తెలంగాణ

telangana

ETV Bharat / city

Telangana News Today: 7PM టాప్​న్యూస్​

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

7PM TOPNEWS
7PM TOPNEWS

By

Published : Sep 6, 2022, 6:57 PM IST

  • ఇంటర్​ బాలిక ప్రసవం.. శిశువు మృతి.. పదో తరగతి విద్యార్థే..!

ఓ పాఠశాల శౌచాలయం వద్ద మృత శిశువు దొరికింది. దాన్ని చూసిన కొందరు విద్యార్థులు ఉపాద్యాయులకు తెలియజేశారు. వారు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృత శిశువును స్వాధీనం చేసుకున్నారు. ఈ అమానవీయ ఘటన ఎక్కడ జరిగిందంటే..

  • బాలుడిని దారుణంగా కరిచిన కుక్క.. మానవత్వం మరిచిన మహిళ

బాలుడిని కుక్క దారుణంగా కరిచిన ఘటన దిల్లీలో జరిగింది. దీనికి సంబంధించిన దృశ్యాలు సోషల్​ మీడియాలో వైరల్​గా మారాయి. ఆ మహిళా యజమాని తీరుపై నెటిజన్లు మండిపడుతున్నారు.

  • నడిరోడ్డుపై పోలీసుల కొట్లాట.. విధుల నుంచి తొలగింపు

హోం​గార్డ్, కానిస్టేబుల్​ మధ్య వాగ్వాదం కొట్లాటకు దారితీసింది. ఈ ఘటన ఉత్తర్​ప్రదేశ్​లోని జగమ్మన్​పుర్​ పోలీస్​స్టేషన్​ పరిధిలో చోటు చేసుకుంది. మద్యం విషయమై ఇరువురి మధ్య ఘర్షణ జరగడంతో మాటలు కాస్తా కొట్లాటకు దారీతీశాయి. వీడియో వైరల్​గా మారడంతో అధికారుల దృష్టికి చేరింది.

  • మూడుసార్లు చిక్కితే ఇంక అంతే..

నగర పరిధిలో మూడు నెలల వ్యవధిలో మూడుసార్లు ట్రాఫిక్‌ నిబంధనలు ఉల్లంఘించే వాహనదారులకు ట్రాఫిక్‌ పోలీసులు షాక్‌ ఇస్తున్నారు. ఇటువంటి వారికి 400 శాతం అదనంగా జరిమానా విధిస్తున్నారు.

  • రాజగోపాల్​రెడ్డి కార్యక్రమంలో 'రేవంత్ రెడ్డి'.. ఆ తరువాత

నల్గొండ జిల్లా నాంపల్లిలో భాజపా, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. రాజగోపాల్​రెడ్డి పాల్గొన్న ఓ కార్యక్రమం సమీపంలో కాంగ్రెస్ కార్యకర్తలు రేవంత్​రెడ్డికి సంబంధించిన పాటను పెట్టారు. దీంతో ఇరువర్గాల మధ్య వివాదం నెలకొంది. కొద్దిసేపటి తర్వాత గొడవ సద్దుమణిగింది.

  • కరెన్సీ వెలుగుల్లో దర్శనమిస్తున్న గణపతి.. ఎక్కడంటే.?

కుమురంభీం జిల్లా కాగజ్‌నగర్ పట్టణంలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణేష్ మండపంలో విఘ్నేశ్వరుడిని 11లక్షల 11వేల 116 రూపాయలతో అలంకరించారు.

  • 'జీపీఎస్ గురించి అయితే చర్చలకు పిలవొద్దు.. తేల్చిచెప్పిన ఉద్యోగ సంఘాలు'

ఏపీలో సీపీఎస్ ఉద్యోగ సంఘాలతో మంత్రుల చర్చలు అసంపూర్తిగా ముగిశాయి. పాత పింఛన్‌పై మాట్లాడదామంటేనే చర్చలకు వచ్చామని సమావేశంలో స్పష్టం చేసినట్లు ఉద్యోగ సంఘాల నాయకులు తెలిపారు.

  • భారత్​ బయోటెక్​ నాసల్​ వ్యాక్సిన్​ అత్యవసర వినియోగానికి డీసీజీఐ గ్రీన్​సిగ్నల్​

భారత్‌ బయోటెక్‌ అభివృద్ధి చేసిన చుక్కల మందు కొవిడ్​ టీకా (బీబీవి154/నాసల్‌ వ్యాక్సిన్‌) అత్యవసర వినియోగానికి డీసీజీఐ అనుమతులు ఇచ్చింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్​ మాండవీయ తెలిపారు.

  • ఎన్టీఆర్​ శ్రీకృష్ణుడి గెటప్​.. ఒకే ఫ్రేమ్​లో నలుగురు కమల్​ హాసన్స్​..

శ్రీకృష్ణుడు, శ్రీరాముడు అనగానే టక్కున గుర్తొచ్చొదే ఎన్టీ రామారావు రూపం. ఎందుకంటే అనేక పౌరాణిక పాత్రల్లో ప్రేక్షకులను అంతలా మంత్రముగ్ధులను చేశారాయన. అయితే తాజాగా ఆలీతో సరదాగా కార్యక్రమంలో పాల్గొన్న దిగ్గజ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు.. తొలిసారి ఎన్టీఆర్​ను శ్రీకృష్టుడి గెటప్​లో చూసినప్పుడు తాను ఎలా ఫీలయ్యారు? శ్రీకృష్డుడి గెటప్ వేసేందుకు ఎంతలా కష్టపడ్డారు? వంటి విషయాలను తెలిపారు.

  • మల్టీకలర్‌ స్వెటర్‌లో క్యూట్​గా కత్రిన.. ధర తెలిస్తే వామ్మో అనాల్సిందే

ఓ వైపు సినిమాలు చేస్తూనే సోషల్​మీడియాలో యూక్టివ్​గా ఉండే బాలీవుడ్​ భామ కత్రినా కైఫ్​.. ఇటీవలే షేర్​ చేసిన ఓ పోస్ట్ వైరల్​గా మారింది. ఆమె ధరించిన స్పెటర్​ నెటిజన్లను ఆకట్టుకుంటోంది. అలానే దాని ధర తెలిసి షాక్ అవుతున్నారు. ఎంతంటే.

ABOUT THE AUTHOR

...view details