ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలువిశ్వ వేదికపై మరోసారి చరిత్ర సృష్టించిన నీరజ్ చోప్రా ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్స్‌లోనూ ఒలింపిక్ ఛాంపియన్, భారత స్టార్ అథ్లెట్ నీరజ్ చోప్రా సత్తా చాటాడు. ఆదివారం ఉదయం జరిగిన జావెలిన్ త్రో ఫైనల్లో.. రెండో స్థానంలో నిలిచి రజతం సొంతం చేసుకున్నాడీ 24 ఏళ్ల స్టార్. డిఫెండింగ్ ఛాంపియన్, గ్రెనెడాకు చెందిన అండర్సన్ పీటర్స్ మరోసారి విజేతగా నిలిచి స్వర్ణం దక్కించుకున్నాడు. ప్రతిసారీ గోల్డ్ గెలవలేనుప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్స్‌లోనూ ఒలింపిక్ ఛాంపియన్, భారత స్టార్ అథ్లెట్ నీరజ్ చోప్రా సత్తా చాటాడు. ఆదివారం ఉదయం జరిగిన జావెలిన్ త్రో ఫైనల్లో.. రెండో స్థానంలో నిలిచి రజతం సొంతం చేసుకున్నాడీ 24 ఏళ్ల స్టార్. ప్రతీసారీ స్వర్ణం గెలవలేనని.. కానీ ఆ పతకం సాధించేందుకు చేయగలిగింది చేస్తానని అన్నాడు.'ఆ 5 గ్రామాలు తెలంగాణలో కలపాల్సిందే..' భద్రాద్రి జిల్లా ఏపీ-తెలంగాణ సరిహద్దు వద్ద పలు గ్రామాల ప్రజలు ఆందోళనకు దిగారు. ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న తమ గ్రామ పంచాయతీలను తెలంగాణలో కలపాలంటూ ధర్నా చేపట్టారు. విషయం తెలుసుకున్న ఇరు రాష్ట్రాల పోలీసులు అక్కడికి చేరుకున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.ఎలా ఉన్న రాష్ట్రాన్ని ఎట్ల చేసిండ్రుఉద్యోగులు, పెన్షన్‌దారులకు ప్రతినెలా 1న జీతాలు చెల్లించాలని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ డిమాండ్ చేశారు. ప్రతి నెల ఒకటో తారీఖున జీతాలు పొందడం వారి రాజ్యాంగపు హక్కు అని స్పష్టం చేశారు. ఆర్థిక అత్యవసర పరిస్థితి విధిస్తే తప్పు వేతనాల చెల్లింపులో ఆలస్యం చేయకూడదని చెప్పారు.ఎస్సారెస్పీ నుంచి నీటి విడుదల భారీ వర్షాలతో నిండుకుండలా మారిన ఎస్సారెస్పీ ప్రాజెక్టు నుంచి అధికారులు నీటి విడుదల కొనసాగిస్తున్నారు. 18 గేట్ల ద్వారా 61 వేల క్యూసెక్కుల నీటిని బయటకు వదులుతున్నారు. ఎస్కేప్ గేట్ల ద్వారా 2,500 క్యూసెక్కులు.. కాకతీయ కాలువ ద్వారా 3,500 క్యూసెక్కులు.. వరద కాలువ ద్వారా 5,000 క్యూసెక్కులు దిగువకు విడుదల చేస్తున్నారు.ఆస్పత్రిలో పసికందు మృతి.. కుటుంబం ఆందోళన.. చివరకు..నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో పసికందు మృతిపై కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. తమ బాబును కాకుండా మృత శిశువును అప్పగిస్తున్నారని ఆరోపించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఆస్పత్రికి చేరుకున్నారు.ఎనిమిదేళ్ల బాలికపై.. స్కూల్ టాయిలెట్లో అత్యాచారం! నాలుగో తరగతి చదువుతున్న విద్యార్థినిపై అత్యాచారానికి పాల్పడ్డాడు ఓ కామాంధుడు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లో జరిగింది. మరోవైపు హిందువునని నమ్మించి ఓ అమ్మాయిని ప్రేమలోకి దింపాడు ఓ వ్యక్తి. గత ఐదేళ్లుగా శారీరకంగా ఆమెను వాడుకున్నాడు. బ్లాక్మెయిల్ చేసి ప్రియురాలి సోదరిపైనా అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఈ దారుణం ఝూర్ఖండ్లోని సిమ్డేగాలో జరిగింది.బర్త్‌డే పార్టీకి వెళ్లొస్తుండగా విషాదం.. ఒకే కుటుంబంలో ఐదుగురు దుర్మరణంబంధువుల ఇంట్లో బర్త్‌డే పార్టీకి వెళ్లొస్తుండగా ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కర్ణాటకలో జరిగిన ఈ ఘటనలో ఒకే కుటుంబంలోని ఐదుగురు మృతి చెందారు. మరో ఘటనలో కారు డివైడర్‌ను ఢీకొనగా.. ముగ్గురు పోలీసులు ప్రాణాలు కోల్పోయారు.మత్స్యకారుడి వలకు చిక్కిన అరుదైన చేప మత్స్యకారుడి వలలో పడిన తెలియా జాతికి చెందిన ఓ చేప భారీ ధర పలికింది. 32 కేజీల బరువున్న ఈ చేపను కోల్‌కతాకు చెందిన ఓ ఫార్మసీ కంపెనీ రూ.3.10 లక్షలకు కొనుగోలు చేసింది. తెలియా చేపలో ఔషధ గుణాలు పుష్కలంగా ఉంటాయి. అందువల్లే అంత ధర పలికిందని మత్స్యకారులు చెబుతున్నారు. ఈ ఘటన ఒడిశా భద్రక్ జిల్లాలో శుక్రవారం జరిగింది. ధమారా నదిలో దొరికిన ఈ చేపను చాందినిపల్ చేపల మార్కెట్లో వేలం వేయగా ఈ భారీ ధర పలికింది.కల నిజమైన వేళమనం అనుకున్నది ఏదైనా జరిగితే కల నిజమైందంటూ ఎగిరి గంతేసినంత పనిచేస్తాం కదూ.. ఈ నాయికలకు కూడా ఒకప్పుడు కొన్ని కలలు ఉండేవట. ఇంతకీ అవేంటో ఆ కలలు నిజమైన సందర్భాలెప్పుడో చూద్దామా..