ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలుఅమిత్ షా మునుగోడు పర్యటన షెడ్యూల్ ఇదే Amith Sha Munugodu Schedule మునుగోడుపై ప్రత్యేక దృష్టి సారించిన భాజపా ఈనెల 21న భారీ బహిరంగ సభ నిర్వహించనుంది. ఈ సభకు ముఖ్య అతిథిగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా హాజరు కానున్నారు. ఈ పర్యటనకు సంబంధించి షెడ్యూల్ ఖరారైంది. అదే రోజు మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి భాజపాలో చేరనున్నారు.ఇలాంటివి కేవలం ఇండియాలోనే జరుగుతాయి : కేటీఆర్KTR on Bilkis Bano Case బిల్కిస్ బానో అత్యాచార దోషుల్ని విడుదల చేయటంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన మంత్రి కేటీఆర్ ఇదే ఘటనపై మరోసారి ట్విటర్ వేదికగా స్పందించారు. ఈసారి నిర్వేదంతో కూడిన ఆక్రోశాన్ని మంత్రి కేటీఆర్ వెల్లగక్కారు. ప్రతి ఒక్కరు దీనిపై గొంతెత్తాలని సూచించారు. అసలేమైందంటే..నచ్చితే నీతి, నచ్చకపోతే అవినీతా..? Harish Rao Comments కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందంటూ కేంద్రమంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ చేసిన వ్యాఖ్యలను మంత్రి హరీశ్‌రావు తీవ్రంగా తప్పుబట్టారు. కేంద్ర ప్రభుత్వ తప్పులను తెరాస ప్రభుత్వం ఎత్తిచూపుతూ వాస్తవాలను ప్రజల ముందు ఉంచడం వల్లే అసత్య ప్రచారం చేస్తున్నారని హరీశ్ ఆరోపించారు.రాజీనామా చేసే ప్రసక్తే లేదన్న మహేశ్వర్‌రెడ్డిMaheshwar Reddy denied resignation news అధిష్ఠానానికి మాణికం ఠాగూర్‌పై లేఖ, రాజీనామా చేస్తున్నానంటూ వస్తున్న వార్తల్ని ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ ఛైర్మన్ ఏలేటి మహేశ్వర్‌రెడ్డి ఖండించారు. చావో రేవో కాంగ్రెస్‌లోనేనని, ఐక్యంగా పార్టీ విజయానికి కృషి చేస్తానని పేర్కొన్నారు. మాణికం ఠాగూర్ తనకు మంచి మిత్రుడని అతనితో తనకెలాంటి వివాదాలు లేవని మహేశ్వర్‌రెడ్డి స్పష్టం చేశారు.మమతతో సుబ్రహ్మణ్య స్వామి భేటీ భాజపా నేత, మాజీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి బంగాల్ సీఎం మమతా బెనర్జీని కలిశారు. ఈ సందర్భంగా దీదీపై ప్రశంసలు కురిపించారు. అంతకుముందు, మోదీపై విమర్శలు వ్యక్తం చేస్తూ ట్వీట్లు చేశారు.సర్కారు ఆధ్వర్యంలో ఆన్లైన్ టాక్సీ సేవలుKerala Savaari: కేరళ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కేరళ సవారీ పేరిట దేశంలోనే మొదటిసారిగా ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే ఆన్లైన్ ట్యాక్సీ సేవలను ప్రవేశపెట్టింది. రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్ ఈ సేవలను ప్రారంభించారు.భారత్‌పై చైనా మరో ఎత్తుగడ India china news: భారత్‌తో కయ్యానికి కాలుదువ్వుతున్న చైనా తాజాగా మరో ఎత్తుగడ వేసింది. తన భూభాగం వెలుపల తొలి విదేశీ నౌకస్థావరంలో సైనిక కార్యకలాపాలు ప్రారంభించినట్లు తెలుస్తోంది. ఇది హిందూ మహాసముద్రంలో మోహరించిన తమ యుద్ధనౌకలకు సహాయకారిగా మారనుంది. 590 మిలియన్ డాలర్ల బడ్జెట్‌తో నిర్మించిన నౌక స్థావరంలో సైన్యాన్ని దించి భారత్‌కు పక్కలో బల్లెంలా మారాలని కుట్ర చేస్తోంది.కాయిన్స్‌తో కోట్ల మోసం..స్టేట్ బ్యాంక్‌లో భారీ స్కామ్భారతీయ స్టేట్ బ్యాంక్‌లో నాణేలు మాయమైన వ్యవహారంపై కేంద్ర దర్యాప్తు సంస్థ విచారణ చేపట్టింది. వేర్వేరు రాష్ట్రాల్లో 25 చోట్ల సోదాలు జరిపింది.తొలి వన్డేలో జింబాబ్వే చిత్తు.. భారత్ ఘనవిజయం జింబాబ్వేతో జరిగిన తొలి వన్డేలో భారత్ ఘన విజయం సాధించింది. బ్యాటింగ్, బౌలింగ్‌లో సత్తా చాటింది. ఆల్‌రౌండ్ ప్రదర్శనతో పది వికెట్ల తేడాతో గెలుపొందింది. అదే సమయంలో పలు రికార్డులు సైతం నెలకొల్పింది.చాహల్, ధనశ్రీ విడాకులు తీసుకుంటున్నారా..?టీమ్ఇండియా క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్, అతడి భార్య ధనశ్రీ వర్మ మధ్య విభేదాలు వచ్చాయంటూ సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. ధనశ్రీ చేసిన ఓ పని ఆ అనుమానాలకు తావిచ్చింది. అయితే, దీనిపై చాహల్ వివరణ ఇచ్చాడు.