- హైటెక్ యుద్ధాలకు భారత్ సన్నద్ధం
HIGH TECH WAR INDIA: హైటెక్ యుద్ధాలను దృష్టిలో ఉంచుకొని, అందుకు అనుగుణంగా సాధన సంపత్తిని సమకూర్చుకోవడంపై భారత్ దృష్టిపెట్టింది. ఆధునిక కమ్యూనికేషన్, సైబర్, విద్యుదయస్కాంత వ్యవస్థల ప్రభావంపై అధ్యయనం చేపట్టింది. దీని ఆధారంగా వ్యూహాలకు పదును పెడుతోంది.
- పది కోట్లు దాటిన ప్రికాషన్ డోసుల పంపిణీ
Precaution Dose: దేశంలో ఇప్పటివరకు పది కోట్లకుపైగా అర్హులు ప్రికాషన్ డోసు తీసుకున్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవీయ వెల్లడించారు. ‘ఇప్పుడు 10 కోట్ల మంది అధిక రక్షణ కలిగి ఉన్నారు. అమృతోత్సవాల వేళ ప్రధాని మోదీ సారథ్యంలో కరోనా టీకా పంపిణీ కార్యక్రమం జోరుగా సాగుతోంది’ అని మాండవీయ శుక్రవారం ట్వీట్ చేశారు.
- బూస్టర్ డోసుగా కొవాగ్జిన్‌కు జపాన్ గుర్తింపు
Covaxin Booster Dose : కొవాగ్జిన్ వ్యాక్సిన్‌కు మరో అంతర్జాతీయ గుర్తింపు లభించినట్లు భారత్ బయోటెక్ వెల్లడించింది. ఈ టీకాను ప్రయాణికులు బూస్టర్ డోస్‌గా తీసుకోవడానికి జపాన్ దేశం అనుమతించినట్లు తెలిపింది. ఫైజర్, మొడెర్నా, నొవావ్యాక్స్, ఆస్ట్రజెనెకా, జాన్సన్ కంపెనీలకు చెందిన కొవిడ్ టీకాలకు కొంతకాలంగా జపాన్‌లో ఇటువంటి అనుమతి ఉంది. తాజాగా ఈ జాబితాలో భారత్ బయోటెక్‌కు చెందిన కొవాగ్జిన్‌ను చేర్చింది.
- చీకోటి ప్రవీణ్ వ్యవహారం... సాంకేతిక ఆధారాలు స్వాధీనం
Chikoti Praveen: విదేశీ క్యాసీనో, హావాలా వ్యవహారంలో ఈడీ లోతుగా విచారణ చేస్తున్న వేళ ప్రస్తుతం చీకోటి ప్రవీణ్ వ్యవహారం పలువురు రాజకీయ నేతలతో జరిపిన వాట్సాప్ చాటింగ్ కలకలం రేపుతోంది. నేపాల్, శ్రీలంక, థాయ్‌ల్యాండ్, మలేషియా తదితర దేశాల్లో క్యాసీనోల నిర్వహణలో ఆరితేరిన చీకోటి ప్రవీణ్.. పలువురు ఎమ్మెల్యేల వాట్సప్ సంభాషణలను ఈడీ గుర్తించినట్లు సమాచారం.
- బల్లికి గురి పెట్టి.. బాలుడిని కాల్చాడు
firing in old city: హైదరాబాద్ పాతబస్తీలో కాల్పుల కలకలం రేగింది. ఓ యువకుడు ఇంట్లో గోడపై ఉన్న బల్లులను కాల్చుతుండగా.. ప్రమాదవశాత్తు బుల్లెట్ ముక్క తగిలి పక్కింటి వరండాలో ఆడుకుంటున్న ఓ బాలుడు గాయపడ్డాడు. ఈ నెల 1న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
- శ్వేతసౌధం వద్ద పిడుగు- ముగ్గురు మృతి