తెలంగాణ

telangana

ETV Bharat / city

Telangana News Today టాప్​న్యూస్​ 7AM - తెలంగాణ వార్తలు

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

TOP NEWS IN TELANGANA TODAY
TOP NEWS IN TELANGANA TODAY

By

Published : Aug 28, 2022, 6:59 AM IST

  • కేసీఆర్‌ ప్రభుత్వాన్ని ఇంటికి సాగనంపడమే లక్ష్యం

JP Nadda Fire on CM KCR కేసీఆర్‌ ప్రభుత్వాన్ని ఇంటికి సాగనంపడమే ప్రజా సంగ్రామయాత్ర లక్ష్యమని భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అన్నారు. తెలంగాణలో కేసీఆర్‌ ఒక నయానిజాం వలే వ్యవహరిస్తున్నారని తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. బండి సంజయ్‌ పాదయాత్ర ముగింపు సందర్భంగా హనుమకొండలో జరుగుతున్న భాజపా భారీ బహిరంగ సభలో తెరాస ప్రభుత్వంపై మండిపడ్డారు.

  • సెప్టెంబర్ 12నుంచి నాలుగో ప్రజాసంగ్రామ యాత్ర

Bandi Sanjay fire ON CM KCR కేసీఆర్‌ గడీలు బద్దలు కొట్టే రోజు దగ్గర్లోనే ఉందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. భాజపా మత విద్వేషాలు రెచ్చగొడుతోందని దుష్ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. హనుమకొండలో మూడో విడత ప్రజాసంగ్రామ యాత్ర ముగింపు సందర్భంగా నిర్వహించిన బహిరంగసభలో కేసీఆర్‌పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

  • ఆ శాఖలో 181 పోస్టులకు నోటిఫికేషన్..

tspsc notification: రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ మరో ఉద్యోగ ప్రకటన జారీ చేసింది. మహిళ, శిశు సంక్షేమ శాఖలో 181 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చింది. మహిళ, శిశు సంక్షేమ శాఖలో గ్రేడ్ వన్ సూపర్​వైజర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. సెప్టెంబరు 8 నుంచి 29 వరకు ఆన్​లైన్​లో దరఖాస్తులను స్వీకరించనున్నట్లు టీఎస్​పీఎస్సీ కార్యదర్శి తెలిపారు. నోటిఫికేషన్​కు సంబంధించిన పూర్తి వివరాలు www.tspsc.gov.in లో అందుబాటులో ఉంటాయని స్పష్టం చేశారు.

  • ఆత్మనిర్భర్ భారత్​కు ప్రేరణగా ఖాదీ

ఖాదీ దారం స్వాతంత్ర్య సంగ్రామానికి స్ఫూర్తిగా నిలిచిందన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. స్వాతంత్ర్యం తర్వాత నిర్లక్ష్యానికి గురైన ఖాదీ ఇప్పుడు ఆత్మనిర్భర్ భారత్‌కు ప్రేరణగా నిలుస్తోందని చెప్పారు. మహిళలతో కలిసి చరఖా తిప్పారు. తన చిన్ననాటి రోజులు గుర్తుకు వచ్చాయని పేర్కొన్నారు.

  • ఆశా కార్యకర్తపై గ్యాంగ్ రేప్..

ఆశా కార్యకర్తను నలుగురు యువకులు అపహరించి దారుణంగా హింసించారు. అనంతరం రేప్ చేశారు. ఈ ఘటన ఒడిశాలోని జగత్​సింగ్​పుర్​ జిల్లా పారాదీప్​​ నగరంలో జరిగింది.

  • ఇంజినీర్​ ఇంట్లో గుట్టలుగా నోట్ల కట్టలు..

బిహార్​కు చెందిన ఇంజనీర్​ సంజయ్ కుమార్​ రాయ్​​ ఇంటిపై విజిలెన్స్ అధికారులు చేసిన దాడుల్లో భారీగా నగదు లభ్యమైంది. ఇప్పటివరకు రూ.5 కోట్లకుపైగా నగదు స్వాధీనం చేసుకున్నారు. దాడులు ఇంకా కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు.

  • నిద్రిస్తున్న మహిళపై పడగ విప్పిన నాగుపాము

ఓ మహిళపై పాము పడగవిప్పి కూర్చుంది. కొద్దిసేపు అలాగే ఆమె శరీరంపైనే ఉండిపోయింది. స్థానికులు ఈ దృశ్యాలను సెల్​ ఫోన్లలో బంధించారు. ఆ తర్వాత ఏమైందంటే

  • న్యూస్​ పేపర్లలో దేశ రహస్య పత్రాలు

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. తన ఇంట్లోని మ్యాగజైన్లు వార్తా పత్రికల మధ్య రహస్య పత్రాలను దాచిపెట్టుకున్నారని ఎఫ్​బీఐ తెలిపింది. జనవరిలో ఎఫ్‌బీఐ అధికారులు ట్రంప్ ఎస్టేట్‌లో సోదాలు చేపట్టగా 15 బాక్సుల్లో పత్రాలు లభించాయి. వీటికి సంబంధించిన అఫిడవిట్‌ను ఎఫ్‌బీఐ తాజాగా బయటపెట్టింది.

  • ఏకపక్షంగా ఆసియా కప్ తొలి మ్యాచ్..

ఆసియా కప్ తొలి మ్యాచ్ ఏకపక్షంగా సాగింది. ఐదుసార్లు ఆసియా కప్‌ ఛాంపియన్‌ అయిన శ్రీలంకకు ప్రారంభ మ్యాచ్‌లో ఆఫ్గానిస్థాన్‌ షాకిచ్చింది. శ్రీలంకపై అన్ని రంగాల్లో ఆదిపత్యం చెలాయించింది. తొలుత బౌలింగ్​లో లంకను 105కే కట్టడి చేసిన అఫ్గాన్.. అనంతరం ఛేదనలో రికార్డు వేగంతో పని పూర్తి చేసింది.

  • సినిమాలు పట్టాలెక్కేది ఎప్పుడో..

కథానాయికల కోసం బలమైన వ్యక్తిత్వంతో కూడిన పాత్రల్ని సిద్ధం చేయడం, వాళ్ల చుట్టూనే తిరిగే కథల్ని రాయడం మొదలైంది. అప్పుడప్పుడూ అగ్ర హీరోలూ వాళ్ల కథల్లో భాగం అవుతున్నారు. కొన్నేళ్లుగా చిత్రసీమలో క్రమం తప్పకుండా నాయికా ప్రధానమైన సినిమాలు రూపొందుతూనే ఉన్నాయి. ఇప్పుడూ కొన్ని చిత్రీకరణ దశలో ఉండగా మరికొన్ని కథలు వాళ్ల కోసమై వేచి చూస్తున్నట్టు స్పష్టమవుతోంది.

ABOUT THE AUTHOR

...view details