తెలంగాణ

telangana

ETV Bharat / city

Telangana News Today : టాప్​న్యూస్​ @ 11AM

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

Telangana News Today
Telangana News Today

By

Published : Aug 9, 2022, 11:01 AM IST

  • దేశంలో భారీగా తగ్గిన కరోనా కేసులు

Covid Cases In India: భారత్​లో కొవిడ్​ కేసులు భారీగా తగ్గాయి. తాజాగా 12,751 మంది వైరస్ బారిన పడ్డారు. 16,412 మంది కోలుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా కొవిడ్ కేసులు కాస్త తగ్గాయి. అయితే, జపాన్​లో మాత్రం వైరస్ తీవ్రత అధికంగా ఉంది.

  • భాజపాపై జేడీయూ కోపానికి కారణమేంటి?

Bihar politics crisis : 2020 అసెంబ్లీ ఎన్నికల్లోనూ భాజపా, జేడీ(యు) కలిసి పోటీ చేశాయి. జేడీ(యు)కు తక్కువ స్థానాలే వచ్చినప్పటికీ మిత్ర ధర్మాన్ని పాటిస్తూ భాజపా నీతీశ్‌కే ముఖ్యమంత్రి పదవిని అప్పగించింది. అయితే, కొంతకాలంగా భాజపా, జేడీ(యు) మధ్య దూరం పెరుగుతోంది. ఇందుకు కారణాలేంటి? బిహార్ రాజకీయం ఎలాంటి మలుపులు తిరగనుంది?

  • మునుగోడు ఉపఎన్నికలో ఆర్భాటాలు వద్దు

trs focus on munugodu by election: మునుగోడులో మోహరించేందుకు గులాబీ దళం సిద్ధమవుతోంది. అభ్యర్థి ఖరారుకు ముందే పార్టీ యంత్రాంగం నియోజకవర్గంలో ప్రచారం చేసేలా తెరాస ప్రణాళికలు రచిస్తోంది. కాంగ్రెస్, భాజపా నేతలు భారీగా పార్టీలో చేరేలా కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యాకే అభ్యర్థిని ప్రకటించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.


  • ఎస్సై అభ్యర్థిని కోమాలోకి పంపారు..

attack on car driver news: నిరుపేద కుటుంబ నేపథ్యం. డిగ్రీ పూర్తి చేసి తండ్రికి అండగా ఉండాలనుకున్నాడు. పోలీసు కొలువు సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు. కుటుంబానికి భారం కావొద్దనే ఉద్దేశంతో క్యాబ్‌ నడుపుతూనే ఎస్సై రాత పరీక్ష శిక్షణ పూర్తి చేశాడు. అంతా బాగుంటే.. ఆదివారం జరిగిన ఎస్సై పరీక్షకు హాజరయ్యేవాడే..! ఇంతలోనే పరీక్ష రాయాల్సిన అభ్యర్థి.. ఆసుపత్రిలో అపస్మారక స్థితిలో ఉన్నాడు. రాజేంద్రనగర్‌ పరిధిలోని ఉప్పర్‌పల్లిలో క్యాబ్‌ కిరాయి అడిగినందుకు ఇటీవల దాడికి గురైన వెంకటేశ్​ నేపథ్యమిది.

  • శునకానికి కన్నీటి వీడ్కోలు.. కారులో ఊరేగింపు

ఒడిశాలో ఓ శునకానికి ఘనంగా అంత్యక్రియలు జరిపించింది ఓ కుటుంబం. 17ఏళ్లుగా ఎంతో విశ్వాసంతో తమతో కలిసి ఉన్న శునకానికి కారులో ఊరేగిస్తూ అంతిమయాత్ర నిర్వహించింది. గజపతి జిల్లాలోని పార్లాఖేముందీ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. తున్ను గౌడ కుటుంబం 17 ఏళ్లుగా ఈ శునకాన్ని పెంచుకుంటోంది. అంజలి అని పేరుపెట్టి అల్లారుముద్దుగా చూసుకుంటూ ఉండేది. ఈ క్రమంలోనే శునకం ప్రాణాలు కోల్పోగా.. దానికి అశ్రునయనాలతో వీడ్కోలు పలికింది.

  • వరదలో కొట్టుకుపోయిన ట్రాక్టర్- ఐదుగురు గల్లంతు

వాగు దాటుతుండగా నీటి ఉద్ధృతి ఒక్కసారిగా పెరిగి ట్రాక్టర్​ కొట్టుకుపోగా.. ఐదుగురు గల్లంతయ్యారు. మహారాష్ట్ర అమరావతి జిల్లా నంద్​గావ్​ ఖండేశ్వర్​ మండలం జావ్రా మోల్వాన్​లో జరిగిందీ ఘటన. వంతెన లేని ఈ ప్రాంతంలో ట్రాక్టర్​తో వాగు దాటడం ఇక్కడి వారికి అలవాటే. అయితే.. సోమవారం అలానే చేస్తుండగా ఒక్కసారిగా నీటి ఉద్ధృతి పెరిగింది. వాగు మధ్యలో ట్రాక్టర్ ఆగిపోయింది. కాసేపటికే వాహనంతోపాటు దానిపై ఉన్న ఐదుగురు నీటిలో కొట్టుకుపోయారు.

  • ట్రంప్ ఇంటిపై ఎఫ్​బీఐ దాడులు

FBI raids on Trump home: అమెరికా మాజీ అధ్యక్షుడి ఇంటిపై ఎఫ్​బీఐ దాడులు నిర్వహించింది. తన ఇంటిని ఎఫ్​బీఐ ఏజెంట్లు ఆక్రమించుకున్నారని.. లాకర్లను పగులగొట్టారని ట్రంప్ మండిపడ్డారు. 2024 అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్లను అడ్డుకోవాలన్న కుట్రతోనే ఇలా చేస్తున్నారని ఆరోపించారు.

  • నీరజ్​చోప్రా 'గోల్డ్​మెడల్​' రికార్డ్​ బద్దలు.. ఎవరా అథ్లెట్​?

Commonwealth Games 2022 Neeraj chopra: కామన్వెల్త్‌ క్రీడల్లో భాగంగా జావెలిన్‌ త్రోలో ఓ అథ్లెట్‌ రికార్డు త్రో విసిరి అందర్నీ ఆకట్టుకున్నాడు. దీంతో భారత అథ్లెట్‌, ప్రపంచ నంబర్‌వన్‌ నీరజ్ చోప్రా కూడా షాక్​ అయ్యాడు!

  • 'సీత'.. ఆ పేరులో ఉన్న మ్యాజిక్కే వేరు

'ఓ సీతా.. వదలనిక తోడౌతా' అంటూ ఇటీవలే వచ్చిన 'సీతారామం'లో సాంగ్​ సహా ఆ మూవీ ఎంతలా బ్లాక్ బస్టర్​ హిట్​గా నిలిచిందో అందరికీ తెలిసిందే. ఈ ప్రేమ కావ్యానికి ప్రేక్షకులు ఫిదా అయిపోతున్నారు. సోషల్​మీడియా వేదికగా సీత పేరుతో ఉన్న పాత్రలను గుర్తుచేసుకుంటూ మీమ్స్​ ట్రెండ్​ చేస్తున్నారు. ఆ మీమ్స్​ను గమనిస్తే ఓ ఆసక్తికర విషయం తెలుస్తోంది. ఆ పేరుతో ఉన్న పాత్రకు సంబంధించిన సినిమాలను పరిశీలిస్తే అవన్నీ హిట్​ కావడం మరింత విశేషం. ఓ సారి ఆ సినిమాలేంటో చూసేద్దాం..

  • ఫొటోలో ఉన్న టాలీవుడ్​ హీరోను గుర్తుపట్టగలరా?.. ఈ వారమే భారీ సినిమాతో..

పైన ఫొటోలో కనపడుతున్న ఈ క్యూట్​ చిన్నోడు.. ప్రస్తుతం టాలీవుడ్​ యాంగ్​ హీరో. వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ కెరీర్​లో ముందుకెళ్తున్నాడు. ఈ వారంలో అతడు నటించిన ఓ సినిమా భారీ అంచనాలతో దేశవ్యాప్తంగా విడుదల కానుంది. మరి ఇతడు ఎవరో గుర్తుపట్టగలరా?

ABOUT THE AUTHOR

...view details