తెలంగాణ

telangana

ETV Bharat / city

Telangana News Today: టాప్‌ న్యూస్ @1PM - telangana topnews

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

1PM TOPNEWS
1PM TOPNEWS

By

Published : Aug 2, 2022, 12:59 PM IST

  • తెరాస ఎమ్మెల్యే హత్యకు సర్పంచ్‌ భర్త కుట్ర..!

తెరాసకు చెందిన ఆర్మూర్‌ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డిపై హత్యకు కుట్ర జరిగింది. బంజారాహిల్స్ రోడ్ నం-12లోని ఆయన నివాసం వద్ద ఆర్మూర్‌ నియోజకవర్గంలోని కిల్లెడ గ్రామానికి చెందిన సర్పంచ్ భర్త ప్రసాద్‌గౌడ్ ఈ హత్యకు కుట్రపన్నారు.

  • ఎంపీ నామ కుమారుడిని కత్తితో బెదిరించి..

తెరాస ఎంపీ నామ నాగేశ్వరరావు కుమారుడు పృథ్వీపై దారి దోపిడీ దుండగులు దాడి చేశారు. హైదరాబాద్ టోలిచౌకి వద్ద అతడి వాహనాన్ని ఆపి అందులో ఎక్కారు. కత్తితో బెదిరించి అతని బ్యాంక్ ఖాతా నుంచి 75వేలను ఆన్‌లైన్‌లో ట్రాన్స్‌ఫర్ చేయించుకుని దిగిపోయారు.

  • 'కమాండ్‌ కంట్రోల్‌తో రాష్ట్రంలో భద్రత మరింత పటిష్ఠం'

ఆధునిక హంగులతో.. దేశానికే తలమానికంగా నిలవనున్న పోలీస్ కమాండ్ కంట్రోల్ ప్రారంభోత్సవానికి ముస్తాబైందని రాష్ట్ర హోంమంత్రి మహమూద్ అలీ అన్నారు. ఆగస్టు 4న ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా ఈ సెంటర్ ప్రారంభం కానుందని తెలిపారు. మంత్రి తలసాని, డీజీపీ మహేందర్ రెడ్డి, ఎమ్మెల్యేలతో కలిసి కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను మహమూద్ అలీ సందర్శించారు.

  • ఆ సరస్సులో దిగడమే వారి తప్పు!

సరస్సులో మునిగి ఏడుగురు యువకులు ప్రాణాలు కోల్పోయారు. మరో నలుగురు బయటపడ్డారు. ఈ ఘటన హిమాచల్​ప్రదేశ్​లోని ఉనాలో జరిగింది.

  • మోదీ చెప్పినట్టు సోషల్ మీడియాలో డీపీ మార్చాలా? ఇలా చేయండి!

వాట్సాప్​లో ప్రొఫైల్‌ పిక్‌ను ఎలా మార్చుకోవాలనేది చాలా మందికి అవగాహన ఉంటుంది. మరి ట్విట్టర్​, ఫేస్​బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, లింక్డ్​ఇన్​ వంటి సామాజిక మాధ్యమాల్లో ప్రొఫైల్ పిక్​ను ఎలా మార్చుకోవాలో ఓ సారి తెలుసుకుందాం.

  • 21 ఏళ్లుగా వేట.. 'ఆపరేషన్​ బాల్కనీ'తో ఖతం.. ఎవరీ అల్​ జవహరీ?

సెప్టెంబర్ 11 మారణహోమం సూత్రధారుల్లో ఒకడు, అల్​ ఖైదా అధినేత అయ్​మన్​ అల్​ జవహరీ హతమయ్యాడు. కాబుల్​లోని ఓ ఇంట్లో ఉంటున్న అతడ్ని డ్రోన్​ దాడితో మట్టుబెట్టింది అమెరికా.

  • స్వల్పంగా పెరిగిన బంగారం ధర..

దేశంలో బంగారం ధర స్వల్పంగా పెరగగా.. వెండి ధర తగ్గింది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో పది గ్రాముల పసిడి, కిలో వెండి ధరలు ఎంత ఉన్నాయంటే?

  • సముద్రంలో చైనా సరికొత్త అస్త్రం..

చైనాకు చెందిన నిఘా నౌక 'యువాన్ వాంగ్​ 5'.. శ్రీలంకలోని హంబన్​టొట నౌకాశ్రయం వైపు వెళ్తోంది. అయితే ఈ నౌక 750 కిలోమీటర్లకు పైగా దూరంలోని ప్రాంతాలపై గగనతల నిఘా ఉంచగలదు. ఫలితంగా భారత్​లోని కల్పక్కం, కూడంకుళం సహా అణు పరిశోధనా కేంద్రాలు దీని పరిధిలో వస్తాయి.

  • విండీస్​ బౌలర్​ అద్భుతం..

సెయింట్‌ కిట్స్‌ వేదికగా ఉత్కంఠగా సాగిన రెండో టీ ట్వంటీలో విండీస్ అదరగొట్టింది. భారత్​పై 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఓ సారి ఈ మ్యాచ్​ విశేషాలను చూద్దాం..

  • ఆ సినిమా చేసేందుకు 93 మంది నో..

షార్ట్​ఫిల్మ్స్​ చేసే ఇద్దరు మిత్రులు​.. వెండితెరపై మెరవాలని ఆశించారు. ఆ ప్రయత్నంలోనే తమ దగ్గర ఉన్న కథను ఎంతో మందికి చెప్పగా దాదాపు 93 మంది ఆ సినిమా చేసేందుకు ససేమీరా అన్నారు. కానీ వారు ఆత్మవిశ్వాసం కోల్పోకుండా ఒకరు దర్శకుడిగా, మరొకరు హీరోగా మారి తమ చిత్రాన్ని తామే రూపొందించుకున్నారు.

ABOUT THE AUTHOR

...view details