తెలంగాణ

telangana

ETV Bharat / city

Telangana Top News: టాప్​న్యూస్ @9PM - 9PM టాప్​న్యూస్

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

9PM TOPNEWS
9PM TOPNEWS

By

Published : Aug 9, 2022, 8:58 PM IST

  • బిహార్‌ సీఎంగా నితీశ్​ ప్రమాణస్వీకారానికి ముహుర్తం ఫిక్స్​

రాజకీయ పునరేకీకరణతో బిహార్​ పాలిటిక్స్ మరోసారి కీలక మలుపు తిరిగాయి. కేంద్రంలో, రాష్ట్రంలో మిత్రపక్షంగా ఉన్న భాజపాకు రెండోసారి షాక్ ఇస్తూ.. ఎన్​డీఏ నుంచి బయటకు వచ్చేసింది జేడీయూ. ఇప్పటివరకు ప్రత్యర్థులుగా ఉన్న ఆర్​జేడీ, కాంగ్రెస్​, వామపక్షాలతో చేతులు కలిపింది.

  • తెలంగాణ మంత్రివర్గ సమావేశానికి ముహుర్తం ఖరారు..

తెలంగాణ రాష్ట్ర మంత్రి వర్గ సమావేశానికి ముహుర్తం ఖరారు అయింది. ఈనెల 11న (గురువారం) రాష్ట్ర మంత్రివర్గ సమావేశం కానుంది. సీఎం కేసీఆర్ అధ్యక్షతన ప్రగతిభవన్‌లో మధ్యాహ్నం 3 గంటలకు మంత్రివర్గ భేటీ నిర్వహించనున్నారు. రాష్ట్రానికి అదనపు ఆర్థిక వనరులు, ఇతర అంశాలపై మంత్రివర్గం చర్చ జరపనుంది.

  • బండితో రాజగోపాల్‌రెడ్డి భేటీ... ఆ విషయాలపై చర్చ!!

యాదాద్రి జిల్లా పంతంగి వద్ద బండి సంజయ్‌తో కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి భేటీ అయ్యారు. రాజగోపాల్‌రెడ్డితో పాటు వివేక్, విశ్వేశ్వర్‌రెడ్డిలు బండి సంజయ్‌ను కలిశారు. రాజగోపాల్‌రెడ్డి భాజపాలో చేరిక తేదీ, బహిరంగ సభ అంశంపై చర్చించినట్లు తెలుస్తోంది.

  • డిగ్రీ విద్యార్థినిపై హత్యాయత్నం..

నల్గొండ జిల్లాలో దారుణం జరిగింది. డిగ్రీ కళాశాల విద్యార్థినిపై ఓ విద్యార్థి హత్యాయత్నానికి పాల్పడ్డాడు. ప్రేమపేరుతో కొంతకాలంగా వేధిస్తున్న విద్యార్థి రోహిత్ ఈ దారుణానికి ఒడిగట్టాడు. డిగ్రీ చదువుతున్న యువతిపై కత్తితో దాడి చేశాడు.

  • భద్రాచలంలో గోదావరికి పెరుగుతున్న వరద..

రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలతో పాటు ఎగువ ప్రాంతంలో కురుస్తున్న వర్షాలకు భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. నిన్న 35 అడుగులు ఉన్న గోదావరి నీటిమట్టం ఈరోజు మధ్యాహ్నానికి 41. 2 అడుగులు దాటింది.

  • భారీగా పెరిగిన మోదీ ఆస్తులు..

భారత ప్రధాని నరేంద్ర మోదీకి.. ఎంత ఆస్తులు ఉన్నాయనే విషయం తెలుసుకోవాలని చాలా మందికి ఆసక్తి ఉంటుంది. ఏటా ఆయన తన ఆస్తుల వివరాలను అధికారికంగా వెల్లడిస్తారు. ఈసారి మరి మోదీ ఆస్తుల విలువ​ ఎంత పెరిగిందో తెలుసా?

  • 'బిహార్​లో రాష్ట్రపతి పాలన విధించాలి.. వచ్చే ఎన్నికల్లో సున్నా ఓట్లే'

భాజపా-జేడీ(యూ) బంధం తెగిపోవడం వల్ల బిహార్‌లో రాజకీయ పరిణామాలు శరవేగంగా మారిపోతున్నాయి. ముఖ్యమంత్రి పదవికి నితీశ్‌ కుమార్‌ రాజీనామా చేశారు. అయితే ఆర్జేడీతో నితీశ్‌ చేతులు కలపడంపై లోక్‌జనశక్తి పార్టీ నేత చిరాగ్ పాసవాన్‌ మండిపడ్డారు.

  • ట్రంప్ ఇంటిపై ఎఫ్​బీఐ దాడులు.. లాకర్లు బద్దలు..

అమెరికా మాజీ అధ్యక్షుడి ఇంటిపై ఎఫ్​బీఐ దాడులు నిర్వహించింది. తన ఇంటిని ఎఫ్​బీఐ ఏజెంట్లు ఆక్రమించుకున్నారని.. లాకర్లను పగులగొట్టారని ట్రంప్ మండిపడ్డారు. 2024 అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్లను అడ్డుకోవాలన్న కుట్రతోనే ఇలా చేస్తున్నారని ఆరోపించారు.

  • టెన్నిస్​ దిగ్గజం సంచలన ప్రకటన.. రిటైర్మెంట్​ అంటూ!

అమెరికా టెన్నిస్​ దిగ్గజం సెరెనా విలియమ్స్​ రిటైర్మెెంట్​ గురించి కీలక వ్యాఖ్యలు చేసింది. టెన్నిస్​కు మెల్లమెల్లగా దూరమవుతున్నట్లు ప్రకటించింది. 23 గ్రాండ్​స్లామ్​ టైటిళ్లు సాధించానని, టెన్నిస్​ నుంచి తప్పుకోవడానికి సిద్ధమేనని ఆమె రాసిన ఓ వ్యాసాన్ని వోగ్​ మ్యాగజైన్​ విడుదల చేసింది.

  • ఇన్​స్టా పోస్టులన్నీ డిలీట్​ చేసిన రానా..

టాలీవుడ్​ నటుడు రానా దగ్గుబాటి తన ఇన్​స్టాగ్రామ్​ పోస్టులన్నింటినీ డిలీట్​ చేశారు. ఒక్కటి కూడా ఉంచలేదు. కారణమేంటంటే?

ABOUT THE AUTHOR

...view details