తెలంగాణ

telangana

ETV Bharat / city

Telangana News Today: టాప్​న్యూస్ 5PM - టాప్​న్యూస్ 5PM

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

5PM TOPNEWS
5PM TOPNEWS

By

Published : Sep 6, 2022, 4:58 PM IST

  • భారత్​ బయోటెక్​ నాసల్​ వ్యాక్సిన్​ అత్యవసర వినియోగానికి డీసీజీఐ గ్రీన్​సిగ్నల్​

భారత్‌ బయోటెక్‌ అభివృద్ధి చేసిన చుక్కల మందు కొవిడ్​ టీకా (బీబీవి154/నాసల్‌ వ్యాక్సిన్‌) అత్యవసర వినియోగానికి డీసీజీఐ అనుమతులు ఇచ్చింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్​ మాండవీయ తెలిపారు.

  • భాగ్యనగరంలో దంచికొట్టిన వర్షం.. పెద్దఎత్తున స్తంభించిన ట్రాఫిక్

హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో వర్షం దంచికొట్టింది. నగరంలోని ఎల్బీనగర్, మన్సూరాబాద్‌, నాగోల్, వనస్థలిపురం, సికింద్రాబాద్​లో వర్షం కురిసింది. ఒక్కసారిగా వరుణుడు రావడంతో భారీగా ట్రాఫిక్​ జామ్ అయింది.

  • 'కొడుకు, కుమార్తెపై వస్తోన్న అవినీతి ఆరోపణలతో సీఎం కేసీఆర్‌ భయపడుతున్నారు'

తన కొడుకు, కుమార్తెపై వస్తోన్న అవినీతి ఆరోపణలతో ముఖ్యమంత్రి కేసీఆర్‌ భయపడుతున్నారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ అన్నారు. ఇబ్రహీంపట్నం కుటుంబ నియంత్రణ ఆపరేషన్ల ఘటనలో వైద్య, ఆరోగ్యశాఖ మంత్రిని బాధ్యుడిని చేయాలని డిమాండ్ చేశారు.

  • ప్రేమ వివాహంపై కులపెద్దల రాద్ధాంతానికి బలైపోయిన తల్లి, కుమారుడు

ఇద్దరూ ప్రాణానికి ప్రాణంగా ప్రేమించుకున్నారు. వారు ఒకే కులానికి చెందిన వారైనా పెద్దలు వారి పెళ్లికి ఒప్పుకోలేదు. తల్లిదండ్రులకు ఎదిరించి విహహం చేసుకున్నారు. కుటుంబ సభ్యులకు దూరంగా వేరే ఊరిలో నివాసం ఉంటున్నారు.

  • కరెంట్​ స్తంభాన్ని ఢీకొట్టిన కారు.. ఒకే కుటుంబంలో ఐదుగురు మృతి

ప్రమాదవశాత్తు కారు విద్యుత్​ స్తంభాన్ని ఢీకొనడం వల్ల ఒకే కుటుంబంలోని ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. తీవ్రంగా గాయాలపాలైన ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటన పంజాబ్​లోని లుధియానాలో జరిగింది.

  • భారత్​- బంగ్లా మధ్య కీలక ఒప్పందం.. కుషియారా నదీజలాల విషయంలో..

భారత్‌ బంగ్లాదేశ్‌ మధ్య పరస్పర విశ్వాసాన్ని, సంబంధాలను దెబ్బతీసే విధంగా పేట్రేగుతున్న ఉగ్రవాదులు, ఛాందసవాద శక్తులను సంయుక్తంగా ఎదుర్కోవాలని ఇరు దేశాలు నిర్ణయించాయి. భారత్‌లో పర్యటిస్తున్న బంగ్లా ప్రధాని షేక్‌ హసీనా.. ప్రధాని నరేంద్ర మోదీతో ప్రత్యేకంగా సమావేశమై ద్వైపాక్షిక చర్చలు జరిపారు.

  • మెటల్ ల్యాంప్​తో భార్యను హతమార్చిన భర్త.. అదే కారణమా?

భార్యపై అనుమానంతో ఓ వ్యక్తి దారుణానికి పాల్పడ్డాడు. మెటల్​ ల్యాంప్​తో భార్య తలను పగులగొట్టాడు. ఈ ఘటన కేరళ.. తిరువనంతపురంలోని వర్కాలా గ్రామంలో జరిగింది.

  • ట్రోలింగ్‌పై అర్ష్‌దీప్‌ రియాక్షన్​.. ఏమన్నాడంటే

ఆసియా కప్​లో భాగంగా పాకిస్థాన్​తో జరిగిన మ్యాచ్​లో కీలక క్యాచ్​ జారవిడిచాడు బౌరల్​ అర్ష్​దీప్​. దీంతో తీవ్రమైన ట్రోలింగ్​కు గురవుతున్నాడు. ఈ క్రమంలో తనపై వస్తోన్న కామెంట్లకు అర్ష్‌దీప్‌ ఎలా స్పందించాడో అతడి తల్లిదండ్రులు ఓ ఆంగ్లపత్రికకు వెల్లడించారు.

  • బ్లూలైట్.. మీ జీవితానికి రెడ్​లైన్

నేటి ప్రపంచం డిజిటల్​ రంగంలో పరుగులు తీస్తోంది. ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకోనే వరకు ఆ డిజిటల్ వస్తువులనే ఉపయోగిస్తున్నాము. నేటి అవి మన జీవితాల్లో ఒక భాగం అయిపోయాయి.

  • 'ప్రాజెక్ట్​ కె' అద్భుతం​.. అక్కడ ఎన్టీఆర్​ను అలా చూసి వారంతా షాక్​

ఎన్నో అద్భుతమైన, వైవిధ్య చిత్రాలను తెరకెక్కించి చిత్రపరిశ్రమలో గొప్ప పేరు ప్రఖ్యాతలు సొంతం చేసుకున్నారు ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు. తాజాగా ఆలీతో సరాదాగా కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. సీనియర్​ ఎన్టీఆర్​తో తనకున్న అనుబంధాన్ని తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details