ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలునేటి నుంచి ఇంజినీరింగ్ కౌన్సెలింగ్.. TS EAMCET Counseling రాష్ట్రంలో ఇంజినీరింగ్ కౌన్సెలింగ్ ప్రక్రియ నేటి నుంచి ప్రారంభం కానుంది. ఈ ఏడాది మూడు విడతల్లో సీట్లు భర్తీ చేయనున్నారు. ఇవాళ్టి నుంచి ఈ నెల 29 వరకు ఆన్‌లైన్ కౌన్సెలింగ్ రుసుము చెల్లించి ధ్రువపత్రాల పరిశీలన కోసం స్లాట్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. 23 నుంచి 30 వరకు ధ్రువపత్రాల పరిశీలనకు హాజరు కావాలి.రాష్ట్రవ్యాప్తంగా సామూహిక హరితహారం..Haritha haram స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా ఇవాళ రాష్ట్రవ్యాప్తంగా సామూహిక హరితహారం జరగనుంది. ప్రజాప్రతినిధులు, అధికారులు, ఉద్యోగులు సహా సకల జనులు భాగస్వామ్యం కానున్నారు. ఎనిమిదో విడత హరితహారం లక్ష్యాన్ని ఇవాళ్టితో పూర్తి చేయాలని అటవీ శాఖ సూచించింది.తుపాకీతో కాల్పించి భర్తను చంపించిన భార్య.. ఏడేళ్ల వైవాహిక బంధం, ముత్యాల్లాంటి ఇద్దరు పిల్లలు, హాయిగా సాగాల్సిన జీవితం. అయినా, ఓ అనుచిత సంబంధం వారి అనుబంధాన్ని ఛిద్రం చేసింది. భార్య పన్నిన పన్నాగం నిద్రలో ఉన్న ఆ భర్త ప్రాణాలు తోడేసింది. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడనే అక్కసుతో తాళి కట్టిన భర్తనే ప్రియుడితో హత్య చేయించింది ఆ ఇల్లాలు.అమిత్ షా షెడ్యూల్ ఇదే..bjp munugode samarabheri sabha మునుగోడు ఉపపోరుకు భారతీయ జనతా పార్టీ నేడు సమరభేరి మోగించనుంది. దుబ్బాక, హుజూరాబాద్ మాదిరే ఈ నియోజకవర్గంలోనూ కాషాయ జెండా ఎగురవేయాలనే పట్టుదలతో ఉంది. ఇవాళ నిర్వహించే బహిరంగ సభ వేదిక పైనుంచి ప్రచారపర్వానికి భాజపా అగ్రనేత, కేంద్రమంత్రి అమిత్ షా శ్రీకారం చుట్టనున్నారు. మునుగోడు తాజా మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి సహా పలువురు నేతలు భాజపా తీర్థం పుచ్చుకోనున్నారు.మ్యాన్‌హోల్‌లోకి దిగి ముగ్గురి మృతి.. ఏపీలోని పల్నాడు జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. డ్రైనేజీ శుభ్రపరిచేందుకు మ్యాన్‌హోల్‌లోకి దిగి.. ప్రమాదవశాత్తు ముగ్గురు మృతి చెందారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.హైవేకు అడ్డంగా రైతు డ్రీమ్ హౌస్..జాతీయ రహదారి కోసం తన ఇంటిని కూల్చేయడం అతడికి ఇష్టం లేదు. అందుకోసం ఏకంగా ఇంటినే 500 అడుగులు వెనక్కి జరిపి తన కలల సౌధంపై ఎంత ప్రేముందో చాటుకున్నాడు పంజాబ్‌కు చెందిన ఓ రైతు.రైలు పట్టాలపై ఐఐటీ విద్యార్థిని మృతదేహం.. IIT Madras Student Death ఐఐటీ మద్రాస్ విద్యార్థిని అనుమానాస్పద రీతిలో మరణించింది. తమిళనాడు చెన్నై సమీపంలో ఆవడి వద్ద రైలు పట్టాలపై ఆమె మృతదేహం లభ్యమైంది. ఆమె మరణానికి కారణాలు తెలియాల్సి ఉంది.వడ్డీ రేట్లు మరింత పెరగొచ్చు..రుణాలకు గిరాకీ పెరిగినందున వడ్డీ రెట్లు పెరిగే అవకాశం ఉందని కరూర్ వైశ్యా బ్యాంకు మేనేజింగ్ డైరెక్టర్ (ఎండీ), ముఖ్య కార్యనిర్వహణాధికారి బి.రమేష్ బాబు అన్నారు. వివిధ రంగాల నుంచి రుణాలకు డిమాండ్ పెరగడమే ఇందుకు కారణమని తెలిపారు. ఈ విషయాలను ఈనాడు- ఈటీవీ భారత్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు.స్కూటీపై స్టార్ జోడీ షికారు.. ఆ స్టార్ భార్యాభర్తలు ఎప్పుడూ బిజీ బిజీగా గడుపుతుంటారు. చిన్న బ్రేక్ తీసుకుని స్కూటీపై షికారు చేస్తూ ఓ ఫొటోషూట్‌కు వెళ్లారు. అయితే ఫ్యాన్స్ నుంచి తప్పించుకునేందుకు తెలివిగా హెల్మెట్లు పెట్టుకుని మరీ రోడ్డు మీద చక్కర్లు కొట్టారు. ఇంతకీ వారు ఎవరంటే.మగబిడ్డకు జన్మనిచ్చిన బాలీవుడ్ హీరోయిన్..Sonam kapoor Blessed With Baby Boy సోనమ్ కపూర్, ఆనంద్ అహుజా దంపతులు తమ మొదటి బిడ్డకు స్వాగతం పలికారు. శనివారం సోనమ్ పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఇరువురు ప్రత్యేక సందేశాన్ని షేర్ చేశారు.