తెలంగాణ

telangana

ETV Bharat / city

Telangana News today : టాప్‌న్యూస్ @ 11AM - తెలంగాణ న్యూస్ టుడే

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

Telangana News today
Telangana News today

By

Published : Jun 24, 2022, 10:59 AM IST

  • భారత్‌లో కరోనా కలవరం

భారత్​లో కరోనా కేసులు మళ్లీ భారీగా పెరిగాయి. ఒక్కరోజే 17,336 మందికి వైరస్​ సోకింది. మరో 13 మంది చనిపోయారు. 13,029 మంది కోలుకున్నారు.

  • ఆన్​లైన్​లో​ ఘరానా​ మోసం

ఆన్​లైన్​ యాప్​లో ఓ వ్యక్తి.. పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టి మోసపోయాడు. తీరా చేసేదేమీ లేక.. పోలీసులను ఆశ్రయించాడు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు.. జరిగిన ఆన్​లైన్​ మోసాన్ని ఛేదించారు. నిందితులు ఖాతా నుంచి లావాదేవీల వివరాలు చూసి షాక్​ అయ్యారు. సుమారు రూ.300 కోట్లు టోకరా చేసినట్లు గుర్తించారు. ఈ సంఘటన హరియాణాలో వెలుగు చూసింది.

  • సికింద్రాబాద్‌ విధ్వంసంలో అదృశ్య శక్తులు..?

సికింద్రాబాద్​ అల్లర్లలో కేవలం నిరుద్యోగులు, సైనిక ఉద్యోగార్థులు మాత్రమే ఉన్నారా..? లేక ఇంకెవరైనా ఉన్నారా..? అనే అనుమానం పోలీసుల్లో రేకెత్తుతోంది. దాన్ని నివృత్తి చేసుకునేందుకు.. ఆ దిశగా విచారణ మొదలుపెట్టారు. మరోవైపు ఈ ఘటనపై నివేదిక సమర్పించాల్సిందిగా కేంద్రం తాజాగా రాష్ట్ర పోలీసుశాఖను కోరినట్లు తెలుస్తోంది.

  • ధీరా.. ది ఫుడ్‌ డెలివరీ రోబో

రెస్టారెంట్లలో మన టేబుల్ వద్దకు ఫుడ్ తీసుకొచ్చే రోబోలను చూశాం. వాటి కోసమే స్పెషల్‌గా ఆ రెస్టారెంట్‌కి చాలా సార్లు వెళ్లుంటాం. కానీ ఫుడ్ డెలివరీకి కూడా రోబోలు రాబోతున్నాయంట. అదీ మన భాగ్యనగరంలో. హైదరాబాద్‌లోని గేటెడ్ కమ్యూనిటీల్లో, అపార్ట్‌మెంట్లలో తమ సేవలందించేందుకు రెడీ అవుతున్నాయి ధీరా రోబోలు. దేశంలోనే మొదటిసారిగా ఈ రోబోలు భాగ్యనగరవాసులకు సేవలందించనున్నాయి.

  • ఎన్డీఏ అభ్యర్థికి వైకాపా మద్దతు

ప్రత్యేక హోదా లాంటి షరతులేమీ లేకుండానే ఎన్టీఏ తరఫు రాష్ట్రపతి అభ్యర్థిని బలపరచాలని నిర్ణయించింది వైకాపా. ద్రౌపదీ ముర్ము నామినేషన్‌కు పార్టీ తరఫున విజయసాయిరెడ్డి, మిథున్‌రెడ్డిలు హాజరుకానున్నారు.

  • సేవల్లో లోపముందని.. అమెజాన్‌కు జరిమానా

వినియోగదారునికి మెరుగైన సేవలే లక్ష్యంగా అన్ని కంపెనీలు పనిచేస్తుంటాయి. అందులోనూ డిజిటల్​ సంస్థలైతే.. వినియోగదారుడి నుంచి మరింత మెప్పు పొందేందుకు మన్నికైన సేవలు అందిస్తూ ఆకర్షించేందుకు ప్రయత్నిస్తుంటాయి. ఒకవేళ వినియోగదారులకు ఎలాంటి అసౌకర్యం కలిగించినా.. పెద్ద మొత్తంలోనే మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. దానికి నిదర్శనమే ఈ ఘటనలు.. అవేంటో మీరే చూడండి.

  • జులై ఏడు నుంచి కాకతీయ ఉత్సవాలు

రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో కాకతీయ ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. జులై ఏడు నుంచి ఈ ఉత్సవాలను వారం రోజుల పాటు వైభవంగా నిర్వహించేందుకు అన్ని రకాల ఏర్పాట్లు చేస్తోంది.

  • ఈ ఐదు యాప్స్‌ చాలా డేంజర్

డేటాను తస్కరిస్తున్న ఐదు ప్రమాదకరమైన మాల్‌వేర్‌ యాప్‌లను ఇటీవల గుర్తించిన గూగుల్​.. తాజాగా వాటిని ప్లే స్టోర్​ నుంచి తొలగించింది. అవేంటో తెలుసుకుందాం.

  • తగ్గిన బంగారం, వెండి ధరలు

బంగారం, వెండి ధరలు తగ్గాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో 10 గ్రాముల పసిడి ధర రూ.52,300గా ఉంది. కిలో వెండి ధర రూ.61,300గా ఉంది.

  • ఆ సర్జరీ వికటించి మరో అందాల తార మృతి

సర్జరీ వికటించి అందాల పోటీల విజేత గ్లేసీ కారియా మృతిచెందింది. 27 ఏళ్ల వయసులోనే ప్రాణాలు కోల్పోయింది.

ABOUT THE AUTHOR

...view details