తెలంగాణ

telangana

ETV Bharat / city

Telangana Top news 5పీఎం టాప్​న్యూస్ - Top news in Telugu

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

Top news
Top news

By

Published : Aug 29, 2022, 4:58 PM IST

  • పెద్దపల్లి కలెక్టరేట్‌ భవన సముదాయాన్ని ప్రారంభించిన సీఎం కేసీఆర్‌

పెద్దపల్లి సమీకృత కలెక్టరేట్‌ భవన సముదాయం ప్రారంభమైంది. కలెక్టరేట్‌ భవన సముదాయాన్ని సీఎం కేసీఆర్‌ ప్రారంభించారు.

  • విజయ డైరీ రైతులకు గుడ్‌న్యూస్‌, ఏంటంటే

విజయ డైరీ పాల సేకరణ ధర పెంచుతూ ప్రభుత్వ నిర్ణయం తీసుకుంది. రాజేంద్రనగర్‌లో పాడి రైతుల అవగాహన సదస్సులో పాల్గొన్న మంత్రి తలసాని శ్రీనివాస్... విజయ డైరీ రైతులకు శుభవార్త తెలిపారు. పాల సేకరణ పాల ధర పెంచుతున్నట్లు మంత్రి ప్రకటించారు.

  • వేములవాడలో ఉద్రిక్తత, మధ్య మానేరు నిర్వాసితుల మహాధర్నా

రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడలో ఉద్రిక్తత నెలకొంది. మధ్య మానేరు నిర్వాసితులు ఆందోళనకు దిగారు. ఈ క్రమంలో పోలీసులు, నిర్వాసితులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. కాసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

  • శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న వరద ఉద్ధృతి, దిగువకు నీటి విడుదల

శ్రీశైలం జలాశయానికి వరద ఉద్ధృతి కొనసాగుతోంది. అధికారులు గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదలుతున్నారు. శ్రీశైలం జలాశయం పూర్తి నీటిమట్టం 885 అడుగులు ఉండగా, ప్రస్తుత నీటిమట్టం 884.90 అడుగులుగా ఉంది.

  • ఛీ, పాడు పనికి పోలీస్ స్టేషన్​నే వాడుకున్నాడా ఏఎస్సై

ఎవరికి దొరక్కుండా ఉండేందుకు, పోలీస్ స్టేషన్​ను మించిన సేఫ్ ప్లేస్ ఏముంటుందిలే అని అనుకున్నాడేమో ఆ ఏఎస్సై. కాని రెడ్ హ్యాండ్ గా దొరికిపోయాడు. కారణం తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవండి..

  • వరదల్లో కొట్టుకుపోయిన మూడు మృతదేహాలు

ఉత్తరాఖండ్ హల్ద్వాని జిల్లాలో అనూహ్య ఘటన జరిగింది. జిల్లాలోని రాణిబాగ్​ చిత్రశాల ఘాట్​లో అంత్యక్రియలు నిర్వహిస్తుండగా వరదల ధాటికి మూడు మృతదేహాలు గౌలా నదిలో కొట్టుకుపోయాయి. మంటల్లో కాలిపోతూనే నీటిలో ఓ మృతదేహం కొట్టుకుపోయింది.

  • కాంగ్రెస్​కు డాక్టర్​ బదులు కాంపౌండర్ల వైద్యం

తాను బలవంతంగా కాంగ్రెస్​ పార్టీని వీడాల్సి వచ్చిందని గులాం నబీ ఆజాద్​ అన్నారు. సోనియా గాంధీకి లేఖ రాసినప్పటి నుంచి తనను టార్గెట్​ చేశారని, రాజీనామాకు మోదీని సాకు చూపుతున్నారన్నారు. పార్టీ పునాదులు చాలా బలహీనపడ్డాయని, ఏ క్షణమైనా వ్యవస్థ మొత్తం శిథిలం కావచ్చని జోస్యం చెప్పారు.

  • స్టాక్​ మార్కెట్లకు భారీ నష్టాలు, సెన్సెక్స్ 860 డౌన్

సోమవారం సెషన్​లో స్టాక్​ మార్కెట్లు నష్టపోయాయి. సెన్సెక్స్​ 861.25 పాయింట్లు నష్టపోయి 57,972.62 వద్ద ముగిసింది. నిఫ్టీ 246 నష్టపోయి 17,312.90 పాయింట్లకు చేరింది. మరోవైపు రూపాయి విలువ భారీగా పతనమైంది.

  • అన్న హరికృష్ణను గుర్తు చేసుకుంటూ బాలకృష్ణ ఎమోషనల్‌ పోస్ట్

నందమూరి హరికృష్ణ వర్థంతి సందర్భంగా ఆయన్ను గుర్తుచేసుకుంటూ బాలకృష్ణ ఎమోషనల్​ పోస్ట్​ పెట్టారు. దీంతో పాటే సీనియర్​ ఎన్టీఆర్‌ రాజకీయ ప్రచారంలో చైతన్య రథ సారధిగా ఉన్నప్పటి హరికృష్ణ ఫోటోలను షేర్‌ చేశారు.

  • గుర్తుపట్టలేనంతగా మారిపోయిన స్టార్ హీరో, ఏమైంది

వరుస యాక్షన్‌ కథా చిత్రాల్లో నటిస్తూ ప్రేక్షకుల్ని అలరించే కోలీవుడ్‌ స్టార్​ హీరో విశాల్‌. ఆయన హీరోగా తెరకెక్కుతోన్న తాజా చిత్రం 'మార్క్‌ ఆంటోనీ'. పాన్‌ ఇండియా మూవీగా సిద్ధమవుతోన్న ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ సోమవారం విడుదలైంది.

ABOUT THE AUTHOR

...view details