడు ప్రజల తీర్పుపైనే రాష్ట్ర భవిష్యత్తు: భట్టి విక్రమార్క

కేంద్రంలోని భాజపా, రాష్ట్రంలోని తెరాస మునుగోడు ప్రజలను డబ్బుతో తమవైపు తిప్పుకోవాలని.. రూ.వందల కోట్లు తీసుకొచ్చి వారి ఆత్మగౌరవం పట్ల అహంకారపూరితంగా వ్యవహరిస్తున్నారని భట్టి విక్రమార్క ఆరోపించారు. సిద్ధాంతాల భావజాలానికి మునుగోడు ప్రజలు కట్టుబడి ఉంటారే తప్ప డబ్బులకు అమ్ముడుపోరని తెలిపారు. ధన అహంకారాన్ని ప్రదర్శిస్తున్న తెరాస, భాజపా మెడలు వంచడానికి మునుగోడు ప్రజలు సిద్ధంగా ఉన్నారని భట్టి విక్రమార్క పేర్కొన్నారు.

  • ఒకే గ్రామంలో యువతి, యువకుడు ఆత్మహత్య.. ఆ వ్యవహారమే కారణమా..?

Young Woman and Young Man Suicide: ఒకే గ్రామంలో గంట వ్యవధిలో ఓ యువతి, యువకుడు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ విషాదకర ఘటన నాగర్​కర్నూల్​ జిల్లాలో సంచలనం రేపింది. వీరిద్దరి మధ్య గత కొంతకాలంగా ప్రేమ వ్యవహారం నడుస్తోందని స్థానికులు అంటున్నారు.

  • 'తెలంగాణపై కేంద్రం గజనీ మహమ్మద్​లా దండయాత్ర చేస్తోంది'

Prashant Reddy Fires On Central Government: తెలంగాణలో మతాల మధ్య చిచ్చు పెట్టడం భాజపా నేతలు మానుకోవాలని మంత్రి ప్రశాంత్ రెడ్డి హెచ్చరించారు. భాజపా ప్రభుత్వం తెలంగాణ మీద గజనీ మహమ్మద్​ కంటే ఎక్కువగా దండెత్తుతోందని విమర్శించారు. ఇప్పటికైనా భాజపా తీరు మార్చుకోవాలని ప్రశాంత్ రెడ్డి హితవు పలికారు.

  • 'చట్టసభల సాక్షిగా ప్రమాణం చేసి.. మాట తప్పితే విలువేముంటుంది'

Pawan Kalyan latest Comments: ఏపీలోని మంగళగిరిలో పార్టీ లీగల్​ సెల్​ సమావేశంలో జనసేన అధినేత పవన్ ​కల్యాణ్ మాట్లాడారు. ఈ సందర్భంగా రాజధాని ఆంశంపై ఆయన స్పందించారు. ఆంధ్రప్రదేశ్​ ప్రభుత్వం రాజధానిపై అనుసరిస్తున్న విధానం దారుణమని మండిపడ్డారు.

  • కేరళ సీఎంకు బొమ్మై షాక్.. అన్నింటికీ నో.. ఉత్త చేతులతో తిరిగెళ్లిన విజయన్

కర్ణాటక పర్యటనలో కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్​కు నిరాశే ఎదురైంది. పలు ప్రాజెక్టులపై సయోధ్య కుదుర్చుకునేందుకు కర్ణాటక సీఎం బొమ్మైను కలిసిన విజయన్​ ఉత్త చేతులతో తిరిగెళ్లారు. ఏ ప్రాజెక్టుకూ కర్ణాటక అంగీకారం తెలపలేదు.

  • 'క్రెడిట్‌ కార్డ్' vs 'బయ్ నౌ పే లేటర్'.. రెండింట్లో ఏది బెటర్?

పండగలు వచ్చేస్తున్నాయి. కొనుగోలుదారులను ఆకర్షించేందుకు పలు ఆఫర్లూ సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే ఇ-కామర్స్‌ దిగ్గజాలు తమ రాయితీ అమ్మకాల తేదీలనూ ప్రకటించాయి. మరోవైపు కొనుగోలుదారులూ వీటిని నిశితంగా గమనిస్తున్నారు. రెండేళ్లతో పోలిస్తే ఈ ఏడాది పండగ కొనుగోళ్లు అధికంగా ఉంటాయని అంచనాలున్నాయి. ఈ నేపథ్యంలో క్రెడిట్‌ కార్డు, 'ఇప్పుడు కొనండి.. తర్వాత చెల్లించండి' (బీఎన్‌పీఎల్‌) ప్రధాన పాత్ర పోషించనున్నాయి. మరి ఈ రెండింటిలో ఏది మనకు అనుకూలమో చూద్దాం.

  • ఎవరు ఏమనుకున్నా సరే.. అతడే నంబర్ 1 ఆల్​రౌండర్!

హార్దిక్ పాండ్యపై రవి శాస్త్రి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. హార్దిక్‌ పాండ్యనే నంబర్‌వన్ ఆల్‌రౌండర్‌ అని స్పష్టం చేశాడు. ఓ క్రీడా షోలో ఈ వ్యాఖ్యలు చేశారు.

  • రష్మికకు మరో బంపర్​ ఆఫర్​.. బాలీవుడ్​లోనూ తగ్గేదేలే!

'పుష్ప' సినిమా తర్వాత హీరోయిన్​ రష్మిక.. కెరీర్​లో వరుస ఆఫర్లతో దూసుకెళ్తోంది. బాలీవుడ్​లోనూ వరుస అవకాశాలు దక్కించుకుంటోంది. తాజాగా ఈ ముద్దుగుమ్మను సూపర్​ హిట్​ మూవీ సీక్వెల్​లో హీరోయిన్​గా తీసుకున్నట్లు తెలిసింది. ఆ సినిమా ఏంటంటే?

ABOUT THE AUTHOR

...view details