ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలుమరికాసేపట్లో కానిస్టేబుల్ రాత పరీక్ష Constable Exam in Telangana రాష్ట్రవ్యాప్తంగా 1,601 కేంద్రాల్లో కాసేపట్లో కానిస్టేబుల్ రాత పరీక్ష జరగనుంది. ఇందుకోసం తెలంగాణ రాష్ట్రస్థాయి పోలీస్ నియామక మండలి పకడ్బందీ ఏర్పాట్లు చేసింది. అభ్యుర్థులు హాల్‌టికెట్‌పై ఫొటో అతికిస్తేనే అనుమతి ఉంటుందని అధికారులు తెలిపారు. నిమిషం ఆలస్యం నిబంధనలు అమలులో ఉంటుందని, రాత పరీక్షకు వచ్చేవారు ఈ విషయాన్ని గమనించాలని అధికారులు సూచించారు.ఆరుపదులు దాటినా తగ్గేదేలేHyderabad Marathon 2022 నేటి యువతకు వ్యాయామం అంటే పరిచయం లేని పేరు. మీరు ఉదయం వ్యాయామం చేస్తున్నారా అని ఎవరైనా అడిగితే అదేలా ఉంటుంది అనే సమాధానం టక్కున వచ్చేస్తుంది. అంతలా శ్రద్ద ఉంది మన ప్రస్తుత యువతకు ఆరోగ్యంపైనా. కానీ మలివయసు వచ్చిందంటే చాలు శరీరానికి ఆహారం బదులు మందులు తినాల్సిందే. అలాంటిదీ ఆరుపదుల వయసు వచ్చిందంటే మనపని ఖేల్ ఖతం, దుకాణ్ బంద్ అన్నట్లు ఉంటుంది. కానీ అరవై ఏళ్లు వచ్చినా అదే చురుకుదనం చూపిస్తున్నారు. పరుగుపెందెంలో మేము సైతం అంటూ అదరగొడుతున్నారు. వారిపై ఓ లుక్కేద్దాం పదండి.వీఆర్‌ఏల క్రమబద్ధీకరణకు రంగం సిద్ధం VRAs regularize in telangana వీఆర్‌ఏల క్రమబద్దీకరణకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. వారందరినీ ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించేందుకు ముందడుగు వేసింది. ప్టెంబరు మొదటి వారంలో క్రమబద్ధీకరణ పూర్తిచేయాలని ప్రభుత్వ లక్ష్యంగా పెట్టుకుంది. దీనికి సంబంధించిన దస్త్రం ఇప్పటికే సీఎం కార్యాలయానికి చేరుకుంది.డిస్కంలకు ఊరటGovernment on discoms debts విద్యుత్ కొనుగోళ్లలో ఇబ్బందులు తలెత్తకుండా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. రాష్ట్రంలో రెండు విద్యుత్ పంపిణీ సంస్థలకు బకాయిలు తీర్చేందుకు రూ.10 వేల కోట్ల రుణాలకు పూచీకత్తు ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇటీవల కేంద్రం బకాయిలు చెల్లించని రాష్ట్రాలకు విద్యుత్ అమ్మకాలు జరపవద్దని డిస్కంలను ఆదేశించింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం దిద్దుబాటు చర్యలకు దిగింది.అందరి కళ్లూ నోయిడా జంట భవనాలపైనే నోయిడాలో అక్రమంగా నిర్మితమైన వంద మీటర్ల పొడవైన జంట టవర్ల కూల్చివేతకు తుది ఏర్పాట్లు పూర్తయ్యాయి. అయితే దీనిపై స్థానికులు రకారకాలుగా స్పందిస్తున్నారు. నిర్మాణంలో అక్రమాలు జరిగితే పడగొట్టకుండా ప్రత్యామ్నాయ మార్గం ఏదైనా ఆలోచించి ఉంటే బాగుండేదని కొందరు అభిప్రాయపడుతున్నారు. కారణాలు ఏవైనా ఇంత పెద్ద భవనాలు పడగొడుతుంటే బాధగా ఉందని మరికొందరు అంటున్నారు.డ్రగ్స్ విక్రయిస్తూ దొరికిపోయిన కొరియోగ్రాఫర్Choreographer arrest హైదరాబాద్ నగరంలో నిషేధిత డ్రగ్స్ మాత్రలతో అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ పట్టుబడ్డాడు. ఈ ఘటన మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. నిందితునిపై పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు.విదేశాలకు వెళ్లేవారికి ఆ ఇబ్బందులు లేనట్లే Passport services విదేశాలకు వెళ్లే వారు పాస్‌పోర్టు విషయంలో ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. పాస్‌పోర్టు సేవలను సులభతరం చేయడానికి శనివారం సైతం పాస్‌పోర్టు సేవాకేంద్రాలు పని చేసే విధంగా చర్యలు తీసుకున్నారు.ఫ్రెషర్స్‌కే ఎక్కువ ఉద్యోగ అవకాశాలుదేశంలో 59 శాతానికి పైగా సంస్థలు తాజా ఉత్తీర్ణులను నియమించుకునేందుకే ఆసక్తి చూపిస్తున్నాయని ఓ నివేదిక వెల్లడించింది. ఏడాది వ్యవధిలో చూస్తే ఇది 42% వృద్ధి చెందిందని వివరించింది. ప్రారంభ స్థాయి ఉద్యోగాలు, ఫ్రెషర్ల నియామకాలు దేశీయంగా మెరుగవుతున్నాయని పేర్కొంది.అందరి దృష్టి పరుగుల వీరుడు కోహ్లీ పైనే చరిత్రను అనుసరించేవారు కొందరు. చరిత్ర సృష్టించేవారు ఇంకొందరు. రెండో జాబితాకు చెందిన అరుదైన ఆటగాడే విరాట్ కోహ్లీ. అతడి ప్రయాణం కొంత కాలంగా ఒడుదొడుకులకు గురవుతోంది. పరుగుల లేమితో సతమతం అవుతున్న విరాట్.. శతకం కోసం సుదీర్ఘ కాలంగా నిరీక్షిస్తున్నాడు. ఆసియా కప్‌లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో కీలక పోరు ముంగిట తన నుంచి తనే స్ఫూర్తి పొందితే పాత కోహ్లీని చూడడం కష్టమేమీ కాబోదు.కథలు సిద్ధమే కానీ పట్టాలెక్కేది ఎప్పుడోకథానాయికల కోసం బలమైన వ్యక్తిత్వంతో కూడిన పాత్రల్ని సిద్ధం చేయడం, వాళ్ల చుట్టూనే తిరిగే కథల్ని రాయడం మొదలైంది. అప్పుడప్పుడూ అగ్ర హీరోలూ వాళ్ల కథల్లో భాగం అవుతున్నారు. కొన్నేళ్లుగా చిత్రసీమలో క్రమం తప్పకుండా నాయికా ప్రధానమైన సినిమాలు రూపొందుతూనే ఉన్నాయి. ఇప్పుడూ కొన్ని చిత్రీకరణ దశలో ఉండగా మరికొన్ని కథలు వాళ్ల కోసమై వేచి చూస్తున్నట్టు స్పష్టమవుతోంది.