ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలుసికింద్రాబాద్ విధ్వంసంసై నిఘా సంస్థల ఆరా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌పై దాడి కేసులో కేంద్ర నిఘా సంస్థలు లోతుగా ఆరా తీస్తున్నాయి. ఈ ఘటనపై ఇప్పటికే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ విధ్వంసానికి నిర్దుష్ట కారణాలను తెలుసుకోవడంతో పాటు ఇందుకు బాధ్యులు, ఆందోళనలో పాల్గొన్నవారిని గుర్తించేందుకు కేంద్ర నిఘా సంస్థతో పాటు రక్షణ మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలోని నిఘా విభాగాలు రంగంలోకి దిగాయి.ధరలు పెంచినా.. తగ్గేదేలేరాష్ట్రంలో కొత్త మద్యం విధానం ప్రకారం ధరలు పెంచినా విక్రయాలు తగ్గడం లేదు. నెల రోజుల్లో రూ.3,330.74 కోట్ల మద్యం అమ్మకాలు జరిగాయి. అంతకుముందు మాసంతో పోలిస్తే రూ.530 కోట్లు అధికంగా మద్యం విక్రయాలు నమోదయ్యాయి.ధాన్యం సొమ్ము ఇంకా రాకపాయే రాష్ట్రంలో రుతుపవనాలు రావడంతో వ్యవసాయ పనులు చేపట్టేందుకు వాతావరణం అనుకూలంగా మారడంతో రైతులు రావాల్సిన ధాన్యం సొమ్ము కోసం ఎదురు చూస్తున్నారు. యాసంగి ధాన్యం కొనుగోళ్లు దాదాపు పూర్తి కావచ్చాయి. కొనుగోలు చేసిన నాలుగైదు రోజుల్లో బ్యాంకు ఖాతాల్లో ధాన్యం డబ్బు జమ కావాల్సి ఉన్నా.. 15 రోజులకుపైగా సమయం పడుతోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.కత్తితో దుండగుడి దాడి.. ఎస్సై వీరోచిత పోరుకేరళలో ఓ పోలీసు అధికారి వీరోచితంగా పోరాడిన వైనం అందరిచేత ప్రశంసలందుకుంటోంది. ఓ దుండగుడు కత్తితో దాడి చేసేందుకు ప్రయత్నించగా పోలీసు అధికారి అడ్డుకున్నాడు. కాగా దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.బెర్లిన్ గోడ స్మారకాన్ని సందర్శించిన సీజేఐ జస్టిస్ ఎన్.వి.రమణ భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ జర్మనీ పర్యటనలో భాగంగా బెర్లిన్ గోడ స్మారకాన్ని సందర్శించారు. రెండో ప్రపంచ యుద్ధం, ప్రచ్ఛన్న యుద్ధం తర్వాత నిర్మించిన బెర్లిన్ గోడ అంతర్జాతీయ చిహ్నంగా మిగిలింది.ఆరావళి ఆదివాసీలపై ఆంగ్లేయుల ఊచకోతవాళ్లేమీ రాజ్యం కోరలేదు. స్వరాజ్యం అంతకన్నా కావాలనలేదు. పన్నుల భారం తగ్గించమన్నారు.. 'బాంచెన్ దొర' బానిసత్వం వద్దన్నారు. ఆ మాత్రానికే ఆంగ్లేయ ఫిరంగులు గర్జించాయ్. ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఏకంగా 1500 మంది ఆదివాసీలను పొట్టనబెట్టుకున్నాయి. ఆరావళి పర్వత శ్రేణుల్లో ఆంగ్లేయులు సృష్టించిన ఉత్పాతమిది. జలియన్‌వాలాబాగ్ కంటే ఆరేళ్ల ముందు జరిగినా చరిత్రకెక్కని అరాచకమిది.చింతన్ శిబిర్‌తో కాంగ్రెస్‌లో కదలిక చింతన్ శిబిర్ నిర్వహించిన నెల రోజుల తర్వాత ఆ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను అమలు చేయడంపై కాంగ్రెస్ దృష్టిసారించింది. పార్టీ వాణిని ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లే ప్రయత్నాలపై కసరత్తు చేస్తోంది. ఇటీవలే కీలక పదవులకు కీలక నేతలను నియమించటం అందులో భాగమే.వైట్‌హౌజ్ సమీపంలో కాల్పులుఅమెరికాలో మరోసారి తుపాకీ మోత మోగింది. శ్వేతసౌధం సమీపంలో దుండగులు కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో పోలీస్ అధికారి సహా పలువురికి బుల్లెట్లు తగిలాయి.సరికొత్తగా సాహా.. ఆ జట్టుకు మెంటార్‌గా! టీమ్ఇండియా సీనియర్ ప్లేయర్ వృద్ధిమాన్ సాహా.. కొత్త బాధ్యతలు తీసుకోబోతున్నట్లు తెలిసింది. దేశవాళీలో త్రిపుర తరపున ఆడడం సహా ఆ జట్టుకు మెంటార్‌గా వ్యవహరించేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టినట్లు సమాచారం.బాలయ్య సినిమాలో రాజశేఖర్.. బాలయ్య-అనిల్ రావిపూడి చిత్రంలో సీనియర్ హీరో రాజశేఖర్.. హాస్యం పండించేందుకు సిద్ధమవుతున్నారని తెలిసింది. సినిమాలో బాలయ్య స్నేహితుడిగా కనిపించి ఫుల్ కామెడీ చేయబోతున్నారట. మరో విశేషమేమిటంటే.. ఒరిజినల్ వాయిస్‌లోనే ఆయన మాట్లాడనున్నారని సమాచారం.