తెలంగాణ

telangana

ETV Bharat / city

Telangana News Today: టాప్​న్యూస్ @11AM - topnews telangana

ఇప్పటివరకు ఉన్న ప్రధానవార్తలు

11AM TOPNEWS
11AM TOPNEWS

By

Published : Jul 31, 2022, 10:59 AM IST

  • కలెక్టర్ల కోసం ఎదురుచూస్తున్న నాలుగు జిల్లాలు

హైదరాబాద్‌ సహా మరో నాలుగు జిల్లాలు... కలెక్టర్ల కోసం ఎదురుచూస్తున్నాయి. పూర్తిస్థాయి కలెక్టర్లు లేకపోవడంతో.. అదనపు బాధ్యతలతో నెట్టుకొస్తున్నారు. పూర్తిస్థాయి కలెక్టర్లు లేకపోవడం వల్ల వర్షాలు, వరదల సమయంతో పాటు.. సహాయ, పునరావాస చర్యలు, సీజనల్ వ్యాధుల నివారణచర్యల కోసం ప్రత్యేకాధికారులను నియమించాల్సిన పరిస్థితి నెలకొంది.

  • 'ఆపరేషన్ ఆకర్ష్' ప్రారంభించిన భాజపా..

ఇందూరులో భాజపా 'ఆపరేషన్ ఆకర్ష్' ప్రారంభించింది. తెదేపా, తెరాస అసంతృప్తి నేతలపై కన్నేసింది. ఇప్పటికే జిల్లాలో పట్టు బిగిస్తోన్న కమలదళం.. బలహీనంగా ఉన్న నియోజకవర్గాల్లో పుంజుకునేందుకు చూస్తోంది.

  • దోస్తులు కదా అని ఇంటికి తీసుకొస్తే.. దోచేశారు

ఓ స్థిరాస్తి వ్యాపారి.. గోవా నుంచి వచ్చిన తన ఫ్రెండ్ పబ్​కు వెళ్దామంటే​ సరదాగా తీసుకెళ్లాడు. అక్కడ పాత ఫ్రెండ్​ కలిస్తే ఇద్దరూ అతనితో మాట కలిపారు. ఇంతలో తన ఫ్రెండ్​ అంటూ అతడు మరో వ్యక్తిని పరిచయం చేశాడు. ఫ్రెండ్​కి ఫ్రెండ్​ అంటే మనకూ ఫ్రెండే అనుకుంటూ నలుగురూ కలిసి అర్ధరాత్రి దాకా పబ్​లో గడిపారు.

  • కోట్లు కురిపించిన బార్లు..

ఏపీలో కొత్త బార్లు ప్రభుత్వానికి కాసుల వర్షం కురిపించాయి. తొలిదశలో 14 జిల్లాల పరిధిలో 344 బార్లకు శనివారం ఈ-వేలం నిర్వహించగా 323 బార్లకు లైసెన్సులు ఖరారయ్యాయి. వీటిద్వారా ప్రభుత్వానికి 258 కోట్ల రూపాయల ఆదాయం సమకూరింది.

  • ఉఫ్‌కారికి ఉపకారం.. చేతివాటం ప్రదర్శిస్తున్న ట్రాఫిక్‌ పోలీసులు

మద్యం తాగి వాహనాలు నడపకుండా కట్టుదిట్టం చేయాల్సిన ట్రాఫిక్‌ పోలీసులు తమదైన శైలిలో నయాదందాకు తెరలేపిన వైనం మిర్యాలగూడలో వెలుగుచూసింది. మద్యం తాగే వారిని పట్టించే సాంకేతిక పరిజ్ఞానం కలిగిన బ్రీత్‌ అనలైజర్‌తో అక్రమాలకు పాల్పడిన బాగోతం చర్చనీయాంశంగా మారింది.

  • దేశంలో స్వల్పంగా తగ్గిన కొవిడ్ కేసులు..

Covid Cases In India: భారత్​లో కొవిడ్​ కేసులు స్వల్పంగా తగ్గాయి. తాజాగా 19,673 మంది వైరస్ బారిన పడగా.. 39 మంది ప్రాణాలు కోల్పోయారు. మరోవైపు జపాన్​లో కొత్తగా 2.21 లక్షలకు పైగా కొవిడ్ కేసులు నమోదయ్యాయి.

  • ఎన్నికల్లో ఓడిపోయినా కాంగ్రెస్ సంబరాలు.. ఎందుకంటే?

ఎన్నికల్లో గెలిచిన తర్వాత అభ్యర్థి, పార్టీ సంబరాలు చేసుకోవడం సాధారణమే. అయితే ఓడిపోయిన అభ్యర్థి, పార్టీ సంబరాలు చేసుకోవడం ఎప్పుడైనా చూశారా? మధ్యప్రదేశ్ ధార్ జిల్లాలో అలాంటిదే జరిగింది. జిల్లా పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్‌, భాజపా అభ్యర్థులకు సమానంగా ఓట్లు వచ్చాయి. లాటరీ వేయగా భాజపా అభ్యర్థి గెలుపొందారు.

  • 'అత్యాచార కేసుల్లో డీఎన్‌ఏ టెస్ట్​.. తిరుగులేని సాక్ష్యం కాదు'

అత్యాచార కేసుల్లో డీఎన్​ఏ పరీక్ష ఫలితాన్ని అంతిమ సాక్ష్యంగా పరిణించకూడదని బాంబే హైకోర్టు స్పష్టం చేసింది. ఇతర ఆధారాలను ధ్రువీకరించుకోవడానికే డీఎన్​ఏ పరీక్షను ఉపయోగించుకోవాలని తెలిపింది. 14 ఏళ్ల బాలిక అత్యాచారం కేసులో నిందితుడి బెయిల్ పిటిషన్​ను తిరస్కరిస్తూ కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది.

  • అదరగొట్టిన వెయిట్​లిఫ్టర్లు..

టోక్యోలో అంచనాల్ని మించిన ప్రదర్శనతో రజతం గెలిచి అబ్బుర పరిచిన అమ్మాయి మీరాబాయి చాను. ఆ దూకుడు చూశాక కామన్వెల్త్‌ క్రీడల్లో స్వర్ణానికి తక్కువగా ఏ పతకం సాధించినా ఆమె స్థాయికి తగని ప్రదర్శనే అవుతుందంటూ భారీ అంచనాలే పెట్టుకున్నారు అభిమానులు.

  • జాన్వీ కపూర్​ లగ్జరీ ఇంటిని కొనుగోలు చేసిన స్టార్​ హీరో.. ధర ఎంతంటే?

బాలీవుడ్​ హీరో రాజ్‌కుమార్ రావ్ ఖరీదైన ఇంటిని కొనుగోలు చేశాడు. ఆ ఇల్లు అతిలోక సుందరి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్​దే అట. ఇంతకీ దాని ఖరీదు ఎంతంటే?

ABOUT THE AUTHOR

...view details