ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలుదసరాకు కొత్త సచివాలయం ప్రారంభం దసరా కల్లా నూతన సచివాలయ నిర్మాణ పనులు పూర్తి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇందుకు సంబంధించిన పనులు శరవేగంగా సాగుతున్నాయి. కొత్త సచివాలయ నిర్మాణ పనులను ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవాళ పరిశీలించారు. సీఎంతో పాటు మంత్రి ప్రశాంత్‌రెడ్డి, అధికారులు, ఇంజినీర్లు వెళ్లారు. నిర్మాణ పనులు వేగవంతంగా చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు.కొనుగోలు కేంద్రాల్లో వసతుల కొరతధాన్యం కొనుగోలు కేంద్రాల్లో మౌలిక సదుపాయాల కొరత తీవ్రంగా ఉంది. రైతులు ధాన్యం తెచ్చిన వెంటనే కొనేందుకు సరైన ఏర్పాట్లు లేవు. కొన్నిచోట్ల వడ్లు శుభ్రంచేసే పరికరాలు, తేమ కొలిచే యంత్రాలు, తూకం వేసే కాంటాలు, టార్పాలిన్లు సరిపడా లేకపోవడంతో రైతులకు అవస్థలు తప్పడం లేదు. దళితబంధు అమలుపై కలెక్టర్లతో సీఎం భేటీ దళితబంధు అమలవుతున్న విధానం పట్ల దేశం నలుమూలల నుంచి ప్రశంసలు అందుకుంటున్నామని సీఎం కేసీఆర్ అన్నారు. పథకం అమలుతో అనుకున్నదానికంటే ఎక్కువ ఫలితాలు అందుతాయని చెప్పారు. దళితబంధు కోసం చేస్తున్న ప్రతి రూపాయి పెట్టుబడిగా మారి తిరిగి లాభాలను ఆర్జించి పెడుతుందని చెప్పారు.నేడు వరంగల్ జిల్లాలో కేటీఆర్ పర్యటనవరంగల్ మహానగరంలో మంత్రి కేటీఆర్ నేడు పర్యటించనున్నారు. నగరంలో మంత్రి 236 కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేస్తారు. కేటీఆర్ పర్యటన సందర్భంగా ఓరుగల్లు గులాబీ మయంగా మారిపోయింది.వెంటాడుతున్న 'లాంగ్ కొవిడ్'! కరోనా సోకిన వారిలో 30 శాతం మంది లాంగ్ కొవిడ్‌తో బాధపడుతున్నట్లు ఓ అధ్యయనం వెల్లడించింది. మొత్తం 1038 మందిపై పరిశోధన చేపట్టగా వీరిలో 309 మందిలో లాంగ్ కొవిడ్ లక్షణాలు కనిపించాయి. కొందరిలో కొన్ని లక్షణాలు దీర్ఘకాలంపాటు వేధిస్తున్నట్లు గుర్తించారు.పోర్న్ చిత్రాల్లో నటించిందనే అనుమానంతో..నీలి చిత్రాల్లో నటించిందని అనుమానించి ఓ వ్యక్తి.. తన భార్యను కిరాతకంగా హత్య చేశాడు. కన్నబిడ్డల ముందే కత్తితో పొడిచి చంపేశాడు. ఈ ఘటన కర్ణాటక రాష్ట్రంలో జరిగింది. కుమార్తెను, అల్లుడిని దారుణంగా కత్తితో పొడిచి.. గుజరాత్లో పరువు హత్య కలకలం రేపింది. తమకు ఇష్టం లేని పెళ్లి చేసుకున్నందుకు భార్యా భర్తలిద్దరినీ చంపేశారు కుటుంబ సభ్యులు. మరోవైపు కన్న కూతురిపైనే అత్యాచారానికి పాల్పడ్డాడు ఓ కామాంధుడు. ఈ ఘటన ఊత్తర్ ప్రదేశ్‌లో జరిగింది. నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు.ఆర్థిక కష్టాలు తప్పవురష్యా-ఉక్రెయిన్ యుద్ధం, స్టాక్ మార్కెట్ల నుంచి విదేశీ పెట్టుబడిదార్ల నిధుల ఉపసంహరణ వంటి కారణాల వల్ల దేశంలో ఆర్థిక పరిస్థితి మరింత క్షీణించే అవకాశం ఉందని క్రిసిల్ రేటింగ్స్ హెచ్చరించింది. పలు బ్యాంకులు రుణ రేట్లను పెంచుతున్నట్లు తీసుకున్న నిర్ణయం రుణ వ్యయాల పెరుగుదలకు దారితీయొచ్చని పేర్కొంది.బెంగళూరు భళా గత మూడు మ్యాచుల్లో వరుస విజయాలు సాధించి జోరు మీద ఉన్న లఖ్‌నవూ జట్టుకు బ్రేక్ పడింది. డూప్లెసిస్ సారథ్యంలో ఆర్సీబీ లఖ్‌నవూపై ఘన విజయం సాధించింది. లఖ్‌నవూపై 18 పరుగుల తేడాతో గెలుపొందింది.టాలీవుడ్ హీరోల 'త్రిబుల్' ధమాకాటాలీవుడ్ హీరోలు జోరు మీదున్నారు. వరుసగా పలు చిత్రాలకు ఓకే చెబుతూ వాటిని పూర్తిచేసే పనుల్లో ఫుల్ బిజీగా ఉన్నారు. అలా ఈ ఏడాది ఓకేసారి కనీసం రెండు, మూడు చిత్రాలతో అభిమానులను పలకరించనున్న కథానాయకులు ఎవరు? వారి సినిమాలేంటి? తెలుసుకుందాం...