ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలురాష్ట్రపతి అభ్యర్థిగా యశ్వంత్ సిన్హా నామినేషన్ విపక్ష పార్టీల రాష్ట్రపతి అభ్యర్థిగా యశ్వంత్ సిన్హా నామినేషన్ వేశారు. ఆ సమయంలో ఆయన వెంట కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖర్గే, ఎన్సీపీ అధినేత శరద్ పవార్, బంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి తదితరులు ఉన్నారు.ఆ ఎమ్మెల్యేలు రూ.50 కోట్లకు అమ్ముడుపోయారుమహారాష్ట్ర రాజకీయాలు రోజుకో ములుపు తిరుగుతున్నాయి. శివసేన తిరుగుబాటు నేతలకు కేంద్రం వై- ప్లస్ కేటగిరీ భద్రతను చూస్తుంటే వారి వెనుక భాజపా ఉన్నట్లు స్పష్టంగా తెలుస్తోందని ఆ పార్టీ సొంత పత్రిక 'సామ్నా' విమర్శించింది. మరోవైపు, శాసనసభాపక్ష నేతగా తనను తొలగిస్తూ డిప్యూటీ స్పీకర్ తీసుకున్న నిర్ణయంపై సుప్రీంకోర్టులో శిందే వేసిన పిటిషన్‌పై సోమవారం విచారణ జరగనుంది.స్నానానికి నదిలో దిగి కొట్టుకుపోయిన వ్యక్తి స్నానం చేసేందుకు నదిలో దిగి కొట్టుకుపోయిన ఓ వ్యక్తిని స్థానిక యువకులు కాపాడిన సంఘటన ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌లో జరిగింది. ఆదివారం స్థానికంగా ఉన్న గంగానహర్లో స్నానానికి దిగాడు ఓ వ్యక్తి. కాసేపటికే నీటి ప్రవాహం ఎక్కువవ్వడం వల్ల కొట్టుకుపోయాడు. అది గమనించిన ముగ్గురు యువకులు వెంటనే నీటిలో దూకారు. తమ ప్రాణాలు పణంగా పెట్టి నీటిలో కొట్టుకుపోతున్న వ్యక్తిని కాపాడారు. గజ్వేల్‌కు గూడ్స్ బండిసీఎం కేసీఆర్ నియోజకవర్గ కేంద్రమైన సిద్దిపేట జిల్లా గజ్వేల్‌కు నేటి నుంచి గూడ్స్ రైలు సేవలు అందుబాటులోకి రానున్నాయి. రాష్ట్ర మంత్రులు హరీశ్‌రావు, నిరంజన్‌రెడ్డి నేడు ప్రారంభించనున్నారు. ఇందుకోసం గజ్వేల్ రైల్వే స్టేషన్‌లో ఘనంగా స్వాగత ఏర్పాట్లు చేస్తున్నారు.టోల్ ప్లాజా వద్ద ప్రమాదం.. గర్భిణికి నరకయాతన కరీంనగర్ జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ లారీ డ్రైవర్ నిర్లక్ష్యం ఫలితంగా కారులో ప్రయాణిస్తున్న గర్భిణికి తీవ్ర గాయాలై గంటపాటు నరకయాతన అనుభవించింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాలో నిక్షిప్తమయ్యాయి.కోణార్క్ ఎక్స్‌ప్రెస్‌లో పొగలుముంబయి నుంచి భువనేశ్వర్ వెళ్తున్న కోణార్క్ ఎక్స్‌ప్రెస్ రైలులో పొగలు వ్యాపించాయి. రైలును డోర్నకల్ జంక్షన్ రైల్వేస్టేషన్‌లో నిలిపివేశారు. ఏసీ బోగీలో పొగలు రావడమే ఇందుకు ప్రధాన కారణమని తెలుస్తోంది. దీనిపై రైల్వే అధికారులు విచారణ చేపట్టారు.ఆ ఘనత సాధించిన భారత ఏకైక కెప్టెన్‌గా హార్దిక్ పాండ్య ఐర్లాండ్‌తో తొలి టీ20 సందర్భంగా అరుదైన ఘనత సాధించాడు టీమ్ఇండియా సారథి హార్దిక్ పాండ్య. టీ20ల్లో వికెట్ తీసిన భారత తొలి కెప్టెన్‌గా రికార్డులకెక్కాడు.తల్లి కాబోతున్న ఆలియా భట్బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్ గుడ్ న్యూస్ చెప్పింది. తాను తల్లికాబోతున్నట్లు సోషల్‌మీడియా వేదికగా వెల్లడించింది.రామ్-శివకార్తికేయన్ మల్టీస్టారర్ రామ్ పోతినేని-బోయపాటి శ్రీను కాంబినేషన్లో రానున్న సినిమాకు సంబంధించి ఓ క్రేజీ అప్డేట్ సినీవర్గాల్లో చక్కర్లు కొడుతోంది. ఈ సినిమా మల్టీస్టారర్‌గా తెరకెక్కనుందని, ఇందులో రామ్‌తో పాటు తమిళ హీరో శివకార్తికేయన్ కూడా నటించనున్నట్లు తెలుస్తోంది. అవి తినడం వల్లేనా గీత.. ఇంత 'మధురం'గా పాడేది?'వియ్ లవ్ బ్యాడ్ బాయ్స్..'.. 'మగాళ్లు వట్టి మాయగాళ్లే..' అంటూ తన గాత్రంతో యువతను ఆకట్టుకున్న నవతరం గాయని గీతామాధురి. ట్రెడిషనల్, మెలోడీస్, ఫాస్ట్ బీట్, స్పెషల్ సాంగ్స్‌తో ఆకట్టుకోవడమే కాకుండా గ్లామర్‌తోనూ కుర్రకారును ఫిదా చేస్తోంది. అయితే తాజాగా ఆమె తనకు ఇష్టమైన ఆహారం ఏంటి? నేర్చుకున్న మొదటి వంట? ఇష్టమైన స్వీట్? చిన్నప్పుడు బాగా ఇష్టంగా తిన్న చిరుతిళ్లు? నచ్చే ఫ్లేవర్? సహా పలు విషయాలను తెలిపారు. ఆ సంగతులు ఆమె మాటల్లోనే వినేద్దాం...