తెలంగాణ

telangana

ETV Bharat / city

Telangana News Today : టాప్​న్యూస్ @ 1PM

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

By

Published : Jul 4, 2022, 1:00 PM IST

Telangana News Today
Telangana News Today

  • 'మహా' బలపరీక్షలో నెగ్గిన సీఎం శిందే

మహారాష్ట్ర రాజకీయ సంక్షోభం ముగిసింది. నూతన ముఖ్యమంత్రి ఏక్​నాథ్​ శిందే.. సోమవారం జరిగిన బలపరీక్షలో నెగ్గారు. 164 మంది ఎమ్మెల్యేలు శిందేకు మద్దతుగా నిలిచారు. మరోవైపు, శివసేన చీఫ్​ విప్​గా సునీల్​ ప్రభును తొలగించి.. భరత్​ గోగావలేను నియమించిన నేపథ్యంలో ఠాక్రే వర్గం మరోసారి సుప్రీంకోర్టును ఆశ్రయించింది.

  • వీరుడు ఎక్కడ పుట్టినా వీరుడే

KTR Tribute to Alluri : హైదరాబాద్ ట్యాంక్​బండ్​పై రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో అల్లూరి సీతారామరాజు 125వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. మంత్రులు కేటీఆర్​, శ్రీనివాస్​ గౌడ్​, తలసాని శ్రీనివాస్​ యాదవ్​ సహా పలువురు ప్రజాప్రతినిధులు, పార్టీ నేతలు పాల్గొన్నారు. అల్లూరి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.

  • మోదీ జీ.. కేసీఆర్‌ ప్రశ్నలకు సమాధానాలేవీ?

Talasani Srinivas Yadav: సికింద్రాబాద్‌ పరేడ్‌ గ్రౌండ్స్‌లో నిర్వహించిన భాజపా బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగం చప్పగా సాగిందని మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ విమర్శించారు. ధాన్యం కొనుగోలు చేశామని ఆయన చెప్పుకోవడం సిగ్గుచేటని.. రాష్ట్రానికి కేంద్రం ఏం చేసిందో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు.

  • ఈ టిప్స్​తో.. బ్యాంకు క్లర్క్ జాబ్ కొట్టేయండి

IBPS Notification: ప్రభుత్వరంగ బ్యాంకుల్లో 6 వేలకు పైగా క్లర్కు పోస్టుల భర్తీకి ఐబీపీఎస్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. దీని ద్వారా తెలంగాణలో 99, ఆంధ్రప్రదేశ్‌లో 209 ఉద్యోగాల ఖాళీలు భర్తీ కానున్నాయి. ఈ సంఖ్య మరింత పెరగొచ్ఛు. నోటిఫికేషన్‌ విడుదల సమయంలో మొత్తం 11 బ్యాంకుల్లో నాలుగు బ్యాంకులు తమ ఖాళీల వివరాలను ఐబీపీఎస్‌కు తెలియజేయలేదు. మార్చి 31, 2023 వరకు ఖాళీల వివరాలను తెలిపే వీలుండటంతో ఆలోగా ఉండే పదవీ విరమణ.. తదితర కారణాలతో ఈ సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉంది.

  • హెచ్​ఐసీసీలో భాజపా కార్యదర్శుల సమావేశం

రెండు రోజుల పాటు జరిగిన జాతీయ కార్యవర్గ సమావేశాల తీరు, తదుపరి కార్యచరణపై హెచ్​ఐసీసీలో భాజపా సంస్థాగత వ్యవహారాల కార్యదర్శుల సమావేశం జరిగింది. సమావేశాల్లో ప్రవేశపెట్టిన తీర్మానాలను జనాల్లోకి ఎలా తీసుకెళ్లాలన్న దానిపై కార్యదర్శులకు జేపీ నడ్డా దిశానిర్దేశం చేశారు.

  • ప్రేయసితో కలిసి లాడ్జికి.. జేబులో 'శృంగార' మాత్రలు.. యువకుడు హఠాన్మరణం..

ప్రియురాలితో కలిసి లాడ్జికి వెళ్లిన ఓ యువకుడు స్పృహ తప్పి పడిపోయాడు. ఆసుపత్రికి తరలించేసరికి ప్రాణాలు కోల్పోయాడు. మృతుడి జేబులో శృంగార సామర్థ్యాన్ని పెంచే మాత్రలు పోలీసులకు లభించాయి. ఈ ఘటన మహారాష్ట్రలో జరిగింది.

  • ఇంజనీరింగ్ విద్యార్థులు హల్​చల్​.. బస్సుపై టపాసులు..

విహారయాత్రలు అంటే విద్యార్థులు ఎంతో సందడి చేస్తారు. కేరళ కొల్లంలోని పెరుమాన్​ ఇంజనీరింగ్ కాలేజ్​​ మెకానికల్ విద్యార్థులూ అదే చేశారు. అయితే, త్రుటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. సెలబ్రేషన్స్​లో భాగంగా కొంబన్​ అనే టూరిస్ట్ బస్సుపై టపాసులు వెలిగించారు సిబ్బంది. దీంతో మంటలు బస్సుకు వ్యాపించాయి. వెంటనే విద్యార్థులు, బస్సు సిబ్బంది కలిసి మంటలను ఆర్పేయడం వల్ల పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటనలో బస్సు సిబ్బందిదే తప్పు అని.. తమకు ఎటువంటి సంబంధం లేదని కళాశాల ప్రిన్సిపల్ పేర్కొన్నారు.

  • ఉమ్మడిగా హోమ్​లోన్ తీసుకుంటున్నారా?

గృహరుణ వడ్డీ రేట్లు భారీగా పెరుగుతున్నాయి. ఈ క్రమంలో రుణగ్రహీతలకు అర్హత మొత్తం తగ్గిపోతోంది. తక్కువ క్రెడిట్‌ స్కోరు ఉన్నవారు, ఆదాయం అంతగా లేని వారు.. ఇలాంటి సమయంలో ఉమ్మడి గృహరుణం తీసుకునేందుకు ప్రయత్నించవచ్చు. సాధారణంగా బ్యాంకులు దంపతులను సహ దరఖాస్తుదారులుగా అంగీకరిస్తాయి. ఆదాయం ఉన్న దగ్గరి బంధువులు లేదా కుటుంబ సభ్యులు, ఆస్తిలో సహ యాజమాన్యాన్ని కలిగిన వారితో కలిసి ఉమ్మడిగా గృహరుణం తీసుకునేందుకు వీలుంటుంది. ఇలా ఉమ్మడి రుణాలు తీసుకోవాలనుకునేప్పుడు గుర్తుంచుకోవాల్సిన అంశాలేమిటో ఓ సారి తెలుసుకుందాం..

  • మసాజ్​ చేయమని, బట్టలు ఉతకమని టార్చర్​

Dutee Chand Ragging: దేశంలోనే అత్యంత వేగవంతమైన మహిళా రన్నర్‌గా పేరున్న ద్యుతి చంద్​.. తాను ఎదుర్కొన్న వేధింపుల సమస్యను బయటపెట్టింది. తనను బలవంతంగా మసాజ్​ చేయమని, బట్టలు ఉతకమని టార్చర్​ పెట్టారని తెలిపింది.

  • షూటింగ్​లో స్టార్​ హీరోకు తీవ్ర గాయాలు

Vishal Injured: తమిళ కథానాయకుడు విశాల్​ మరోసారి షూటింగ్​లో తీవ్రంగా గాయపడ్డారని తెలిసింది. 'లాఠీ' సినిమా క్లైమాక్స్​ సన్నివేశాలు చిత్రీకరిస్తుండగా.. ఆయన ఈ ప్రమాదానికి గురయ్యారు. దీంతో వెంటనే చికిత్స కోసం ఆయన్ను ఆస్పత్రికి తరలించింది మూవీటీమ్​.

ABOUT THE AUTHOR

...view details