ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు'అధీర్' వ్యాఖ్యలపై పార్లమెంటులో దుమారం BJP Mps Protest: రాష్ట్రపతి ద్రౌపదీ ముర్మును ఉద్దేశించి కాంగ్రెస్ లోక్‌సభాపక్ష నేత అధీర్ రంజన్ చౌధరీ చేసిన వ్యాఖ్యలపై ఉభయసభల్లో తీవ్ర దుమారం రేగింది. రాష్ట్రపతిని కించపరిచేలా వ్యాఖ్యానించిందుకు కాంగ్రెస్ పార్టీ క్షమాపణ చెప్పాలంటూ భాజపా ఎంపీలు పార్లమెంటు ఆవరణలో ఆందోళన చేపట్టారు. ఈ ఆందోళనలో కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌తోపాటు మహిళా ఎంపీలు పాల్గొన్నారు. చికోటి ప్రవీణ్, మాధవరెడ్డిలకు ఈడీ నోటీసులుక్యాసినో వ్యవహారంలో కీలక సూత్రధారి చికోటి ప్రవీణ్ ఇంట్లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సోదాలు ముగిశాయి. విచారణకు రావాల్సిందిగా ఈడీ అధికారులు వారికి నోటీసులు ఇచ్చారు. ప్రముఖులు, సెలబ్రిటీలతో ప్రవీణ్‌కు సంబంధాలున్నట్లు ఈడీ అధికారులు గుర్తించారు. 10 మంది సినీ తారలను నేపాల్‌కు రప్పించినట్లు.. అంతకుముందు వారితో చికోటి ప్రవీణ్ ప్రమోషన్ వీడియోలు చేయించినట్లు తెలుస్తోంది.ఆడుకుందాం.. నేనెళ్తున్నా.. మీరొస్తారా..! హైదరాబాద్‌లో సంచలనం సృష్టించిన క్యాసినో వ్యవహారంలో కీలక అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. ప్రముఖులు, సెలబ్రిటీలతో చికోటి ప్రవీణ్‌కు ఉన్న సంబంధాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ఈ క్రమంలోనే క్యాసినోకు ముందు సినీతారలతో ప్రవీణ్ చేయించిన ప్రమోషన్ వీడియోలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. బాలీవుడ్ హీరోయిన్ అమీషా పటేల్, టాలీవుడ్ బ్యూటీ ఈషారెబ్బలతో చేయించిన ఈ వీడియోలు నెట్టింట తెగ హల్చల్ చేస్తున్నాయి.జలపాతం వద్ద పోటెత్తిన వరద.. కొట్టుకుపోయిన ముగ్గురు మహిళలు!తమిళనాడు.. తెన్‌కాశిలో ఉన్న కుర్తాళం జలపాతం వద్ద ఘోర ప్రమాదం జరిగింది. గత కొద్దిరోజులుగా కేరళలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ఒక్కసారిగా వరద పోటెత్తింది. అక్కడే ఉన్న ముగ్గురు మహిళలు నీటిలో కొట్టుకుపోయారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది.. రెండు మృతదేహాల్ని వెలికితీశారు. మరో మహిళను కాపాడారు. అదే సమయంలో కొందరు పర్యటకులు.. ప్రమాద దృశ్యాలను కెమెరాల్లో బంధించారు. ప్రస్తుతం ఆ వీడియో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది.11 ఏళ్ల బాలికపై గ్యాంగ్‌రేప్.. 11 ఏళ్ల బాలికపై కొందరు యువకులు పలుమార్లు సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన మహారాష్ట్రలో జరిగింది. ఫిర్యాదు అందుకున్న పోలీసులు.. తొమ్మిది మందిని అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు, కేరళలో నాలుగేళ్ల చిన్నారిపై 69 ఏళ్ల వృద్ధుడు లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు.కుక్కను మింగేసిన 13 అడుగుల పైథాన్రాజస్థాన్ కోటాలో 13 అడుగుల పైథాన్ హల్చల్ చేసింది. థర్మల్ కాంప్లెక్స్ సమీపంలో ఓ కుక్కను మింగేసింది. అనంతరం పాము అడవిలోకి వెళ్లిపోయింది. మరోవైపు, కర్ణాటక చామరాజనగర్‌లోని మొరార్జీ దేశాయ్ రెసిడెన్షియల్ పాఠశాల ఆవరణలోకి ఓ ఏనుగు ప్రవేశించి బీభత్సం సృష్టించింది. అటవీ అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని ఏనుగును బెదరగొట్టేందుకు గాల్లోకి కాల్పులు జరిపారు. ఓటీపీ నమోదు చేస్తేనే రూ.10 వేలకు మించి నగదు ఉపసంహరణ ఏటీఎంల వద్ద జరిగే మోసాలను నివారించేందుకు ఎస్బీఐ ఓటీపీ విధానాన్ని తీసుకొచ్చింది. రూ.10 వేలకు మించి నగదు ఉపసంహరించాలంటే వినియోగదారులు తప్పనిసరిగా ‘బ్యాంకులో నమోదైన మొబైల్ నంబరు’కు వచ్చే ఓటీపీని నమోదు చేయాల్సి ఉంటుందని తెలిపింది. ఒక ఓటీపీ ద్వారా ఒకే లావాదేవీ చేసేందుకు మాత్రమే వీలవుతుందని స్పష్టం చేసింది.ఏపీ, తెలంగాణలో బంగారం ధర ఎంతో తెలుసా?Gold Price Today: ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో పది గ్రాముల పసిడి, కిలో వెండి ధరలు ఎంత ఉన్నాయంటే?ఆసియా కప్ వేదిక మార్పు.. ఎక్కడంటే? Asia cup 2022: ఆసియా కప్ నిర్వహణపై ఏషియన్ క్రికెట్ కౌన్సిల్ అధికారిక ప్రకటన విడుదల చేసింది. శ్రీలంకలో సంక్షోభం నెలకొన్న నేపథ్యంలో వేదికను యూఏఈకి తరలిస్తున్నట్లు అధ్యక్షుడు జైషా పేర్కొన్నారు. ప్రపంచకప్ దగ్గరపడుతున్న నేపథ్యంలో ఆసియా జట్లకు ఈ టోర్నీ కీలకంగా మారనుందని తెలిపారు."ఇంద్ర సినిమా వల్లే అది సాధ్యమైంది.. లేదంటే..'Chiranjeevi Indra movie: బ్లాక్‌బస్టర్ సినిమా 'ఇంద్ర'లో తాను నటించకపోవడానికి గల కారణాన్ని చెప్పారు పరుచూరి గోపాలకృష్ణ . ఆ సినిమా సమయంలో జరిగిన సందర్భాలను గుర్తుచేసుకున్నారు. ఆ విశేషాలివీ..