తెలంగాణ

telangana

ETV Bharat / city

Telangana Top News: టాప్‌ న్యూస్ @ 1PM - TELANGANA TODAY

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

Telangana Top News : టాప్‌ న్యూస్ @ 1PM
Telangana Top News : టాప్‌ న్యూస్ @ 1PM

By

Published : May 17, 2022, 12:58 PM IST

  • ఎల్​ఐసీ ఎంట్రీ.. మదుపర్లకు నిరాశే..

LIC listing price: దేశీయ స్టాక్ మార్కెట్ చరిత్రలోనే అతిపెద్ద ఐపీఓగా నిలిచిన ఎల్​ఐసీ షేర్లు ఇవాళ స్టాక్ మార్కెట్లలో లిస్టయ్యాయి.ప్రపంచవ్యాప్తంగా ఈక్విటీ మార్కెట్లు నష్టాల్లో కూరుకుపోయిన తరుణంలో గ్రే మార్కెట్‌ ట్రేడింగ్‌ సూచించినట్లుగానే ఎల్​ఐసీ షేర్లు రాయితీతో ఎక్స్ఛేంజీల్లో నమోదయ్యాయి. దీంతో భారీ ఆశలతో దరఖాస్తు చేసుకున్న మదుపర్లకు నిరాశ తప్పలేదు.

  • మర్మాంగాన్ని కోసి భర్తను హతమార్చిన భార్య..

భర్త మర్మాంగాన్ని కోసి దారుణంగా హతమార్చింది ఓ ఇల్లాలు. ఈ క్రూరమైన ఘటన మహారాష్ట్రలోని కోల్హాపుర్​లో జరిగింది. ఆమెను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. ఈ కేసుపై దర్యాప్తు ముమ్మరం చేశారు.

  • 'వదిలించుకోవడం ఎందుకు... వృద్ధిలోకి తెద్దాం..'

ఆదిలాబాద్ సీసీఐ పరిశ్రమ అంశంపై కేంద్రానికి మంత్రి కేటీఆర్‌ ట్విటర్ వేదికగా విజ్ఞప్తి చేశారు. సీసీఐ పరిశ్రమ తొలగింపు ఉత్తర్వులపై పునఃసమీక్షించాలని ట్వీట్ చేశారు. ఉత్తర్వులపై సమీక్షించాలని కేంద్రమంత్రి పీయూష్‌ గోయల్‌ను కోరారు.

  • 'కొవిడ్​ తర్వాత పెరిగిన బీపీ బాధితులు.. 30 ఏళ్ల వారే అధికం..'

గ్లోబల్ హాస్పిటల్స్, కార్డియాలజీ సొసైటీ ఆఫ్ ఇండియా సంయుక్తంగా.. కొవిడ్ తరువాత రక్తపోటు పైన నిర్వహించిన సర్వే రిపోర్టును మంత్రి హరీశ్​రావు విడుదల చేశారు. కొవిడ్ తరువాత బీపీ బాధితులు ఎక్కువయ్యారన్న మంత్రి.. ఇందులో 30 ఏళ్ల వాళ్లే అధికంగా ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

  • ఎవరెస్ట్‌ను అధిరోహించిన తెలంగాణ యువతి..

రాష్ట్రానికి చెందిన అన్వితా రెడ్డి పర్వతారోహణలో సరికొత్త రికార్డు నెలకొల్పారు. ప్రపంచంలోనే ఎత్తైన ఎవరెస్ట్ పర్వతాన్ని అధిరోహించారు. గతంలో రష్యా, ఆఫ్రికాలోని పర్వతాలు అధిరోహించిన అన్వితారెడ్డి సముద్ర మట్టానికి 8,848.86 మీటర్ల ఎత్తులోని ఎవరెస్టును బేస్‌ క్యాంపు నుంచి ఐదు రోజుల్లోనే లక్ష్యాన్ని పూర్తి చేశారు.

  • హైదరాబాద్‌లో కూరగాయల ధరలు ఇలా..!!

Vegetables Price in Hyderabad Today: హైదరాబాద్​ మోడల్​ రైతుబజార్​ ఎర్రగడ్డలో మంగళవారం(17-05-2022) కూరగాయల ధరలు ఈ విధంగా ఉన్నాయి.

  • ఇక 6 నెలల్లోనే గ్రీన్​కార్డ్​కు క్లియరెన్స్!

Green card USA time period: గ్రీన్​ కార్డ్ జారీని వేగవంతం చేసేలా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్​కు కీలక సిఫార్సు చేసేందుకు.. ఈ అంశంపై ఏర్పాటైన సలహా మండలి సిద్ధమైంది. గ్రీన్ కార్డ్ దరఖాస్తులన్నింటిపై ఆరు నెలల్లోగా నిర్ణయం తీసుకునేలా నిబంధనలు సవరించేలా ప్రతిపాదించాలని ఆ కమిటీ ఏకగ్రీవంగా తీర్మానించింది.

  • కుడివైపు ఉర్దూ, ఎడమవైపు హిందీ..

ప్రభుత్వ పాఠశాలల్లో వసతులు లేక.. చెట్టు కిందే పాఠాలు చెప్పే టీచర్లను చూశాం. కరోనా లాక్​డౌన్​ సమయంలో విద్యార్థుల ఇళ్లకే వెళ్లి చదువు నేర్పిన ఉపాధ్యాయుల గురించి విన్నాం. కానీ.. ఇది వేరే లెవల్. ఒకే గదిలో రెండు తరగతుల విద్యార్థుల్ని కూర్చోబెట్టి.. బోర్డును చెరిసగం పంచుకుని హిందీ, ఉర్దూ పాఠాలు ఒకేసారి చెబుతున్నారు ఇద్దరు టీచర్లు.

  • అత్యధిక సిక్స్​లు ఈ సీజన్​లోనే..

Most Sixes in IPL 2022: ఐపీఎల్​ చరిత్రలో ఈ సీజన్​ ఓ సరికొత్త రికార్డు సాధించింది. ఒక సీజన్‌లో అత్యధిక సిక్సర్లు నమోదైన రికార్డు ఐపీఎల్ 2022 తన పేరిట లిఖించుకుంది.

  • సర్జరీ వికటించి ప్రముఖ నటి మృతి..

ప్రముఖ నటి చేతనా రాజ్ మృతి చెందారు. కన్నడ పరిశ్రమకు చెందిన ఆమె 21 ఏళ్లకే మరణించడంపై విషాదం నెలకొంది.

ABOUT THE AUTHOR

...view details