తెలంగాణ

telangana

ETV Bharat / city

Telangana News Today: టాప్‌ న్యూస్ @1PM - ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

1PM TOPNEWS
1PM TOPNEWS

By

Published : Jul 15, 2022, 12:59 PM IST

  • ఇకమీదట పార్లమెంట్‌లో ధర్నా, నిరసనలకు నో..

పార్లమెంట్‌ ఆవరణలో ధర్నాకు అనుమతి ఉండదంటూ రాజ్యసభ సెక్రటరీ జనరల్‌ పీసీ మోదీ ఉత్తర్వులు జారీ చేశారు. ఇందుకోసం సభ్యలందరూ సహకరించాలని ఆయన కోరారు.

  • భద్రాద్రిలో 69 అడుగులకు చేరిన నీటిమట్టం..

గోదావరి మహోగ్ర రూపం దాల్చింది. భారీ వర్షాలతో ప్రవాహ ఉద్ధృతి మరింత పెరిగి భద్రాచలం జలదిగ్బంధమైంది. తాజా పరిస్థితులపై సీఎం కేసీఆర్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. సహాయక చర్యలు వేగవంతం చేయాలని సీఎస్​కు సూచించారు.

  • కాళేశ్వరానికి రికార్డు స్థాయిలో వరద..

కాళేశ్వరం ప్రాజెక్టుకు రికార్డు స్థాయిలో వరద వచ్చి చేరుతుంది. మేడిగడ్డ బ్యారేజీ ఇన్‌ఫ్లో, ఔట్‌ఫ్లో 28,62,390 క్యూసెక్కులు కాగా.. మొత్తం 85 గేట్ల ద్వారా నీటిని విడుదల చేస్తున్నారు. అన్నారం బ్యారేజీ ఇన్‌ఫ్లో, ఔట్‌ఫ్లో 11,39,665 క్యూసెక్కులు కాగా.. 66 గేట్ల ద్వారా నీటి విడుదల చేస్తున్నారు.

  • పార్లమెంటు సమావేశాల దృష్ట్యా రేపు తెరాస ఎంపీలతో సీఎం కేసీఆర్​ భేటీ

ఈ నెల 18 నుంచి జరగనున్న పార్లమెంటు సమావేశాల దృష్ట్యా.. రేపు మధ్యాహ్నం ఒంటిగంటకు ప్రగతిభవన్‌లో ఎంపీలతో సీఎం భేటీ కానున్నారు. ఉభయ సభల్లో తెరాస నేతలు అనుసరించాల్సిన విధివిధానాలపై ఎంపీలకు సీఎం దిశానిర్దేశం చేయనున్నారు.

  • ఏపీ, తెలంగాణలో భారీగా తగ్గిన వెండి ధర..

దేశంలో బంగారం ధర స్వల్పంగా తగ్గగా.. వెండి ధర భారీగా తగ్గింది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్​, తెలంగాణలో పది గ్రాముల పసిడి.. కిలో వెండి ధరలు ఎంత ఉన్నాయంటే?

  • దేశంలోనే టాప్ విద్యాసంస్థగా ఐఐటీ మద్రాస్​..

కేంద్ర విద్యాశాఖ జాతీయ ర్యాంకుల్లో మరోసారి ఐఐటీ మద్రాస్ హవా కొనసాగింది. 2022 ఏడాదికి సంబంధించి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ జాతీయ ర్యాంకులను విడుదల చేయగా ఐఐటీ మద్రాస్ వరుసగా నాలుగో ఏడాదీ దేశంలోని అత్యుత్తమ విద్యాసంస్థగా నిలిచింది. తర్వాతి స్థానాల్లో ఐఐఎస్​సీ బెంగళూరు, ఐఐటీ బాంబే ఉన్నాయి.

  • గంగానది దాటేందుకు యత్నం.. వరదలో కొట్టుకుపోయిన యువకుడు..

గంగా నదిని దాటేందుకు ముగ్గురు యువకులు ప్రయత్నించారు. అందులో ఇద్దరు యువకులు ఒడ్డుకు చేరుకోగా, సాహిల్​ అనే మరో యువకుడు నదిలో కొట్టుకుపోయాడు. వెంటనే అప్రమత్తమైన సహాయక సిబ్బంది.. యువకుడిని కాపాడారు. దీంతో త్రుటిలో ప్రమాదం తప్పింది.

  • కోహ్లీపై పాక్​ సారథి కామెంట్​..

ఫామ్​లేమితో ఇబ్బంది పడుతున్న టీమ్​ఇండియా మాజీ కెప్టెన్​ కోహ్లీ గురించి పాక్​ సారథి బాబర్​ అజామ్​ ఓ ట్వీట్ చేశాడు. ప్రస్తుతం ఆ ట్వీట్​ నెట్టింట్లో వైరల్​గా మారింది.

  • రూ.లక్షన్నర కోట్లు దానం చేసిన బిల్​గేట్స్​..

ప్రపంచ కుబేరుడు, మైక్రోసాఫ్ట్​ సహ వ్యవస్థాపకుడు బిల్​గేట్స్ తన సంపదలో 20 బిలియన్‌ డాలర్లు (సుమారు లక్షన్నర కోట్ల)ను బిల్‌ అండ్‌ మిలిందా గేట్స్‌ సంస్థకు అందజేస్తానని ప్రకటించారు. దీంతో ప్రపంచ సంపన్నుల జాబితా నుంచి త్వరలోనే బయటకు వస్తానని వెల్లడించారు.

  • గొటబాయ రాజీనామాకు స్పీకర్ ఆమోదం.. 7 రోజుల్లో కొత్త అధ్యక్షుడు

శ్రీలంక అధ్యక్షుడు గొటబాయ రాజపక్స రాజీనామాను స్పీకర్​ మహింద అభయ్‌వర్ధన్‌ ఆమోదించారు. వారం రోజుల్లోగా తదుపరి అధ్యక్షుడిని ఎన్నుకుంటామని ఈ సందర్భంగా వెల్లడించారు. ఇందుకు సంబంధించిన ప్రక్రియ రేపటి నుంచి ప్రారంభమవుతుందని తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details