తెలంగాణ

telangana

ETV Bharat / city

Telangana News Today : టాప్​న్యూస్​ @ 11AM - telangana news today

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

Telangana News Today
Telangana News Today

By

Published : Sep 6, 2022, 11:00 AM IST

  • దిల్లీ లిక్కర్ స్కామ్​పై ఈడీ నజర్

దిల్లీ ప్రభుత్వ ఆల్కహాల్ విధానంలో అవకతకవకల కేసులో ఈడీ దాడులు చేపట్టింది. దేశవ్యాప్తంగా 30 ప్రాంతాల్లో సోదాలు నిర్వహిస్తోంది. హైదరాబాద్​లో సైతం దాడులు చేపట్టినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.

  • భారీగా తగ్గిన కొవిడ్ కేసులు..

Corona Cases in India : దేశంలో కరోనా కేసులు స్వల్పంగా తగ్గాయి. ఆదివారం నుంచి సోమవారం ఉదయం 8 గంటల వరకు 4,417 మందికి కరోనా వైరస్‌ సోకినట్లు నిర్ధరణ అయింది. ఒక్కరోజులో 6,032 మంది కరోనా నుంచి కోలుకున్నారు.

  • బెంగళూరు టెకీలకు వరద కష్టాలు

కర్ణాటకను వరద కష్టాలు వీడటం లేదు. లోతట్టు ప్రాంతాలు జలమయం కావడం వల్ల బెంగళూరులో పనిచేస్తున్న ఐటీ ఉద్యోగులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ట్రాక్టర్లపై ప్రయాణిస్తూ ఆఫీసులకు వెళ్తున్నారు.

  • వర్ధన్నపేట బాలికల ఘటనపై బండి సంజయ్ స్పందన

Bandi Sanjay on wardhannapet food poison incident : వర్ధన్నపేట గిరిజన ఆశ్రమ పాఠశాలలో బాలికలు అస్వస్థతకు గురైన ఘటనపై భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ స్పందించారు. బాధిత విద్యార్థినులకు సరైన చికిత్స అందించాలని డిమాండ్ చేశారు. గురుకులాల్లో వరుసగా జరుగుతున్న ఇలాంటి ఘటనలు రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యానికి అద్దం పడుతున్నాయని విమర్శించారు.

  • ఎటూ తేలని కాళేశ్వర రుణం

Kaleshwaram Project loans : రాష్ట్రం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని నిర్మిస్తున్న కాళేశ్వరం ఎత్తిపోతల పథకం అదనపు టీఎంసీ పనులకు సంబంధించిన రుణంపై సందిగ్ధత కొనసాగుతూనే ఉంది. మొదట కుదుర్చుకొన్న ఒప్పందం ప్రకారం రుణం విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కోరుతుండగా ఆర్బీఐ, కేంద్ర విద్యుత్​ మంత్రిత్వశాఖ, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఒప్పందం జరగాలని ఆర్ఈసీ స్పష్టం చేసింది. దీంతో అప్పు వచ్చే అవకాశాలు తక్కువేనని కొందరు అభిప్రాయ పడుతున్నారు. ఇదే పరిస్థితి ఉంటే రాష్ట్ర ఖజానా నుంచే ప్రభుత్వం చెల్లించాల్సి వస్తుంది.

  • 'ఆలయాలకు కానుకలపై కౌంటరు సమర్పించండి'

Telangana High Court News : 2015లో ఆలయాలకు కానుకలు సమర్పిస్తూ జారీ అయిన ఉత్వర్వులను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై కౌంటర్​ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు కేసును నవంబర్​కు వాయిదా వేసింది. గతంలో ఆలయాలకు కానుకలు సమర్పిస్తూ జారీ అయిన ఉత్తర్వులను సవాలు చేస్తూ రచయిత కంచ ఐలయ్య, గుండముల రాములు ప్రజాప్రయోజన వాజ్యం దాఖలు చేశారు.

  • డైటింగ్‌ చేసేవారికి ప్రత్యేకంగా పాలు

Vijaya diet milk : మీరు డైటింగ్​ చేస్తున్నారా.. అయితే మీలాంటి వారి కోసమే విజయ డెయిరీ ప్రత్యేకంగా పాలు విక్రయిస్తోంది. డైటింగ్ చేసే వారి సంఖ్య పెరుగుతున్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు డెయిరీ తెలిపింది. అసలు ఆ పాల ధర లీటర్​ ఎంతంటే..?

  • శ్రీశైలం ప్రాజెక్టుపై తెలంగాణకు టీఏసీ నివేదిక

TAC Report on Srisailam project : శ్రీశైలం ప్రాజెక్టు రూల్‌కర్వ్స్‌ రూపకల్పనకు అనుసరించిన విధానాలను తెలియజేయాలంటూ తెలంగాణ పలుమార్లు కోరిన నేపథ్యంలో టీఏసీ నివేదికను కేంద్ర జలసంఘం రాష్ట్రానికి అందజేసింది. గతంలోనూ శ్రీశైలం ప్రాజెక్టు నుంచి కేటాయింపులు ఏ ఒప్పందాలు, ప్రమాణాల మేరకు నిర్వహిస్తున్నారో ఆధారాలు అందజేయాలని తెలంగాణ కోరింది. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి ఏపీకి, తెలంగాణకు పలు ఔట్‌లెట్ల ద్వారా కేటాయింపులు, జల విద్యుదుత్పత్తి కేంద్రాల నిర్వహణ వివరాలను ఇందులో పేర్కొన్నారు.

  • నాదల్​కు షాక్​.. ఆ కుర్రాడి చేతిలో ఘోర పరాజయం

యూఎస్​ ఓపెన్​లో స్పెయిన్ బుల్ రఫెల్ నాదల్​కు నిరాశ ఎదురైంది. అమెరికాకు చెందిన ఫ్రాన్సిస్ టోయాఫే చేతిలో ఘోరంగా ఓటమి పాలయ్యాడు.

  • విజయ్​ దళపతి వర్సెస్​ ఇండియా పాక్​ మ్యాచ్‌

తమిళ స్టార్ హీరో విజయ్​ వర్సెస్​ టీమ్​ఇండియా పాకిస్థాన్​ మ్యాచ్ ​అంటూ సోషల్​మీడియాలో బాగా ట్రెండ్​ అయింది. అసలు ఈ రెండింటికీ సంబంధం ఏమిటో తెలుసుకుందాం.

ABOUT THE AUTHOR

...view details