తెలంగాణ

telangana

ETV Bharat / city

Telangana News Today : టాప్​న్యూస్​ @ 7AM - తెలంగాణ లేటెస్ట్ న్యూస్

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

Telangana News Today
Telangana News Today

By

Published : Aug 6, 2022, 6:59 AM IST

  • నేడే ఉపరాష్ట్రపతి ఎన్నికలు

Vice president election: భారత 16వ ఉపరాష్ట్రపతి ఎన్నిక శనివారం జరగనుంది. ఎన్డీయే కూటమి తరఫున పశ్చిమబెంగాల్‌ మాజీ గవర్నర్‌ జగదీప్‌ ధన్‌ఖడ్‌(71), విపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా మాజీ కేంద్రమంత్రి, గవర్నర్‌ మార్గరెట్‌ ఆళ్వా (80) రంగంలో ఉన్న ఈ ఎన్నికకు సంబంధించిన పోలింగ్‌ ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటలవరకు పార్లమెంటు భవనంలో కొనసాగనుంది. ధన్‌ఖడ్‌ ఎన్నిక లాంఛనంగా కనిపిస్తోంది.

  • ప్రజల్లో ఉద్యమ భావజాలాన్ని రగిలించారు: కేసీఆర్

CM KCR On Jayashankar: తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర స్వాప్నికుడు స్వర్గీయ ప్రొఫెసర్ జయశంకర్ జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ నివాళులర్పించారు. ఉమ్మడి పాలనలో నాడు తెలంగాణకు జరిగిన నష్టాలను కష్టాలను వివరిస్తూ, స్వరాష్ట్ర ఆకాంక్షలను, ప్రజల్లో ఉద్యమ భావజాలాన్ని ప్రొఫెసర్ జయశంకర్ రగిలించారని సీఎం కేసిఆర్ స్మరించుకున్నారు. జయశంకర్ స్ఫూర్తితో ఉద్యమాన్ని కొనసాగించి, మొక్కవోని దీక్షతో సాహసోపేత పోరాటం చేసి స్వరాష్ట్రాన్ని సాధించుకున్నామని తెలిపారు.

  • నేడు, రేపు అతి భారీ వర్షాలు

Telangana Rain Alert : తెలంగాణలో మళ్లీ భారీ వర్షాలున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. శని, ఆదివారాల్లో పలుచోట్ల అతిభారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

  • బూస్టర్‌ డోసుగా కొవాగ్జిన్‌కు జపాన్‌ గుర్తింపు

Covaxin Booster Dose : కొవాగ్జిన్ వ్యాక్సిన్​కు మరో అంతర్జాతీయ గుర్తింపు లభించినట్లు భారత్ బయోటెక్ వెల్లడించింది. ఈ టీకాను ప్రయాణికులు బూస్టర్ డోస్​గా తీసుకోవడానికి జపాన్ దేశం అనుమతించినట్లు తెలిపింది. ఫైజర్‌, మొడెర్నా, నొవావ్యాక్స్‌, ఆస్ట్రజెనెకా, జాన్సన్‌ కంపెనీలకు చెందిన కొవిడ్‌ టీకాలకు కొంతకాలంగా జపాన్‌లో ఇటువంటి అనుమతి ఉంది. తాజాగా ఈ జాబితాలో భారత్‌ బయోటెక్‌కు చెందిన కొవాగ్జిన్‌ను చేర్చింది.

  • ప్రపంచీకరణతో స్థానిక సంస్కృతులకు ముప్పు: జస్టిస్‌ ఎన్వీ రమణ

Ou Doctorate to CJI: దేశ ఉన్నత విద్యారంగంలో కొత్త శకాన్ని సృష్టించిన ఉస్మానియా విశ్వవిద్యాలయం... గ్లోబల్ లెర్నింగ్ సెంటర్‌ అని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ పేర్కొన్నారు. భారత్ వంటి ప్రజాస్వామిక దేశాల్లో విశ్వవిద్యాలయాలు.. జాతి నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తాయన్నారు. జస్టిస్ ఎన్వీ రమణకు ఉస్మానియా యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్‌ను ప్రదానం చేసింది.

  • పటేల్​ను ఉక్కుమనిషిని చేసిన మేనన్

AZADI KA AMRIT: ఆయన ఆక్స్‌ఫర్డ్‌, హార్వర్డ్‌ల్లో చదవలేదు. ఎలాంటి రాజకీయ వారసత్వమూ లేదు. బతుకుదెరువు కోసం కూలీగా బరువులెత్తాడు. అసలు ఎలాంటి డిగ్రీలు లేనివాడు. అయినా.. ముగ్గురు వైస్రాయ్‌లకు తలలో నాలుకయ్యాడని, సంస్థానాల విలీనంలో పటేల్‌కు నమ్మిన బంటయ్యాడని వింటే ఆశ్చర్యపోవాల్సిందే. కానీ.. అదే నిజం! స్వతంత్ర భారతావని నిర్మాణానికి పునాదులు వేసిన కులీనుడు.. మనం మరచిన దేశభక్తుడు.. వప్పాల పంగున్ని (వీపీ) మేనన్‌!

  • హైదరాబాద్‌ విద్యార్థికి రూ.1.30 కోట్ల స్కాలర్‌షిప్‌

1.30 crore scholarship for Hyderabad student: అమెరికాలోని కేస్‌ వెస్ట్రన్‌ రిజర్వ్‌ విశ్వవిద్యాలయం హైదరాబాద్​కు చెందిన ఓ విద్యార్థికి బంపర్​ ఆఫర్​ ఇచ్చింది. బ్యాచిలర్‌ డిగ్రీ చదివేందుకు రూ.1.30 కోట్ల స్కాలర్‌షిప్‌ అందించనున్నట్లు అంగీకార పత్రాన్ని, స్కాలర్​షిప్ లేఖను విద్యార్థికి పంపింది. ఈ నెల 12న విద్యార్థి అమెరికాకు బయలుదేరి వెళ్లనున్నాడు.

  • చీకోటి ప్రవీణ్ వ్యవహారం... సాంకేతిక ఆధారాలు స్వాధీనం

Chikoti Praveen: విదేశీ క్యాసీనో, హావాలా వ్యవహారంలో ఈడీ లోతుగా విచారణ చేస్తున్న వేళ ప్రస్తుతం చీకోటి ప్రవీణ్ వ్యవహారం పలువురు రాజకీయ నేతలతో జరిపిన వాట్సాప్ చాటింగ్ కలకలం రేపుతోంది. నేపాల్, శ్రీలంక, థాయ్‌ల్యాండ్, మలేషియా తదితర దేశాల్లో క్యాసీనోల నిర్వహణలో ఆరితేరిన చీకోటి ప్రవీణ్.. పలువురు ఎమ్మెల్యేల వాట్సప్ సంభాషణలను ఈడీ గుర్తించినట్లు సమాచారం. ఈ క్రమంలో ప్రవీణ్, మాధవరెడ్డి సెల్ఫోన్లను ఫొరెన్సిక్ ల్యాబ్లో శాస్త్రీయంగా విశ్లేషించడం ద్వారా తొలగించిన సంభాషణలేమైనా ఉంటే రికవరీ చేసేందుకు ఈడీ ప్రయత్నిస్తోంది.

  • ఆగస్టు 15న ఓలా కారు ఆవిష్కరణ?

OLA CAR: ఈనెల 15న కొత్త ప్రోడక్ట్‌ను ఆవిష్కరించనున్నట్లు ప్రముఖ విద్యుత్తు వాహన తయారీ సంస్థ ఓలా ఎలక్ట్రిక్‌ సీఈఓ భవీష్‌ అగర్వాల్‌ ట్వీట్‌ చేశారు. దీంతో అదేంటా అని ఆటో వర్గాల్లో ఆసక్తి వ్యక్తమవుతోంది. ఆరోజు తమ కంపెనీ భవిష్యత్తు ప్రణాళికలను కూడా ప్రకటిస్తామని భవీష్‌ ట్వీట్‌లో పేర్కొన్నారు.

  • 'ఆమె యోగ్యురాలు. కంగ్రాట్స్‌ సిఖోమ్‌. నువ్వో లెజెండ్‌' హాలీవుడ్ స్టార్ ట్వీట్

Mirabai Chanu: బర్మింగ్​హామ్ వేదికగా జరుగుతున్న తొలి బంగారు పతకం అందించిన వెయిట్‌ లిఫ్టర్‌ మీరాబాయి చానుపై హాలీవుడ్‌ స్టార్‌ ప్రశంసలు కురిపించాడు. 'థోర్‌’ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన క్రిస్‌ హేమ్స్‌వర్త్‌ ప్రశంసలు కురిపించారు. ఇందుకు ఆమె యోగ్యురాలు అంటూ కొనియాడారు.

ABOUT THE AUTHOR

...view details