తెలంగాణ

telangana

ETV Bharat / city

Telangana News Today : టాప్​న్యూస్​ @ 7AM - తెలంగాణ న్యూస్ టుడే

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

Telangana News Today
Telangana News Today

By

Published : Jul 5, 2022, 6:58 AM IST

  • తెలంగాణ.. స్టార్టప్​ సూపర్​స్టార్​

దేశంలో స్టార్టప్స్‌ను ప్రోత్సహించే టాప్‌ పెర్ఫార్మర్స్‌ రాష్ట్రాల ర్యాంకులను కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్‌ గోయల్‌ విడుదల చేశారు. ఈ జాబితాలో తెలంగాణ మొదటి స్థానంలో నిలిచింది. రాష్ట్రాల పనితీరును లెక్కించడానికి కేంద్రం పరిగణనలోకి తీసుకున్న ఏడు అంశాల్లో నాలుగింట తెలంగాణ లీడర్‌ జాబితాలో చోటు సంపాదించుకొంది.

  • జేఈఈ మెయిన్​ ఫస్ట్ ర్యాంక్ మనదే

జేఈఈ మెయిన్‌ తొలి విడతలో హైదరాబాద్‌కు చెందిన ఓ విద్యార్థి 300కు 300 మార్కులు సాధించబోతున్నాడు. ఎన్​టీఏ ఇటీవల విడుదల చేసిన ప్రాథమిక కీ ప్రకారం చూస్తే అతడు 300 మార్కులు పొందనున్నట్లు తెలిసింది. ఫలితంగా జేఈఈ మెయిన్‌ ప్రథమ ర్యాంకుల్లో ఒకటి రాష్ట్రానికీ రానుంది.

  • జిల్లాకో సంక్షేమ స్టడీ సర్కిల్‌

రాష్ట్రంలో కొత్త జిల్లాల ప్రాతిపదికన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంక్షేమ శాఖల వారీగా ఈ కేంద్రాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం 80 వేలకు పైగా ఉద్యోగాలను భర్తీ చేయాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో గ్రూప్‌-1, పోలీస్‌ ఉద్యోగాల శిక్షణ కోసం జిల్లాల్లో తాత్కాలిక శిక్షణ కేంద్రాలు నెలకొల్పింది.

  • భాజపా ఆపరేషన్ ఆకర్ష్

ఆపరేషన్‌ ఆకర్ష్‌ను వేగవంతం చేయాలని కమలనాథులు నిర్ణయించారు. ఈ బాధ్యతలను ముఖ్యమైన నేతలకు అప్పగించాలని భావిస్తున్నారు. ప్రస్తుతం చేరికల కమిటీ ఛైర్మన్‌గా ఇంద్రాసేనా రెడ్డి బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఆ బాధ్యతల నుంచి తనను తప్పించాలని ఇంద్రాసేనారెడ్డి కోరారు. ఈ బాధ్యతలను ఎమ్మెల్యే ఈటల రాజేందర్, కో ఛైర్మన్‌గా వివేక్ వెంకటస్వామికి అప్పగించాలనే యోచనలో భాజపా నేతలు ఉన్నారు.

  • డ్రైవర్‌ లేకుండానే.. రయ్‌ రయ్‌..

శాస్త్ర సాంకేతిక రంగాల్లో నూతన ఆవిష్కరణలు... ఊహించని మార్పులను తెచ్చిపెట్టనున్నాయి. మానవులకు మరిన్ని మెరుగైన సేవలందించేందుకు సరికొత్త సాంకేతికత అందుబాటులోకి వస్తోంది. డ్రైవర్‌ లేకుండా నడిచే కార్లు, మనుషులను మోసుకెళ్లే డ్రోన్లు, తొక్కకుండానే వెళ్లే సైకిళ్లను రూపొందిస్తూ ఐఐటి హైదరాబాద్‌ మరోసారి తన ప్రత్యేకతను చాటింది.

  • భాగ్యనగరవాసులపై వరుణుడి ప్రతాపం

హైదరాబాద్​లోని పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. ఒక్కసారిగా వరుణుడి రాకతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. రహదారులపై వర్షపు నీరు నిలిచి పలు చోట్ల ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది.

  • ఉప రాష్ట్రపతి ఎన్నికకు.. నేటి నుంచే నామినేషన్లు!

ఉప రాష్ట్రపతి ఎన్నికకు నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ నేటి నుంచి మొదలు కానుంది. కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్‌ జారీ చేసిన అనంతరం.. నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఈ నెల 19 వరకు నామపత్రాలను స్వీకరించనున్నారు.

  • స్వాతంత్య్ర దినోత్సవం పరేడ్‌పై కాల్పుల మోత.. ఆరుగురు మృతి

మరో కాల్పుల ఘటనతో అగ్రరాజ్యం అమెరికా ఉలిక్కిపడింది. చికాగో సమీపంలోని హైలాండ్ పార్కులో జరుగుతున్న స్వాతంత్య్ర దినోత్సవం పరేడ్​పై ఓ సాయుధుడు తుపాకీతో కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో ఆరుగురు దుర్మరణం చెందగా.. 24 మందికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను సమీప ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

  • చెలరేగిన ఇంగ్లాండ్ బ్యాటర్లు .. భారత్ గెలిచేనా..

గతేడాది 2–1తో ఆగిపోయిన ఐదు టెస్టుల సిరీస్‌ను ఈ మ్యాచ్‌లో నెగ్గి 2-2తో సిరీస్‌ సమం చేయాలని చూస్తోంది ఇంగ్లాండ్ జట్టు. 378 పరుగుల లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్‌ ప్రారంభించిన అతిథ్య జట్టు నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి 3 వికెట్లు కోల్పోయి 259 పరుగుల చేసింది. ఆ జట్టు విజయానికి ఇంకా 119 పరుగులు కావాలి. అంతకుముందు భారత్‌ రెండో ఇన్నింగ్స్‌లో 245 పరుగులకే ఆలౌటైంది.

  • త్వరలోనే తాప్సీ-సమంత సినిమా

హీరోయిన్​ తాప్సీ-సమంత కలిసి ఓ సినిమా చేయబోతున్నారు. ఈ విషయాన్ని తాప్సీ చెప్పింది. ఆ వివరాలు..

ABOUT THE AUTHOR

...view details