ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలుసీఎంలు కేసీఆర్, నితీష్ కుమార్ భేటీ.. బిహార్ పర్యటనలో ఉన్న సీఎం కేసీఆర్.. పట్నాలో ఆ రాష్ట్ర సీఎం నితీష్ కుమార్‌తో భేటీ అయ్యారు. భేటీలో ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్ కూడా పాల్గొన్నారు. దేశ రాజకీయాలు, పరిస్థితులపై సమావేశంలో చర్చిస్తున్నారు. అమర జవాన్ల త్యాగం వెలకట్టలేనిది..గాల్వాన్ ఘటనలో అమరవీరుల త్యాగం వెలకట్టలేనదని సీఎం కేసీఆర్ కొనియాడారు. జవాన్ల కుటుంబాలతో పాటు సికింద్రాబాద్ బోయిగూడ ప్రమాద ఘటనలో మరణించిన కుటుంబాలకు ఆర్థిక సాయం అందించారు. తెలంగాణ అభివృద్ధిలో భాగస్వాములైన వారికి అండగా నిలుస్తామని పునరుద్ఘాటించారు.ఇబ్రహీంపట్నం ఘటన దురదృష్టకరం.. నిమ్స్‌లో చికిత్స పొందుతున్న ఇబ్రహీంపట్నం ఘటన బాధితుల్ని మంత్రి హరీశ్‌రావు పరామర్శించారు. బాధితులకు భరోసానిచ్చారు. ప్రస్తుతం ఆస్పత్రుల్లో ఉన్న మహిళలకు ఇన్‌ఫెక్షన్ తగ్గిందని రెండు మూడు రోజుల్లో డిశార్చ్ చేస్తామని హరీశ్‌రావు స్పష్టంచేశారు.సీఎం కేసీఆర్‌కు పేదల బాధలు పట్టవుకుటుంబ నియంత్రణ చికిత్సతో నలుగురి ప్రాణాలు పోయిన ఇబ్రహీంపట్నం ఘటనకు బాధ్యుడిని చేస్తూ... వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు వెంటనే బర్తరఫ్ చేయాలని... భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ డిమాండ్ చేశారు.వాళ్లందరూ సేఫ్.. Ibrahimpatnam Incident News: రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్సల ఘటనలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మహిళలకు ప్రాణాపాయం లేదని వైద్యులు తెలిపారు. ప్రస్తుతం నిమ్స్‌లో 19 మంది, అపోలో ఆసుపత్రిలో 11 మందికి చికిత్స అందిస్తున్నారు.పర్యాటకులను ఆకర్షించేలా టూరిజం ప్రమోషన్..రాష్ట్రంలో ఎన్నో ప్రపంచ స్థాయి పర్యాటక కేంద్రాలున్నాయని పర్యాటకశాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ తెలిపారు. త్వరలోనే వాటిని అభివృద్ధి చేసి పర్యాటకులకు అందుబాటులోకి తెస్తామని మంత్రి పేర్కొన్నారు.'గణేశ్' మ్యూజియంలా ఇల్లు.. సాధారణంగా విఘ్నేశ్వరుడు అంటే అందరికీ భక్తి, ఇష్టం ఉంటుంది. కర్ణాటకలో ఓ వ్యక్తి మాత్రం అంతకుమించి అంటున్నారు. అందుకే తన ఇంటినే గణపతి మ్యూజియంగా మార్చారు. బళ్లారిలోని ఆదర్శ్ నగర్‌కు చెందిన అశోక్ బచావత్ 21 ఏళ్లుగా గణేశ్ విగ్రహాలు సేకరించే పనిలో ఉన్నారు.మనసు దోచేసిన వార్నర్..దేశవ్యాప్తంగా వినాయక చవితి శోభ సంతరించుకుంది. ఎంతో భక్తి శ్రద్ధలతో గణేష్ విగ్రహాలను ఏర్పాట చేసుకుని పూజాపురస్కారాలు చేస్తున్నారు. మన క్రికెటర్లు కూడా సోషల్‌మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అయితే ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ వార్నర్ పెట్టిన పోస్ట్ మాత్రం వైరల్‌గా మారింది.డిఫరెంట్ గెటప్స్ల్లో గణేశులు.. వినాయక చవితి వచ్చిందంటే కళాకారుల్లో కొత్త ఉత్సాహం కనిపిస్తుంది. వినాయక చతుర్థి సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో వినాయకుడి విగ్రహాలను కళాకారులు వినూత్నంగా తీర్చిదిద్దారు. పలు రకాల వస్తువులను, ధాన్యాలను వినియోగించి భిన్నమైన గణనాథులను కొలువుదీర్చారు. ఎక్కడెక్కడ ఎలా ఉన్నాయంటే..?ఉత్తమ నటులుగా రణ్వీర్, కృతిముంబయిలో అంగరంగ వైభవంగా జరిగింది ఫిల్మ్ ఫేర్ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం. 2022 సంవత్సరానికి గాను ఉత్తమ నటుడిగా రణ్వీర్ సింగ్, ఉత్తమ నటిగా కృతి సనన్ అవార్డులను స్వీకరించారు. ఇంకా ఎవరెవరంటేకమల్హాసన్ మూవీకి నో చెప్పిన ప్రొడ్యూసర్స్.. కథ నచ్చినా.. దిగ్గజ నటుడు కమల్‌హాసన్ నటించిన ఓ సినిమాను నిర్మించడానికి మొదట ఏ నిర్మాత ముందుకు రాలేదు. కథ నచ్చినా కుదరదని పరోక్షంగా చేతులెత్తేశారు. ఎందుకంటే