తెలంగాణ

telangana

ETV Bharat / city

Telangana News Today: టాప్​న్యూస్ @11AM - ఇప్పటివరకు ఉన్న ప్రధానవార్తలు

ఇప్పటివరకు ఉన్న ప్రధానవార్తలు

11AM TOPNEWS
11AM TOPNEWS

By

Published : Jul 14, 2022, 10:58 AM IST

  • కలవరపెట్టిన కడెం.. ఎట్టకేలకు తప్పిన ముప్పు

కడెం ప్రాజెక్టు వద్ద ఊహించని వరద విపత్తుతో.... ప్రాజెక్టు నిర్వహణ మరోసారి సర్వత్రా చర్చనీయంగా మారింది. ఇవాశ వరద కాస్త తగ్గుముఖం పట్టడంతో ఏ క్షణం ఏం జరుగుతుందోనని భయాందోళన చెందుతోన్న ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజలు కడెం జలాశయానికి ముప్పు తప్పిందని ఊపిరిపీల్చుకున్నారు.

  • గోదావరి ఉగ్రరూపం.. భద్రాచలం వద్ద మూడో ప్రమాద హెచ్చరిక జారీ

గోదావరికి వస్తున్న వరద కలవరానికి గురి చేస్తోంది. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో గోదావరికి, ఉపనదుల్లోకి వరదనీరు భారీగా వచ్చి చేరుతోంది. వీలైనంత ఎక్కువ నీటిని దిగువకు వదులుతున్నందున లోతట్టు, దిగువ ప్రాంతాలకు ముప్పు తప్పడం లేదు. ప్రాజెక్టులు జలకళ సంతరించుకుని నిండుకుండను తలపిస్తున్నాయి.

  • జలదిగ్బంధంలో ఏజెన్సీ గ్రామాలు..

రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలతో ఏజెన్సీ గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. రాకపోకలు నిలిచిపోవడంతో అక్కడి ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గ్రామాలు నీటమునగడంతో నాలుగైదు రోజులుగా విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది. తిండి తప్పలు లేక.. తాగడానికి మంచినీళ్లు కూడా లేక ప్రజలు అవస్థలు పడుతున్నారు.

  • గుర్రాలపై వెళ్లి రక్షించిన అధికారులు

వరదనీరు మంచిర్యాలను ముంచెత్తింది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలకు తోడు రాళ్లవాగు బ్యాక్​ వాటర్ వరద తోడవడంతో... పట్టణంలో 10 కాలనీలు నీటమునిగాయి. వరదలో చిక్కుకున్న వారిని తెప్పలు, గుర్రాలపై సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. కలెక్టర్ భారతి హోళీ కేరి, డీసీపీ అఖిల్ మహాజన్ స్వయంగా వెళ్లి సహాయక చర్యలను పర్యవేక్షించారు.

  • వరద సహాయక చర్యల్లో విషాదం..

కుమురం భీం జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. వరద సహాయక చర్యల్లో పాల్గొనేందుకు వచ్చి గల్లంతైన రెస్క్యూ సిబ్బందిలో ఇద్దరు మృతిచెందారు. ఈ ఘటనతో ఇరు కుటుంబాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి.

  • సీజనల్ వ్యాధులతో.. జరంత జాగ్రత్త

హైదరాబాద్​లో డెంగీ కేసులు పెరుగుతుండటంతో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అప్రమత్తమైంది. వర్షాల కారణంగా సీజనల్‌ వ్యాధులు విజృంభిస్తున్నందున తీసుకోవాల్సిన జాగ్రత్తలపై హైదరాబాద్‌ జిల్లా సర్వైలెన్స్‌ అధికారి డాక్టర్‌ శ్రీహర్ష వివరించారు. సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు.

  • ఫ్లాట్​గా బంగారం, వెండి.. ఏపీ, తెలంగాణలో ధరలు ఇలా..

దేశంలో బంగారం, వెండి ధర స్వల్పంగా పెరిగింది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్​, తెలంగాణలో పది గ్రాముల పసిడి.. కిలో వెండి ధరలు ఎంత ఉన్నాయంటే?

  • కరోనా విలయం.. కొత్తగా 20వేల కేసులు..

భారత్​లో కరోనా కేసులు భారీగా పెరిగాయి. తాజాగా 20,139 మంది కొవిడ్ బారినపడ్డారు. 38 మంది మహమ్మారితో ప్రాణాలు కోల్పోయారు.

  • కోహ్లీ ఫామ్​పై గంగూలీ కీలక వ్యాఖ్యలు.. ఆ పని చేస్తే చాలంటూ..

భారత మాజీ కెప్టెన్​ విరాట్​ కోహ్లీ ఫామ్​పై తీవ్ర విమర్శల నేపథ్యంలో అతడికి అండగా నిలిచాడు బీసీసీఐ ప్రెసిడెంట్​ సౌరభ్​ గంగూలీ. ప్రతి ఆటగాడికి ఇలాంటి క్లిష్ట పరిస్థితులు ఎదురవుతాయని అన్నాడు.

  • 'అరె.. అచ్చం దీపికలా ఉందే..! ఆమె చెల్లెలేనా?'

రిజుతా.. డిజిటల్‌ క్రియేటర్‌. 2015లో ఇన్‌స్టాగ్రామ్‌లో అడుగుపెట్టిన ఆమె కొన్నాళ్లు ఎక్కువగా వృత్తిపరమైన విశేషాలను పంచుకునేవారు. క్రమంగా తన స్టిల్స్‌ను షేర్‌ చేయడం ప్రారంభించారు. వాటిల్లో కొన్ని దీపికను తలపించేలా ఉండటంతో ఆమె ఫొటోలు నెట్టింట చక్కర్లు కొట్టేవి. అలా 'ఈమె ఎవరో తెలుసుకుందాం' అంటూ ఆమె సోషల్‌ మీడియా ప్రొఫైల్స్‌ చూసిన నెటిజన్లు థ్రిల్ అవుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details