తెలంగాణ

telangana

ETV Bharat / city

Telangana News Today : టాప్‌న్యూస్ @ 1PM - తెలంగాణ లేటెస్ట్ న్యూస్

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

Telangana News Today
Telangana News Today

By

Published : Jun 30, 2022, 12:59 PM IST

  • 'పది' ఫలితాలు విడుదల

తెలంగాణలో పదో తరగతి విద్యార్థుల ఫలితాలు వచ్చేశాయి. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి విడుదల చేశారు. ప్రభుత్వ వెబ్​సైట్​లో ఫలితాల వివరాలు చూసుకోవచ్చని మంత్రి తెలిపారు. పది ఫలితాల్లో 90 శాతం మంది ఉత్తీర్ణులైనట్లు వెల్లడించారు. ప్రతి సంవత్సరంలాగే ఈ ఏడాది కూడా ఫలితాల్లో అమ్మాయిలు తమ సత్తా చాటారని హర్షం వ్యక్తం చేశారు.

  • ఎవరితోనూ పోల్చుకోకూడదు

తల్లిదండ్రులు పిల్లలను ఇతర పిల్లలతో పోలుస్తారు. అది వారిలో పోటీతత్వాన్ని పెంచి.. మరింత మెరుగ్గా ఉండటానికి తోడ్పడుతుంది అనుకుంటారు. కానీ చాలా మంది పిల్లలు అది అవమానకరంగా భావిస్తారు. ఆత్మన్యూనతకు గురవుతారు. కొందరు మనస్థాపానికి గురై ఆత్మహత్యలకు పాల్పడుతుంటారు. అందుకే ఎప్పుడూ పిల్లలను తోటివారితో పోల్చకూడదని అంటున్నారు మానసిక నిపుణులు.

  • అందరిచూపు రాజ్​భవన్​వైపే

మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభానికి తెరపడింది. కొత్త సర్కారు ఏర్పాటుకు మార్గం సుగమమైంది. అయితే ఇప్పుడు అందిరి కళ్లు రాజ్‌భవన్ వైపే చూస్తున్నాయి. కొత్త సీఎం ప్రమాణ స్వీకారానికి గవర్నర్​ ఎప్పుడు ఆహ్వానిస్తారు? శిందే వర్గంలో మంత్రిపదువులు ఎంతమందికి?

  • సీబీఐకి చిక్కిన రైల్వే ఉద్యోగి

దక్షిణ మధ్య రైల్వే సికింద్రాబాద్​లో విధులు నిర్వహిస్తున్న సురేశ్ కుమార్ సీబీఐ అధికారులకు చిక్కారు. ఓ ఫైల్ విష‌యంలో వ్యక్తి నుంచి రూ.10లక్షలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డారు.

  • మూడేళ్ల తర్వాత అమర్​​నాథ్ ​యాత్ర

దాదాపు మూడేళ్ల తర్వాత అమర్​నాథ్​ యాత్ర మొదలైంది. సుదీర్ఘ విరామం తర్వాత మళ్లీ మంచు లింగాన్ని దర్శించుకునే అవకాశం రావడం వల్ల పెద్ద ఎత్తున యాత్రికులు తరలివచ్చారు. మరోవైపు యాత్రలో ఎవరికైనా ఆరోగ్య సమస్యలు వస్తే వెంటనే సేవలు అందించే విధంగా అధికారులు ఏర్పాట్లు చేశారు.

  • 'ఎంఎస్​ఎంఈలకు 8 ఏళ్లలో 650% పెరిగిన కేటాయింపులు'

ఎంఎస్​ఎంఈ రంగాన్ని బలోపేతానికి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొత్త పథకాన్ని ప్రధాని మోదీ గురువారం ప్రారంభించారు. దేశంలోని చిన్న, మధ్య తరహా పరిశ్రమల అభివృద్ధికి కేంద్రం చేస్తున్న కృషిని గుర్తు చేశారు.

  • 9 రోజుల్లోనే విచారణ పూర్తి.. అత్యాచార నిందితుడికి జీవిత ఖైదు!

ఉత్తర్​ప్రదేశ్​లోని ఖైరానా ప్రత్యేక న్యాయస్థానం సంచలన తీర్పును ఇచ్చింది. తొమ్మిది రోజుల్లోనే విచారణ జరిపి.. అత్యాచార నిందితుడికి యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. మరోవైపు అయిదేళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడిన నిందితుడికి మరణ శిక్ష విధించింది త్రిపురలోని ఖోవై జిల్లా కోర్టు.

  • కవల సోదరీమణులు.. ఒకరి పేరు మీద ఒకరు

ఓ కవల సోదరీమణుల వ్యవహారం అధికారులను ఆశ్చర్యానికి గురి చేసింది. ఇద్దరి ముఖ కవలికలు ఒకే విధంగా ఉన్న నేపథ్యంలో.. దాన్ని అదునుగా చేసుకొని వారు మోసానికి పాల్పడ్డారు. చివరికి కటకటాల పాలయ్యారు. ఇంతకీ అసలేమైంది? వారు చేసిన నేరం ఏంటి? ఎక్కడ జరిగింది?

  • సింధు ఈజ్​ బ్యాక్

భారత స్టార్​ షట్లర్​ పీవీ సింధు.. మలేసియా ఓపెన్​లో మంచి ప్రదర్శన చేస్తోంది. గురువారం జరిగిన ప్రిక్వార్టర్స్​ మ్యాచ్​లో థాయ్​లాండ్​ క్రీడాకారిణిపై నెగ్గి.. క్వార్టర్​ ఫైనల్లోకి ప్రవేశించింది. పురుషుల సింగిల్స్​లో ప్రణయ్​ కూడా మరో అడుగు ముందుకేశాడు.

  • ఆసక్తిగా 'ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం'

నటుడు అల్లరినరేశ్​ నటిస్తున్న తాజా చిత్రం 'ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం'. ఆనంది కథానాయిక. తాజాగా ఈ సినిమా టీజర్​ను రిలీజ్​ చేశారు. 'ఈ ప్రచార చిత్రంలో అల్లరినరేశ్​ దెబ్బలు తింటూ కనిపించారు. ఆదివాసీల ఇతివృత్తంతో సాగే ఈ చిత్రంలో.. అల్లరి నరేశ్ ఎన్నికల విధులపై ఓ ఆదివాసి గ్రామానికి వెళ్లే స్కూల్ టీచర్‌గా కనిపించనున్నారు.

ABOUT THE AUTHOR

...view details