తెలంగాణ

telangana

ETV Bharat / city

11AM టాప్​ న్యూస్

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

11AM TOPNEWS
11AM TOPNEWS

By

Published : Aug 14, 2022, 10:59 AM IST

  • బిగ్​బుల్ రాకేశ్ ఝున్​ఝున్​వాలా హఠాన్మరణం

ప్రముఖ వ్యాపారవేత్త, దిగ్గజ పెట్టుబడిదారు రాకేశ్ ఝున్​ఝున్​వాలా కన్నుమూశారు. 62 ఏళ్ల వయసులో ఆయన ప్రాణాలు కోల్పోయారు. ఆదివారం ఉదయం ఝున్​ఝున్​వాలా అస్వస్థతకు గురికాగా.. కుటుంబ సభ్యులు ముంబయిలోని ఓ ఆస్పత్రికి తరలించారు. అయితే, అప్పటికే ఆయన ప్రాణాలు కోల్పోయారని వైద్యులు ప్రకటించారు.

  • కోలుకుంటున్న సల్మాన్ రష్దీ వెంటిలేటర్ తొలగింపు

ప్రముఖ రచయిత సల్మాన్ రష్దీ కోలుకుంటున్నారు. ప్రస్తుతం ఆయనకు వెంటిలేటర్ తొలగించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. రష్దీ ఇప్పుడు మాట్లాడగలుగుతున్నారని వెల్లడించాయి.

  • నల్గొండ జిల్లాలో సర్పంచి భర్త దారుణ హత్య

నల్గొండ జిల్లా ఎల్లమ్మగూడెం సర్పంచి భర్త విజయ్‌రెడ్డిని ప్రత్యర్థులు దారుణంగా హత్య చేశారు. ఇంటికి వెళ్తుండగా అడ్డగించి కత్తులు, గొడ్డళ్లతో కిరాతంగా హత్య చేశారు. రాజకీయ కక్షతోనే తన భర్తను హత్య చేశారని మృతుడి భార్య సంధ్య ఆరోపించారు.

  • 26 గేట్ల ద్వారా కిందకు దూకుతూ కృష్ణమ్మ కనువిందు

నాగార్జున సాగర్​కు కృష్ణమ్మ పరుగులు ఆగడం లేదు గురువారం నుండి వరద ప్రవాహం అధికంగా ఉండడంతో 26 క్రస్ట్ గేట్లను ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు. సాగర్ అందాలు చూసేందుకు ఇవాళ భారీగా పర్యటకులు వచ్చే అవకాశం ఉన్నందున అధికారులు అందుకు తగ్గట్లుగా ట్రాఫిక్ సమస్య లేకుండా ఏర్పాట్లు చేస్తున్నారు.

  • దుర్వ్యసనాలకు బానిసైన కుమారుడిని చంపించిన తండ్రి

దుర్వ్యసనాలకు బానిసయ్యాడని కన్న కొడుకునే కడతేర్చాడు ఓ తండ్రి. హత్య చేసేందుకు ఏకంగా రూ.2 లక్షల సుపారీ కూడా ఇచ్చాడు. ఈ దారుణానికి తండ్రికి మేనమామ కూడా సహకరించాడు. అసలేం జరిగిందంటే

  • విశ్వ యవనికపై వికసించిన భారత మైత్రి

స్వతంత్రం వచ్చినప్పుడు ఏకాకిగా ఉన్న భారత్​ ఇప్పుడు ప్రపంచ దేశాలతో సుదృఢ బంధాలను ఏర్పరచుకుంది. అంతర్జాతీయ కూటముల్లో కీలక భూమిక పోషిస్తోంది. స్వాతంత్య్రం సిద్ధించి 75 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా భారత్ అంతర్జాతీయ సంబంధాలపై ప్రత్యేక కథనం

  • స్వతంత్ర భారతంలో మహిళల విజయ ప్రస్థానం

ఆమె ఖ్యాతిగాంచని రంగం లేదు. సాధించని ప్రగతి లేదు. ఆత్మవిశ్వాసాన్ని ఆభరణంగా మలచుకుని విభిన్న వేదికలపై మహిళాలోకం వెలుగులీనుతోంది. స్వతంత్ర భారతంలో అతివల ప్రస్థానం ఆకాశమే హద్దుగా సాగుతోంది. వలసపాలన నుంచి విముక్తి పొందిన భారతావనిలో వనితాలోకం వడివడిగా పురోగమిస్తోంది.

  • దేశంలో స్వల్పంగా తగ్గిన కరోనా కేసులు

భారత్​లో రోజువారీ కరోనా కేసుల సంఖ్య స్వల్పంగా తగ్గింది. తాజాగా 14,092 మందికి కొవిడ్ సోకినట్లు తేలింది. రికవరీ రేటు 98.54 శాతానికి చేరుకుంది. యాక్టివ్ కేసులు 0.26 శాతానికి పడిపోయాయి.

  • కరోనా వ్యాక్సిన్​ వేసుకోని జకోవిచ్ యూఎస్​ ఓపెన్​లో​ ఆడనున్నాడా

కరోనా వ్యాక్సిన్‌ వేసుకోని కారణంగా ఈ ఏడాది తొలి గ్రాండ్‌స్లామ్‌ ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌కు దూరమైన టెన్నిస్‌ స్టార్‌ జకోవిచ్‌ యూఎస్​ ఓపెన్‌లోనూ పోటీపడడం అనుమానంగా మారింది. అమెరికా నిబంధనల ప్రకారం వ్యాక్సిన్‌ వేసుకోని విదేశీయులకు ఆ దేశంలో ప్రవేశం లేదు. దీంతో అతను పాల్గొనడంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

  • ఉత్తమ నటుడిగా​ ఆస్కార్ రేసులో తారక్​

హీరో జూనియర్ ఎన్టీఆర్ పేరు నెట్టింట మారుమోగిపోతోంది. ఆస్కార్ రేసులో తారక్ ఉన్నారంటూ ఫ్యాన్స్ హంగామా చేస్తున్నారు. ఉత్తమ నటుడి క్యాటగిరీలో ఎన్టీఆర్ పేరు కచ్చితంగా ఉంటుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. అసలేం జరిగిందంటే

ABOUT THE AUTHOR

...view details