- దేశంలో భారీగా పెరిగిన కరోనా మరణాలు
దేశంలో కరోనా కేసులు స్వల్పంగా తగ్గాయి. కానీ మరణాలు మాత్రం భారీగా పెరిగాయి. కొత్తగా 2,226 కేసులు నమోదు కాగా, మహమ్మారి కారణంగా మరో 65 మంది ప్రాణాలు కోల్పోయారు.
- భారీగా తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు
ఎక్సైజ్ సుంకం తగ్గించాలన్న కేంద్రం నిర్ణయంతో పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా దిగొచ్చాయి. హైదరాబాద్లో లీటరు పెట్రోల్ ధర రూ.9.83, డీజిల్ ధర రూ.7.67 మేర తగ్గాయి.
- మాకు కావాల్సింది ఎన్కౌంటర్లు కాదు
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ హత్యాచార నిందితుల ఎన్కౌంటర్ కేసుపై సిర్పూర్కర్ కమిషన్ ఇచ్చిన నివేదికను రాష్ట్ర మహిళా, ట్రాన్స్జెండర్లు, మహిళా హక్కుల సంఘాలు, సామాజిక కార్యకర్తలు స్వాగతించారు. నిందితుల ఎన్కౌంటర్ బూటకమని తేల్చిన కమిషన్ నివేదికను సమర్థించారు. ఈ మేరకు మహిళల భద్రత, రక్షణపై రాష్ట్ర హైకోర్టుకు ఈ సంఘాలు పలు సిఫార్సులు చేశాయి.
- పగ, ప్రతీకారం ఒకరిది.. పావులు మరొకరు
పగ, ప్రతీకారం ఒకరివి.. వారు వేసే డబ్బు ఎరకు చిక్కి.. జీవితాలను ఛిద్రం చేసుకునే వారు వేరొకరు. తమ పేరు బయటకు రాకుండా వ్యవహారం చక్కబెట్టాలని.. ప్రధాన నిందితులు సుపారీ ఇచ్చి కిరాయి మనుషులతో హత్యలు చేయిస్తున్నారు. కొద్దిపాటి డబ్బిస్తే తెగించే సామాన్యులను వెతికి మరీ పట్టుకుంటున్నారు. వీరిచ్చే డబ్బు కుటుంబ అవసరాలకో, విలాసాలకో పనికొస్తుందన్న ఆశతో హత్యలకు పాల్పడేవారు చివరకు కటకటాలపాలవుతున్నారు.
మద్యం మత్తులో ఇద్దరు యువతులు రచ్చ చేశారు. తాగి రేంజ్ రోవర్ కారు నడుపుతూ.. ఆగి ఉన్న మరో కారును ఢీకొట్టారు. ఈ ఘటనలో ఓ వ్యక్తి మరణించగా.. అతని భార్య, పిల్లలకు తీవ్ర గాయాలయ్యాయి. ఘటనా స్థలానికి చేరుకున్న ఎస్సైపైనా దాడికి యత్నించారు నిందితులు. ఈ ఘటన హరియాణా అంబాలాలో జరిగింది.
- లోదుస్తుల్లో వెళ్లి ఓటేసిన వందల మంది