- పూజకు కొలువుదీరిన ఖైరతాబాద్ గణేశ్
Khairtabad Ganesh 2022 : హైదరాబాద్‌లోని ఖైరతాబాద్ గణేశ్ ఉత్సవాలకు సర్వం సిద్ధమైంది. శ్రీ పంచముఖ లక్ష్మి మహా గణపతి రూపంలో గణనాథుడు భక్తులకి దర్శనం ఇస్తున్నాడు. మొట్టమొదటి సారిగా మట్టి వినాయకుడిని ఆకర్షణీయంగా రూపొందించారు. స్వామిని దర్శించుకునేందుకు రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు తరలివస్తోన్న నేపథ్యంలో ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
- ఘనంగా గణేశ్ చతుర్థి.. గాజుసీసాలో చిన్ని గణపతి
విభిన్నమైన రూపాల్లో కనిపిస్తూ సందడి చేసే గణనాథులు.. పచ్చతోరణాలు, రంగు రంగుల విద్యుత్ దీపాలతో తళుక్కుమనే వినాయక మండపాలు.. సాయంత్రం వేళ అక్కడ జరిగే వేడుకలు.. వినాయక చవితి పండగ పేరెత్తగానే గుర్తొచ్చే జ్ఞాపకాలెన్నో. అవన్నీ నిజాలై సాక్ష్యాత్కరించే పండుగ రోజులు వచ్చేశాయి. దేశవ్యాప్తంగా ఘనంగా వినాయక చవితి వేడుకలు మొదలయ్యాయి.
- పుష్ప, ఆర్ఆర్ఆర్ మేనియా.. గణపయ్య ఇక తగ్గేదే లే
Pushpa RRR Ganesh idols దేశవ్యాప్తంగా వినాయక చవితి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఊరూరా గణనాథులు కొలువుదీరుతున్నారు. సాధరణంగా ఈ పండగ అంటేనే వివిధ రకాల ఆకృతుల్లో గణేష్ ప్రతిమలు మార్కెట్లో దర్శనమిస్తుంటాయి. అందులో కొన్ని సినిమాల్లోని హీరోల పాత్రల పోలీకలతోనూ ఉంటాయి. ఇప్పటికే గతంలో గబ్బర్‌సింగ్, బాహుబలి, స్పైడర్‌మ్యాన్, అవెంజర్స్ వంటి గణేష్ ప్రతిమలు మార్కెట్లో కనువిందు చేయగా... తాజాగా అల్లు అర్జున్ బ్లాక్ బస్టర్ మూవీ ‘'పుష్ప', ఆర్ఆర్ఆర్ రామ్‌చరణ్ అల్లూరి సీతారామారాజు లుక్‌లో ఉన్న గణనాథులు మార్కెట్లోకి వచ్చేశారు.
- దేశంలో భారీగా పెరిగిన కరోనా కేసులు
Corona Cases in India : భారత్‌లో కొత్తగా 7,231 కరోనా కేసులు నమోదయ్యాయి. వైరస్ ధాటికి 45 మంది బలయ్యారు. ఒక్కరోజులో 10,828 మంది కరోనా నుంచి కోలుకున్నారు.
- పండుగ పూట విషాదం.. విద్యుదాఘాతంతో తల్లి, కుమార్తె మృతి
Mother and Daughter died in Mancherial : పండుగ పూట ఓ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. విద్యుదాఘాతంతో తల్లి, కుమార్తె మృతి చెందగా.. తండ్రి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటన మంచిర్యాల జిల్లాలో చోటుచేసుకుంది.
- విద్యుత్తు బకాయిలపై మీ ఉత్తర్వులు సరికాదు