ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు2022-23 తెలంగాణ బడ్జెట్ ఎంతంటే..? వచ్చే ఏడాదికి ప్రవేశపెట్టనున్న రాష్ట్ర బడ్జెట్.. రెండున్నర లక్షల కోట్ల మార్కును దాటే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. సొంత రాబడులపై విశ్వాసంతో పూర్తి ఆశావహకంగా.. మరోమారు భారీ బడ్జెట్ దిశగా సర్కార్ కసరత్తు చేస్తోంది. యథావిధిగా సంక్షేమం, వ్యవసాయ రంగాలకు పెద్దపీట వేయనున్నారు. దళిత బంధు పథకానికి నిధుల కేటాయింపులో ప్రాధాన్యం ఉండనుంది.శ్రీ సుదర్శన నారసింహ మహాయాగం వాయిదాయాదాద్రిలో పునర్నిర్మితమైన పంచనారసింహుల దివ్యాలయ మహాకుంభ సంప్రోక్షణ పర్వంలో భాగమైన.. శ్రీ సుదర్శన నారసింహ మహాయాగం వాయిదా పడింది. వచ్చే నెల 21 నుంచి నిర్వహించాలనుకున్న క్రతువును వాయిదా వేస్తున్నట్లు యాడా వైస్ ఛైర్మన్ కిషన్ రావు వెల్లడించారు. క్షేత్రాభివృద్ధిలో భాగంగా చేపట్టిన కట్టడాలు పూర్తికానుందనే వాయిదా వేశామని వెల్లడించారు. నేడు సమ్మక్క-సారలమ్మల వన ప్రవేశం మేడారం మహా జనజాతర ముగింపు ఘట్టానికి చేరుకుంది. వనం నుంచి వచ్చిన దేవతలు.. ఈ రాత్రి తిరిగి వన ప్రవేశం చేయడంతో నాలుగు రోజుల వన వేడుక పరిసమాప్తం అవుతుంది. గద్దెల వద్ద భక్తుల నిర్విరామ దర్శనాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇవాళ రాష్ట్ర గవర్నర్ తమిళి సై సౌందరరాజన్, పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డితోపాటు పలువురు ప్రముఖులు వన దేవతలను దర్శించుకోనున్నారు.పెండింగ్ చలాన్ల వసూలు కోసం రాయితీలుట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనలో పేరుకుపోయిన పెండింగ్ చలాన్ల వసూళ్లకు పోలీసు శాఖ మార్గాలను అన్వేషిస్తోంది. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో రాయితీలు ఇవ్వడం ద్వారా.. ఏళ్లుగా చెల్లించకుండా ఉన్న జరిమానాలు కట్టించాలని ప్రయత్నిస్తోంది.మహాత్ముడి ధర్మాత్మ గోఖలే! మార్టిన్ లూథర్ కింగ్.. మండేలా.. ఒబామా.. ఇలా చాలామందికి మహాత్మా గాంధీ ఆదర్శం. మరి గాంధీజీకి? గోపాల కృష్ణ గోఖలే! బొంబాయి, రాజ్‌కోట్‌లలో లాయర్‌గా ఘోరంగా విఫలమై.. ఉద్యోగం వెతుక్కుంటూ దక్షిణాఫ్రికా వెళ్లిన కరమ్‌చంద్‌లో భారత భావి నాయకుడిని చూసిన దార్శనికుడు గోఖలే. పట్టుబట్టి మరీ గాంధీని ఒప్పించి.. భారత్‌కు రప్పించి.. తన డబ్బులతో దేశమంతా తిప్పించి.. జాతీయోద్యమానికో తిరుగులేని సారథిని అందించిన మహానుభావుడు గోఖలే!రన్నింగ్ ట్రైన్లో ఆరేళ్ల బాలికపై అత్యాచారంఆరేళ్ల చిన్నారిపై రన్నింగ్ ట్రైన్లో అత్యాచారానికి ఒడిగట్టాడు ఓ దుర్మార్గుడు. అతడిని పట్టుకున్న సహ ప్రయాణికులు.. పోలీసులకు అప్పగించారు.మళ్లీ మేనల్లుడికే పీఠం టీఎంసీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా బంగాల్ సీఎం మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీ తిరిగి నియమితులయ్యారు. పార్టీలో దీదీ తర్వాత స్థానం ఆమె మేనల్లుడిదేనని ఈ నియామకం ద్వారా రుజువైంది! టీఎంసీ నేషనల్ వర్కింగ్ కమిటీ భేటీ తర్వాత మమత.. జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించారు.ఉక్రెయిన్‌పై తొలగని యుద్ధమేఘాలురష్యా- ఉక్రెయిన్ల మధ్య యుద్ధ వాతావరణం నేపథ్యంలో.. శాంతి చర్చలకు సిద్ధమని రష్యా అధినేత వ్లాదిమిర్ పుతిన్ ప్రకటించారు. కానీ ఉక్రెయిన్ చుట్టూ బలగాలను మోహరించడం కారణంగా రష్యా మాటలను పాశ్చాత్య దేశాలు విశ్వసించడం లేదు.. అతి త్వరలో ఉక్రెయిన్‌పై క్రెమ్లిన్ దాడికి దిగే ప్రమాదం ఉందని అమెరికా అధ్యక్షుడు జో బెడెన్ కూడా హెచ్చరించారు.జీవితాంతం వ్యక్తిగత ప్రమాద బీమా! వ్యక్తిగత ప్రమాద బీమా పాలసీలను జీవితాంతం వరకు కొనసాగించేలా నిబంధనలను తీసుకురానుంది ఐఆర్‌డీఏఐ. ఈ మేరకు ఓ ముసాయిదా విడుదల చేసింది.ముగిసిన భారత్ పోరాటంఆసియా టీమ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌లో భారత్ కథ ముగిసింది. గ్రూపు దశ చివరి లీగ్ మ్యాచ్‌ల్లో మన జట్లకు చుక్కెదురైంది. దీంతో పురుషులు, మహిళల జట్లు సెమీఫైనల్‌కు అర్హత సాధించలేకపోయాయి.