ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలుదేశంలో కొత్తగా 25,920 కేసులు.. 492 మరణాలు దేశంలో రోజువారీ కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. 25,920 మందికి కొత్తగా వైరస్ సోకింది. 492 మంది కొవిడ్ కారణంగా చనిపోయారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.మణిపుర్ ఎన్నికల్లో బలగాల మోహరింపే కీలకం!మణిపుర్ ఎన్నికల్లో రెండు అంశాలు కీలకంగా మారాయి. వాటిలో ఒకటి సైనిక బలగాల మోహరింపు కాగా.. మరొకటి వాటి దుర్వినియోగం. ఈ రెండు అంశాలనే రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఎంచుకున్నారు. కానీ సాయుధ బలగాల ప్రత్యేక అధికారాల చట్టాన్ని రద్దు చేయాలని డిమాండ్లు వినిపిస్తున్నా దానిపై స్పందించకపోవడం గమనార్హం.ఎడిట్ ఆప్షన్ ఇద్దామా? రాష్ట్రపతి నూతన ఉత్తర్వుల మేరకు ఓటీఆర్‌లో నమోదైన అభ్యర్థుల సమాచారాన్ని సరిచేయాలని టీఎస్పీఎస్సీ భావిస్తోంది. తాజా ఉత్తర్వులతో స్థానికత మారుతున్న నేపథ్యంలో పలు మార్గాలను కమిషన్ అన్వేషిస్తోంది. ఎడిట్ ఆప్షన్ లేదా సాఫ్ట్వేర్ సాయం తీసుకొనే విధంగా ఆలోచన చేస్తున్నట్లు సమాచారం.నకిలీ ట్రక్‌చీటీలతో ప్రభుత్వ ఖజానాకు కన్నం.ధాన్యం కొనుగోళ్ల విషయంలో ట్రక్ చీటీలు సృష్టించి రూ. కోటికి పైగా ప్రభుత్వ ఖజానాకు గండి పెట్టాడు ఓ అధికారి. కౌలు రైతుల పేరిట బోగస్ రికార్డులు సృష్టించి ఈ దోపిడీకి పాల్పడ్డాడు. వరంగల్ కమిషనరేట్ పరిధిలో పారసరఫరాల కార్పొరేషన్ దృష్టికి ఈ అక్రమం చేరడంతో విషయం వెలుగులోకి వచ్చింది.ఆఖరి పోటు.. నావికుల తిరుగుబాటు భారత స్వాతంత్య్ర పోరాటంలో కీలక ఘట్టాలనగానే... ప్రథమ సంగ్రామం నుంచి క్విట్ ఇండియా ఉద్యమం దాకా చాలా గుర్తుకొస్తాయి. ఇవన్నీ భారతావని బానిస శృంఖలాలను తెంచటానికి పడ్డ సమ్మెట పోటులే. ఈ దెబ్బలన్నింటిని వృథా కానీకుండా.. తెల్లవాడు తెల్లబోయేలా... భారత్‌ను వీడి వెళ్లటం అనివార్యం చేసేలా... పడ్డ ఆఖరి సమ్మెట పోటు... భారత నావికుల తిరుగుబాటు.రష్యాతో చర్చలకు ఒకే చెప్పిన అమెరికాఉక్రెయిన్- రష్యాల మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో అమెరికాతో సమావేశం కానుంది రష్యా. ఈ మేరకు చర్చలకోసం రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రో ప్రతిపాదించిన తేదీలకు అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ అంగీకారం తెలిపారు.క్రిప్టో కరెన్సీలో మదుపు చేయాలనుకుంటున్నారా? క్రిప్టో కరెన్సీపై వచ్చిన ఆదాయానికి పన్ను విధిస్తున్నట్లు బడ్జెట్‌లో ఆర్థిక మంత్రి ప్రకటించారు. దీంతో ఈ డిజిటల్ ఆస్తులు మరోసారి వార్తల్లోకి వచ్చాయి. పన్ను పరిధిలోకి తీసుకురావడం ద్వారా వీటిని నిషేధించే ఆలోచన ప్రభుత్వానికి లేదని కొంత మేరకు గ్రహించవచ్చు. వాటికి చట్టబద్ధత కల్పించే విషయంలో స్పష్టత ఇప్పటికీ రాలేదు. రోజుకో కొత్త క్రిప్టో కరెన్సీలు వస్తున్న నేపథ్యంలో వీటిలో మదుపు చేసేముందు తెలుసుకోవాల్సిన అంశాలేమిటో చూడండి..అంతర్జాతీయంగా మిశ్రమ పవనాలుస్టాక్ మార్కెట్లు శుక్రవారం సెషన్‌ను నష్టాలతో ప్రారంభించాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 32 పాయింట్లు నష్టపోయింది. ప్రస్తుతం 57,859 వద్ద ట్రేడవుతోంది. మరో సూచీ నిఫ్టి 5 పాయింట్ల కోల్పోయి 17,299 వద్ద కదలాడుతోంది.ఈ ఎమ్మెల్యే గురి తప్పదు! ఎమ్మెల్యేగా ఓవైపు ప్రజలకు సేవచేస్తూనే మరోవైపు ట్రాప్ షూటర్‌గానూ రాణిస్తున్నారు బిహార్ ఎమ్మెల్యే శ్రేయసి సింగ్. గతేడాది డిసెంబరులో పటియాలా వేదికగా జరిగిన జాతీయ షూటింగ్ ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణం సాధించిన శ్రేయసి.. త్వరలో ప్రారంభం కానున్న మహిళల ట్రాప్ షూటింగ్ ప్రపంచకప్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించనున్నారు. ఈ నేపథ్యంలో ఆమె గురించి మరిన్ని వివరాలు.. అర్థవంతమైన చిత్రాలే చేస్తాకాస్త నెమ్మదిగా చేసినా అర్థవంతమైనా చిత్రాలే చేయాలన్నదే తను నమ్మే సూత్రమని అన్నారు హీరో శివ కందుకూరి. శుక్రవారం తన పుట్టిన రోజు సందర్భంగా హైదరాబాద్‌లో విలేకర్లతో ముచ్చటించారు. ప్రస్తుతం కథా బలమున్న చిత్రాలు చేయాలనుకుంటున్నానని తెలిపారు.