తెలంగాణ

telangana

ETV Bharat / city

Telangana News Today : టాప్‌న్యూస్ @ 1PM - telangana top news

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

Telangana News Today : టాప్‌న్యూస్ @ 1PM
Telangana News Today : టాప్‌న్యూస్ @ 1PM

By

Published : Jun 16, 2022, 1:03 PM IST

  • యూపీలో మినీబస్సు బోల్తా

ఉత్తర్‌ప్రదేశ్‌లోని సుల్తాన్‌పూర్‌ వద్ద మినీ బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో రాష్ట్రానికి చెందిన 26 మంది యాత్రికులకు గాయాలయ్యాయి. ఈనెల 10న అయోధ్య సందర్శనకు వెళ్లిన వీరంతా తిరిగి వస్తుండగా లఖ్‌నవూ-వారణాసి జాతీయ రహదారిపై ఈ ప్రమాదం చోటుచేసుకుంది.

  • గాడిదల పెంపకం.. లక్షలు సంపాదిస్తున్నాడు!

ఏరా గాడిదలు కాస్తున్నావా? ఏ పనీ చేయకుండా ఖాళీగా తిరుగుతుంటే ఊర్లళ్లోని పెద్దవాళ్లు అనే మాట. కానీ కర్ణాటక మంగళూరులోని 42 ఏళ్ల శ్రీనివాస గౌడ గురించి తెలిస్తే మాత్రం ఇకపై గాడిదలు కాస్తావా? అనే మాటను ఎవరూ అనరు. ఎందుకంటే అతడు చేసిన పని అలాంటిది.

  • పెళ్లికి వెళ్లి వస్తుండగా విషాదం

మధ్యప్రదేశ్​లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పెళ్లి వేడుక నుంచి వస్తున్న ఓ బొలెరో వాహనం అదుపుతప్పి బావిలో పడిపోయింది. ఈ ఘటనలో ఒక చిన్నారి​ సహా ఏడుగురు చనిపోయారు. పలువురు గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం అధికారులు ఆసుపత్రికి తరలించారు. ఛింద్వాడా జిల్లాలోని కొడమావు గ్రామ సమీపంలో ఈ ఘటన జరిగింది.

  • 'దానిపై ప్రధాని, అదానీలు స్పందించరు'

రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ గత కొద్దిరోజులుగా ట్విటర్‌ వేదికగా కేంద్ర సర్కార్‌పై విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. తాజాగా ప్రధాని మోదీ, అదానిని విమర్శిస్తూ ప్రశాంత్ భూషన్ చేసిన ట్వీట్‌ను రీట్వీట్ చేస్తూ పరోక్షంగా మరోసారి విమర్శించారు.

  • లోదుస్తుల్లో 1.64 కిలోల బంగారం

శంషాబాద్ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు కువైట్ నుంచి వచ్చిన ఓ మహిళా ప్రయాణికురాలి వద్ద రూ.86 లక్షల విలువైన 1.64 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. బంగారాన్ని పేస్టు రూపంలో చేసి నల్లకవర్‌లో పెట్టి, లోదుస్తులు, సాక్సులో తీసుకెళ్తుండగా తనిఖీ చేసి పట్టుకున్నారు.

  • ప్రభుత్వ ఆస్తిని అమ్మేసిన మనవడు

Bihar health clinic sold: బిహార్​లో ప్రభుత్వ ఆస్తి విక్రయించిన మరో ఘటన వెలుగులోకి వచ్చింది. ప్రభుత్వానికి దానంగా లభించిన స్థలాన్ని ఓ వ్యక్తి ఇతరులకు విక్రయించాడు. అది తన కుటుంబ ఆస్తి అని చెబుతున్నాడు.

  • పెరిగిన బంగారం, వెండి ధరలు

తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు గురువారం పెరిగాయి. ప్రస్తుతం 10 గ్రాముల స్వచ్ఛమైన పసిడి ధర రూ.240 పెరిగి.. రూ.52,240 వద్ద ఉంది. కిలో వెండి ధర రూ.1250పైగా పెరిగి.. రూ.62,800గా కొనసాగుతోంది. ఆంధ్రప్రదేశ్​, తెలంగాణ రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలతో పాటు అంతర్జాతీయ మార్కెట్లో క్రిప్టో కరెన్సీ విలువలు ఎలా ఉన్నాయో చూద్దాం..

  • కోహ్లీ.. ఆడాలని ఉందా లేదా?..

Kohli Shahid Afridi: టీమ్‌ఇండియా మాజీ సారథి విరాట్‌ కోహ్లీ ఆటతీరుపై విమర్శలు చేశాడు పాకిస్థాన్‌ మాజీ కెప్టెన్‌ షాహిద్‌ అఫ్రిది. అతడికి మునుపటిలా రాణించాలనే ఉద్దేశం ఉందా.. లేదా? అని ప్రశ్నించాడు.

  • స్విమ్మింగ్​ పూల్​లో శ్రీముఖి..

ఓ వైపు బుల్లితెరపై అలరిస్తూనే.. అవకాశం వచ్చినప్పుడల్లా సినిమాల్లోనూ నటిస్తూ అభిమానులను ఆకట్టుకుంటోంది యాంకర్​, నటి శ్రీముఖి. సోషల్​మీడియాలోనూ చురుగ్గా ఉంటూ తనకు సంబంధించిన ఫొటోలను సోషల్​మీడియాలో పోస్ట్​ చేస్తూ కుర్రాళ్లను కవ్విస్తోంది. తాజాగా స్విమ్మింగ్​ ఫూల్​లో దిగిన ఫొటోలను షేర్​ చేసింది. ఈ పిక్స్​లో ఆమె బ్లాక్​ ఫ్రాక్​ ధరించి పూల్​లో సేద తీరుతున్నారు. తడిసిన అందాలకు పూలు అడ్డుగా పెట్టి ఫ్యాన్స్​ను రెచ్చగొట్టారు. ప్రస్తుతం ఆ గ్లామర్​ పిక్స్​ నెట్టింట్లో వైరల్​గా మారాయి. వాటిని చూసేద్దాం...

  • 'విరాటపర్వం'.. ఈ విషయాలు తెలుసా?

రానా, సాయిపల్లవి నటించిన 'విరాటపర్వం' శుక్రవారం విడుదల కానుంది. ఈ సందర్భంగా చిత్ర బృందం టికెట్‌ ధరల వివరాలు తెలియజేసింది. ఆ వివరాలతో పాటు సినిమా గురించి మరిన్ని విశేషాలు మీకోసం..

ABOUT THE AUTHOR

...view details