తెలంగాణ

telangana

ETV Bharat / city

Telangana News Today టాప్​న్యూస్ 1PM

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

Telangana News Today
Telangana News Today

By

Published : Aug 29, 2022, 12:59 PM IST

  • ఆత్మ విశ్వాసాన్ని పెంచే అమ్మ భాష తెలుగు : వెంకయ్య

Venkaiah Naidu on Telugu language తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు తెలుగు ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. లండన్ పర్యటనలో ఉన్న ఆయన ప్రపంచంలో ఎక్కడ ఉన్నా మన భాషా సంస్కృతులే మన నిజమైన చిరునామా అంటూ ట్విటర్ వేదికగా పేర్కొన్నారు.

  • మూడేళ్ల కుమారుడిని చంపిన తల్లి, కారణమేంటంటే..?

Woman Killed her Son in Hyderabad : హైదరాబాద్​లోని పేట్​బషీరాబాద్​ పరిధి పార్సీగుట్టలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని మూడేళ్ల కుమారుడిని తల్లి చంపేసింది. అనంతరం బాలుడు కిందపడి చనిపోయాడని పోలీసులకు సమాచారం అందించింది. నెల క్రితం జరిగిన ఈ ఘటనపై అనుమానం వచ్చిన పోలీసులు లోతుగా దర్యాప్తు చేయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.

  • కు.ని ఆపరేషన్ వికటించి ఇద్దరు మృతి

రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ప్రభుత్వాసుపత్రిలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్‌ చేయించుకున్న మహిళల్లో ఇద్దరు మహిళలు మృతి చెందారు. మరో మహిళ పరిస్థితి విషమంగా ఉండటంతో హైదరాబాద్‌లో చికిత్స అందిస్తున్నారు. ఇబ్రహీంపట్నం ప్రభుత్వ సివిల్‌ ఆసుపత్రిలో 27 మంది మహిళలకు ఈ నెల 25న కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేశారు. వీరిలో ముగ్గురు మహిళలు అస్వస్థతకు గురి కాగా.. వారిలో ఇద్దరు ప్రాణాలు కోల్పోవటం ఆందోళనకు గురి చేసింది.

  • కారులో విగతజీవిగా ప్రముఖ సింగర్, ఏం జరిగింది

ప్రముఖ సింగర్​ వైశాలి బల్సారా ఓ కారులో విగతజీవిగా కనిపించారు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇది హత్యా లేక ఆత్మహత్యా అనే కోణాల్లో విచారణ జరుపుతున్నారు. మరోవైపు దిల్లీలోని యుమునా నదిలో కృష్ణుడి విగ్రహం నిమజ్జనం చేసేందుకు వెళ్లి ఐదుగురు యువకులు మునిగి చనిపోయారు.

  • ఆమెకు ఆరుగురు పిల్లలు, తనకన్నా చిన్నవాడితో ప్రేమ, పెళ్లికి నో చెప్పాడని హత్య

ఓ వ్యక్తి తన ముగ్గురు పిల్లలు, భార్యతో పాటు కన్నతల్లిని కిరాతకంగా హత్య చేశాడు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు నిందితుడ్ని అరెస్ట్​ చేశారు. ఉత్తరాఖండ్​లోని డోయ్​వాలాలో జరిగిందీ ఘటన. మరోవైపు, మహారాష్టలోని పెళ్లి నిరాకరించడానికి ఆటోడ్రైవర్​ను ఓ మహిళ తన చున్నీతో గొంతు నులిపి చంపేసింది.

  • అంతర్జాతీయ ఆరోగ్య టీకాలకు పెరిగిన డిమాండ్​

International Health Vaccines విదేశాలకు వెళ్లే ప్రతి ఒక్కరు తప్పనిసరిగా టీకాలు వేసుకోవాలి. కరోనా తరవాత ఈ అంతర్జాతీయ ఆరోగ్య టీకాలు వేసుకునే వారు రోజురోజుకీ పెరుగుతూ వస్తున్నారు. వీటిలో ఆఫ్రికా దేశానికి వెళ్లే వారు తీసుకొనే ఎల్లో ఫీవర్​ టీకాకు డిమాండ్​ భారీగా పెరిగింది. వివిధ దేశాలకు వెళ్లేవారు ఏ టీకాలు తీసుకుంటారో చూద్దాం.

  • అమ్రాబాద్‌ అభయారణ్యం నుంచి నాలుగు గ్రామాల తరలింపు

Amrabad tiger reserve అమ్రాబాద్‌ అభయారణ్యం నుంచి పలు గ్రామాల తరలింపు కసరత్తు ప్రక్రియ కీలక దశకు చేరింది. తొలిదశలో కొల్లంపెంట, కుడిచింతలబైలు, ఫర్హాబాద్‌, తాళ్లపల్లి వాసులను తరలించాలని అటవీశాఖ ప్రాథమికంగా నిర్ణయించింది. వీరిని ఇతర ప్రాంతాలకు తరలించడం వల్ల సమాజంపై ఎలాంటి ప్రభావం పడుతుంది, ఎంతమంది తరలివెళ్లడానికి ఆసక్తి చూపిస్తున్నారు, వ్యతిరేకించేవారు ఎందరు, పునరావాసం ఎక్కడ, ఎలా కోరుకుంటున్నారు వంటి అంశాలు ఇందులో తెలిసే అవకాశం ఉంది.

  • ఆయనకు గిఫ్ట్​గా లగ్జరీ విల్లా​ కొన్న అంబానీ

భారత అపర కుబేరుడు ముకేశ్​ అంబానీ దుబాయ్​లోని సముద్ర తీరంలో ఓ విల్లాను కొనుగోలు చేసినట్లు తెలిసింది. రూ.640 కోట్లతో తన చిన్న కొడుకు అనంత్​ కోసం ఆ విల్లాను ముకేశ్​ కొనుగోలు చేసినట్లు, అందులో 10 పడకగదులు, ప్రైవేట్‌ స్పా, ఇండోర్‌, అవుట్‌డోర్‌ స్విమ్మింగ్‌ పూల్స్‌ ఉన్నాయని బ్లూమ్‌బర్గ్‌ వెల్లడించింది.

  • పాకిస్థాన్​తో మ్యాచ్​, రోహిత్​ శర్మ, భువనేశ్వర్​ సూపర్ రికార్డ్స్​

Asia cup 2022 Rohith sharma record ఆసియా కప్​ 2022లో భాగంగా పాకిస్థాన్​తో జరిగిన మ్యాచ్​లో టీమ్​ఇండియా కెప్టెన్​ రోహిత్​ శర్మ, పేసర్​ భువనేశ్వర్​ కుమార్​ అరుదైన రికార్డులును సాధించారు. అవేంటంటే

  • ఉప్పొంగిన అభిమానం, ఇంటి ముందు స్టార్​ హీరో విగ్రహం

ఓ స్టార్​ హీరోకు అరుదైన గౌరవం లభించింది. అమెరికాలోని ఓ ఇండోఅమెరికన్​ ఫ్యామిలీ ఆయనపై తమకున్న అభిమానాన్ని చాటుకుంది. తమ ఇంటి ముందు భారీ సైజులో ఆ కథానాయకుడి విగ్రహాన్ని ఏర్పాటు చేసి ఓ పండగలా సంబరాలు చేసుకుంది.

ABOUT THE AUTHOR

...view details