ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు'దమ్ముంటే హరీశ్ రావు గుడాటిపల్లికి రావాలి' గుడాటిపల్లి భూ నిర్వాసితులకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని కాంగ్రెస్ సీనియర్ నేత పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో భూనిర్వాసితుల ఆందోళనకు నేతలు సంఘీభావం తెలిపారు. కిసాన్ కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షుడు కోదండ రెడ్డి మద్దతు పలికారు. మల్లన్న సాగర్, రంగనాయక సాగర్ తరహాలో గౌరవెల్లి ప్రాజెక్టు నిర్వాసితులకు పరిహారం చెల్లించాలని పొన్నం డిమాండ్ చేశారు. భాగ్యనగరంలో దంచికొట్టిన వానభాగ్యనగరంలో నైరుతి రుతుపవనాల ప్రభావం మొదలైంది. రుతుపవనాలు చురుగ్గా రాష్ట్రవ్యాప్తంగా విస్తరిస్తున్నాయి. ఈ ప్రభావంతో రాష్ట్రమంతటా పలుచోట్ల మోస్తరు నుంచి భారీవర్షాలు పడుతున్నాయి. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో రాత్రి నుంచి వర్షం కురుస్తోంది. కొన్ని ప్రాంతాల్లో అత్యధికంగా వర్షం కురవడంతో... వరద నీరు ఇళ్లలోకి చేరింది. పాతబస్తీలోని రోడ్లపై భారీగా నీరు చేరడంతో వాహనదారుల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.హైదరాబాద్‌కు సద్గురు పుడమిని రక్షించుకుందాం.. నేలతల్లి మరింత క్షీణించకుండా కాపాడుకుందామంటూ ప్రపంచ యాత్ర చేపట్టిన సద్గురు ఇవాళ హైదరాబాద్ చేరుకుంటారు. రేపు మధ్యాహ్నం శంషాబాద్ సమీపంలోని ముచ్చింతల్‌లోని అటవీ పార్క్‌లో ఎంపీ సంతోశ్ కుమార్‌తో కలిసి మొక్కలు నాటి గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఐదో విడత కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు.మైనర్ బాలికపై అత్యాచారం.. భవనంపై నుంచి దూకినిజామాబాద్ నగరంలో దారుణం చోటుచేసుకుంది. ఓ మైనర్ బాలిక(17) గత నెల 31న భవనంపై నుంచి దూకి ఆత్మహత్యాత్నం చేసింది. తీవ్ర గాయాలపాలైన ఆమెను కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించారు. 14 రోజుల పాటు చికిత్స పొందిన ఆ బాలిక ఇటీవలే కోలుకుంది. కోలుకున్న తర్వాత తాను ఆత్మహత్యకు పాల్పడటానికి గల కారణాన్ని కుటుంబ సభ్యులకు వివరించింది.భార్య రొట్టెలు చేయలేదని భర్త ఆత్మహత్య ఎంతో విలువైన జీవితాన్ని కొందరు చిన్నచిన్న కారణాలతో బలి చేసుకుంటున్నారు. సిల్లీ కారణంతో ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన సంగారెడ్డి జిల్లా బీడీఎల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఇంతకీ ఆ కారణమేంటంటే.. అతడి భార్య తన కోసం రొట్టెలు చేయకపోవడం.మూడో రోజు ఈడీ ముందుకు రాహుల్నేషనల్ హెరాల్డ్ కేసుకు సంబంధించి వరుసగా మూడో రోజు.. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని ఈడీ ప్రశ్నించడాన్ని కాంగ్రెస్ నాయకులు తీవ్రంగా నిరసిస్తున్నారు. దిల్లీలోని ఏఐసీసీ ఆఫీసు ఎదుట బుధవారం ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆందోళనకు దిగారు. ముందుగానే ఆ ప్రాంతంలో మోహరించిన పోలీసులు.. వారిని అదుపులోకి తీసుకున్నారు. 'మేము ఉగ్రవాదులమా? మమ్మల్ని చూసి ఎందుకు భయపడుతున్నారు?' అని కాంగ్రెస్ ఎంపీ అధిర్ రంజన్ చౌదరి.. పోలీసులపై మండిపడ్డారు.మలద్వారం లోపలికి స్టీల్ గ్లాసు ఓ వ్యక్తి మలద్వారంలో స్టీల్ గ్లాసు ఇరుక్కుపోయింది. అదే మార్గం గుండా బయటకు తీయడం వైద్యులకు కష్టమైపోయింది. దీంతో సర్జరీ నిర్వహించారు.అక్కడ మహిళలకు 3 రోజులు నో వర్క్- ఓన్లీ ఫన్!ఒడిశా రాష్ట్రవ్యాప్తంగా మహిళల కోసం ప్రత్యేకంగా 3 రోజుల పాటు 'రజా పర్బా' నిర్వహిస్తున్నారు. ఈ మూడు రోజులు మహిళలను దేవతల్లా ఆరాధిస్తారు. అలాగే వ్యవసాయ పనులు ప్రారంభం కానున్న నేపథ్యంలో ప్రకృతికి ప్రత్యేక పూజలు చేస్తున్నారు. బుధవారం ఈ వేడుకలు రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభమయ్యాయి.పెళ్లి వేడుకలో విషాదం.. ఒక్కసారిగా కూలిన బాల్కనీ.. బంధువులంతా! అప్పటివరకు అంగరంగ వైభవంగా జరుగుతున్న వివాహ వేడుకలో తీవ్ర విషాదం నెలకొంది. వధూవరులు పూలదండలు మార్చుకుంటున్న ఘట్టాన్ని పెళ్లికి వచ్చిన అతిథులంతా చప్పట్లు కొడుతూ తిలకిస్తున్నారు. ఇంతలోనే అకస్మాత్తుగా భవన బాల్కనీ కూలిపోయింది. దీంతో బాల్కనీలో నిల్చున్న అతిథులంతా ఒక్కసారిగా కింద పడిపోయారు. 20 మందికిపైగా గాయపడ్డారు. ఇంగ్లాండ్‌తో రీషెడ్యూల్ టెస్టు.. భారత స్టార్ ఓపెనర్ అనుమానమే!ఇంగ్లాండ్‌తో జరగనున్న రీషెడ్యూల్ టెస్టుకు టీమ్ఇండియా ఓపెనర్ కేఎల్ రాహుల్ అందుబాటులో ఉండటం అనుమానంగా మారింది. అతడు కోలుకోవడానికి ఇంకా సమయం పట్టేలా ఉందని తెలుస్తోంది.