తెలంగాణ

telangana

ETV Bharat / city

Telangana News Today: టాప్‌ న్యూస్ @1PM - ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

1pm topnews
1pm topnews

By

Published : Jul 17, 2022, 12:58 PM IST

  • చరిత్ర సృష్టించిన భారత్​..

కరోనా టీకా పంపిణీలో భారత్​ మరో మైలురాయి సాధించింది. ఇప్పటివరకు 200 కోట్లకుపైగా వ్యాక్సిన్​ డోసులు పంపిణీ చేసింది. 2021 జనవరి 16న భారత్​లో కరోనా వ్యాక్సినేషన్​ డ్రైవ్​ ప్రారంభమైంది.

  • సింగపూర్​ ఓపెన్​ విజేతగా సింధు..

భారత స్టార్​ షట్లర్​ పీవీ సింధు సింగపూర్​ ఓపెన్​ టైటిల్​ గెల్చుకుంది. 21-9, 11-21, 21-15 తేడాతో చైనాకు చెందిన వాగ్​ యీని ఓడించింది. దీంతో ఈ సీజన్​లో తొలి సూపర్​ 500 టైటిల్​ను దక్కించుకుంది డబుల్​ ఒలింపిక్ మెడలిస్ట్​ అయిన సింధు. ఆసియా ఛాంపియన్​షిప్స్​ గోల్డ్​ మెడలిస్ట్​, 22 ఏళ్ల వాంగ్​.. సింధు ముందు తేలిపోయింది.

  • గోదారమ్మకు శాంతి పూజలు చేసిన సీఎం కేసీఆర్

ముఖ్యమంత్రి కేసీఆర్ భద్రాచలంలో పర్యటిస్తున్నారు. గోదావరి పరిసరాలు పరిశీలించిన సీఎం.. ముంపు బాధితులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. అంతకుముందు గోదారమ్మకు శాంతిపూజలు నిర్వహించారు.

  • 'వరద ముంపు బాధితుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా'

వరద ముంపు బాధితుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని గవర్నర్ తమిళిసై తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలంలోని గోదావరి వరద ముంపు బాధితులను ఆమె పరామర్శించారు.

  • లారీ బీభత్సం.. బస్సు, కారును ఢీకొట్టి.. కాలువలోకి..

జగిత్యాల పట్టణంలో ఓ లారీ బీభత్సం సృష్టించింది. ఆర్టీసీ బస్సు, కారును ఢీ కొట్టి రోడ్డు పక్కన ఉన్న చిన్న కాలువలో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్ మృతి చెందగా బస్సులో ప్రయాణికులు క్షేమంగా బయటపడ్డారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

  • ఎమ్మెల్యే కారు చోరీ..

ఎమ్మెల్యే కారును దొంగిలించారు గుర్తు తెలియని వ్యక్తులు. ఈ ఘటన రాజస్థాన్​లోని జరిగింది. దొంగల కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు.

  • ఫోన్​ దొంగను చితకబాదిన యువతి.. వీడియో వైరల్​

హరియాణా సోనీపత్​లో దొంగను చితకబాదింది ఓ యువతి. స్కూటీపై వచ్చిన ముగ్గురు దొంగలు.. రోడ్డుపై వెళ్తున్న యువతి వద్ద నుంచి ఫోన్ దొంగిలించి పారిపోయారు. అప్రమత్తమైన యువతి కేకలు వేయడం వల్ల స్థానికులు.. దొంగలను పట్టుకున్నారు. దీంతో యువతి సహా స్థానికులు దొంగను దాదాపు 40 నిమిషాల పాటు చితకబాదారు.

  • అరుదైన శ్వేతనాగు ప్రత్యక్షం.. ఎక్కడంటే?

కర్ణాటక శివమొగ్గలో ఓ అరుదైన పాము కనిపించింది. పూర్తిగా తెలుపు రంగులో ఉన్న కోబ్రా తీర్థహల్లిలోని గార్డెన్​లో కనిపించింది. సాధారణంగా కోబ్రాలు గోధుమ, నలుపు రంగుల్లో ఉంటాయి. ఈ అరుదైన శ్వేతనాగును అల్బినో కోబ్రాగా పిలుస్తారు.

  • రోజులో మనిషి పీల్చుకునే ఆక్సిజన్ ఎంతో తెలుసా?

మీరు రోజూ ఎంత గాలి పీల్చుకుంటున్నారో, రోజుకు ఎన్నిసార్లు శ్వాస తీసుకుంటున్నారో ఎప్పుడైనా లెక్కించారా? ఆరోగ్యవంతులైన వారు నిమిషానికి 16 సార్లు శ్వాస తీసుకుంటారని అధ్యయనాలు చెబుతున్నాయి. కరోనా ప్రభావం శ్వాస సంబంధిత రోగులపై అధికంగా ఉన్న వేళ మీ ఊపిరితిత్తులు బాగా పనిచేస్తున్నాయో లేదో తెలుసుకోవడం ముఖ్యం.

  • ట్విట్టర్​ సీఈఓకు మస్క్ వార్నింగ్​..

టెస్లా సీఈఓ ఎలాన్​ మస్క్, ట్విట్టర్​ వివాదంలో తాజాగా మరో ఆసక్తికరమైన విషయం వెలుగులోకి వచ్చింది. డీల్‌ను రద్దు చేసుకోవడానికి ముందే మస్క్‌.. ట్విట్టర్​ సీఈఓ పరాగ్‌ అగర్వాల్‌కు ఓ సందేశం పంపినట్లు తెలుస్తోంది. కొనుగోలు కోసం తాను సమీకరిస్తున్న నిధుల వనరులకు సంబంధించిన కీలక సమాచారాన్ని ట్విట్టర్​ న్యాయవాదులు అడుగుతున్నారని ఆయన దాంట్లో పేర్కొన్నారు.

ABOUT THE AUTHOR

...view details