తెలంగాణ

telangana

ETV Bharat / city

Telangana News Today: టాప్​న్యూస్ @ 7AM - today telangana topnews

ఈరోజు ప్రధానవార్తలు

7AM TOPNEWS
7AM TOPNEWS

By

Published : Jul 31, 2022, 6:59 AM IST

  • ఈ వారం రాశిఫలం (జులై 31- ఆగస్టు 6)

ఈ వారం (జులై 31- ఆగస్టు 6) మీ రాశి ఫలాల గురించి డాక్టర్‌ శంకరమంచి రామకృష్ణ శాస్త్రి ఏమన్నారంటే ?

  • ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే?

ఈ రోజు రాశిఫలాల గురించి డాక్టర్‌ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ ఏమన్నారంటే..

  • తాళికట్టు 'శ్రావణ' వేళ.. మెడలో 'కల్యాణ' మాల..!

రాష్ట్రంలో నేటి నుంచి భారీగా పెళ్లిళ్లు జరగనున్నాయి. శ్రావణమాసం రావడంతో ఆగస్టు నెలలో పెద్ద సంఖ్యలో వధూవరులు ఒక్కటి కానున్నారు. ఈ ముహూర్తాలు దాటితే.. మళ్లీ నాలుగు నెలల వరకు మంచి ఘడియలు లేకపోవడమే కారణం.

  • రాష్ట్రంలో డెంగీ విజృంభణ..

రాష్ట్రంలో డెంగీ విజృంభిస్తోంది. హైదరాబాద్​ సహా 9 జిల్లాల్లో విష జర్వాలు పంజా విసురుతున్నాయి. భద్రాద్రి కొత్తగూడెం, ములుగు జిల్లాల్లోని ఏజెన్సీ ప్రాంతాలను మలేరియా వణికిస్తోంది. ప్రధానంగా హైదరాబాద్‌పై 'ఏడిస్‌ ఈజిప్టి' దోమ విరుచుకుపడుతోంది.

  • అన్నారం గేట్ల వద్ద భారీగా ఇసుక మేట..

భారీ వరదతో అన్నారం జలాశయం గేట్ల వద్ద భారీగా ఇసుక మేట వేసింది. దీంతో సుమారు 30 గేట్లను పూర్తి స్థాయిలో నిర్వహించలేని పరిస్థితి ఏర్పడింది. ఆగస్టులో కూడా గోదావరికి వరద వచ్చే అవకాశముండటంతో.. ఈలోగా ఇసుకను తొలగించడానికి ఉన్న అవకాశాలను అధికారులు పరిశీలిస్తున్నారు

  • పందెం మీది.. కమీషన్ మాది..

క్యాసినో.. పందెపురాయుళ్ల జేబు గుల్ల చేస్తుంది. ఏజెంట్లకు కాసుల వర్షం కురిపిస్తోంది. ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) దాడులతో ఒక్కసారిగా క్యాసినో తెరపైకి వచ్చింది. దేశ, విదేశాల్లో దీనికి విపరీతమైన క్రేజ్‌. ఇక్కడ అది నిషేధం కావటంతో విదేశాల్లో ఆడేందుకు ఎంతోమంది అక్కడకు వెళ్లి వస్తుంటారు.

  • రెండు రాష్ట్రాల్లో రాజకీయ ప్రకంపనలు..

ఝార్ఖండ్‌కు చెందిన ముగ్గురు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు పెద్ద మొత్తంలో నగదుతో బంగాల్‌ పోలీసులకు పట్టుబడ్డారు. ఎమ్మెల్యేల వద్ద పట్టుబడ్డ సొమ్ము ఎక్కడి నుంచి వచ్చిందో కాంగ్రెస్‌ వివరణ ఇవ్వాలని ఝార్ఖండ్‌లో అధికార జేఎంఎం, విపక్ష భాజపా డిమాండ్‌ చేస్తున్నాయి.

  • ఒకే ఊర్లో ఒకే రోజు ఆరు ఇళ్లలో చోరీలు..

రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లిలో దొంగలు రెచ్చిపోయారు. తాళం వేసి ఉన్న ఇళ్లనే లక్ష్యంగా చోరీకి తెగబడ్డారు. ఒకే రోజు ఆరు ఇళ్లను దోచుకుని.. ఊరంతా ఉలిక్కిపడేలా చేశారు. ఈ చోరీల ఘటనతో..స్థానికులు భయంతో వణికిపోతున్నారు.

  • 'అరె మావ ఏక్​ పెగ్గులా'..

ఏపీలో కొత్తగా బార్ల ఏర్పాటుకు సంబంధించిన వేలం పాటకు పలు జిల్లాలో విశేష స్పందన లభిస్తోంది. చిన్న పట్టణాల్లోనే రూ.కోటికి పైగా ధరలు పలుకుతున్నాయి. నేటి నుంచి మూడేళ్లపాటు ఈ బార్లు కొనసాగనున్నాయి.

  • మీరాబాయి సరికొత్త చరిత్ర.. కామన్వెల్త్​లో స్వర్ణం

కామెన్వెల్త్​ క్రీడల్లో భారత వెయిట్​లిఫ్టింగ్​ క్రీడాకారులు జోరు ప్రదర్శిస్తున్నారు. ఇప్పటికే రెండు పతకాలు(రజతం, కాంస్యం) రాగా ఇప్పుడు స్టార్ వెయిట్​లిఫ్టర్​ మీరాబాయ్​ చాను ఏకంగా స్వర్ణ పతకాన్ని ముద్దాడింది.

ABOUT THE AUTHOR

...view details