ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలుతెలంగాణపై మరోసారి కరోనా పంజా తెలంగాణలో కొవిడ్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. దాదాపు మూడున్నర నెలల తర్వాత ఒక్కరోజులో 400కి పైగా కొత్త కేసులు నమోదయ్యాయి. కరోనా మరోసారి విజృంభిస్తోందని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్ జి.శ్రీనివాసరావు పేర్కొన్నారు.ఈనెల 25న ఇంటర్ ఫలితాలు ?ఈనెల 25న ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సర పరీక్షల ఫలితాలను విడుదల చేసేందుకు ఇంటర్ బోర్డు సిద్ధమవుతోంది. జవాబు పత్రాల మూల్యాంకన సహా అన్ని ప్రక్రియలు పూర్తయిన సందర్భంగా తప్పులు రాకుండా సాఫ్ట్వేర్ ద్వారా పరిశీలిస్తున్నట్లు బోర్డు కార్యదర్శి జలీల్ తెలిపారు.సంజయ్‌కు భద్రత పెంపు బండి సంజయ్‌కు పోలీసులు భద్రత పెంచారు. ప్రస్తుతమున్న దానికి అదనంగా(1+5) ఆరుగురితో కూడిన రోప్ పార్టీని కేటాయించారు. మరో ఎస్కార్టు వాహనం ఏర్పాటు చేశారు. పర్యటనల సమయంలో ఆయనకు ఈ మేరకు అదనపు సిబ్బంది భద్రత కల్పిస్తారు. అగ్నిపథ్ పథకంపై ఆందోళనలతో పాటు ఇటీవల కరీంనగర్లో సంజయ్ వ్యాఖ్యల నేపథ్యంలో ఆయనకు భద్రత పెంచాలని నిఘా వర్గాలు సూచించిన మీదట అదనపు భద్రత కల్పించినట్లు పోలీసు వర్గాలు తెలిపాయి.'నిమ్జ్'లో తొలి అడుగునిమ్జ్లో రక్షణ రంగ పరికరాల తయారీ పరిశ్రమ వెమ్ టెక్నాలజీస్‌కు నేడు శంకుస్థాపన చేయనున్నారు ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారకరామారావు. 2013లో నిమ్జ్‌కు అడుగులు పడగా... బుధవారం తొలి పరిశ్రమ నిర్మాణం కోసం భూమిపూజ జరగనుంది.చట్టబద్ధ పాలనకే ప్రాధాన్యం రాజ్యాంగసూత్రాలకు అనుగుణంగాలేని ఏ చట్టాన్నైనా కొట్టేసే శక్తి భారతీయ కోర్టులకుందన్నారు భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ. భారతీయ న్యాయ వ్యవస్థలో చట్టబద్ధ పాలనకే ప్రాధాన్యం ఇస్తామని స్పష్టం చేశారు. జర్మనీలోని దోర్త్‌మండ్‌లో 'ఆర్బిట్రేషన్ ఇన్ ఏ గ్లోబలైజ్డ్ వరల్డ్ - ది ఇండియన్ ఎక్స్‌పీరియన్స్' అన్న అంశంపై జరిగిన సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు.నిర్మాణ 'భాగ్య'నగరంభవన నిర్మాణాల్లో రాష్ట్ర రాజధాని దూసుకెళ్తోంది. రాష్ట్రంలో జరుగుతున్న భవన నిర్మాణాల్లో మూడో వంతు హైదరాబాద్, దాని పరిసరాల్లోనే జరుగుతున్నాయి. కొత్త జిల్లా కేంద్రాల్లోనూ అనుమతుల జోరు కొనసాగుతోంది. టీఎస్‌బీపాస్ ద్వారా జీహెచ్‌ఎంసీ పరిధిలో అత్యధిక సంఖ్యలో భవనాలకు అనుమతి లభించింది.ఐరాసలో భారత శాశ్వత ప్రతినిధిగా రుచిరా కాంబోజ్ ఐక్యరాజ్య సమితిలో భారత శాశ్వత ప్రతినిధిగా సీనియర్ దౌత్యవేత్త రుచిరా కాంబోజ్ నియమితులయ్యారు. ప్రస్తుత ప్రతినిధి టీఎస్ తిరుమూర్తి స్థానాన్ని ఆమె భర్తీ చేయనున్నారు. ఈ మేరకు ఓ ప్రకటనలో తెలిపింది విదేశాంగ శాఖ.'3 నెలల్లో 10 శాతం మంది ఉద్యోగులను తొలగిస్తాం'ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ టెస్లాలో వచ్చే మూడు నెలల్లో 10 శాతం మంది ఉద్యోగులను తొలగించనున్నట్లు వెల్లడించారు ఆ సంస్థ సీఈఓ ఎలాన్ మస్క్. బ్లూమ్‌బర్గ్ నిర్వహించిన ఖతార్ ఎకనామిక్ ఫోరమ్‌లో పాల్గొన్న సందర్భంగా ఉద్యోగాల తొలగింపుపై పునరుద్ఘాటించారు.'సినీ కార్మికులు మళ్లీ అదే తప్పు చేస్తున్నారు' సినీ కార్మికులు సమ్మెకు వెళ్లాలంటే పరిశ్రమలోని నిబంధనల ప్రకారం 15 రోజుల ముందు ఫిల్మ్‌ఛాంబర్‌కు నోటీసు ఇవ్వాలన్నారు అధ్యక్షుడు కొల్లు రామకృష్ణ. ఇప్పటి వరకు ఎలాంటి నోటీసు అందలేదని స్పష్టం చేశారు. కార్మికులు గతంలో చేసిన తప్పునే మళ్లీ చేస్తున్నారని అభిప్రాయపడ్డారు.'బోల్డ్ పాత్రల్లో నటించాలని ఉంది'మంచి కథలు వస్తే ప్రేమకథల్లో, బోల్డ్ సీన్స్‌లో నటించాలని ఉందని అన్నారు సీనియర్ నటి అర్చన. ఆమె నటించిన తాజా నటించిన చిత్రం 'చోర్‌బజార్'. ఈనెల 24న విడుదలవుతోంది. ఈ సందర్భంగా తన కెరీర్ సహా చిత్ర విశేషాలు తెలిపారామె. ఆ సంగతులివీ..