ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు 'ఆ రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటి' JP Nadda On TRS: దుబ్బాక, హుజూరాబాద్‌లో ఓటమి కేసీఆర్ జీర్ణించుకోలేకపోతున్నారని.. భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా విమర్శించారు. అందుకే నియంతృత్వ పోకడలకు వెళ్తున్నారని మండిపడ్డారు. బండి సంజయ్‌ను అరెస్టు చేయడం ప్రజాస్వామ్య విరుద్ధమన్న నడ్డా.. సంజయ్ అరెస్టుపై ఎన్‌హెచ్‌ఆర్‌సీకి నివేదిస్తామన్నారు. అరెస్టుపై అన్ని వేదికలపై న్యాయపోరాటం చేస్తామని పేర్కొన్నారు.రాష్ట్రంలో భారీగా కేసులు రాష్ట్రంలో భారీగా కరోనా కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో ఒకే రోజు వెయ్యి మార్కును దాటాయి. రాష్ట్రంలో కొత్తగా 10 ఒమిక్రాన్ కేసులు నమోదైనట్లు వైద్యారోగ్యశాఖ వెల్లడించింది. జేపీ నడ్డా నివాళులు JP Nadda :గాంధీ విగ్రహానికి భాజపా అధ్యక్షుడు జేపీ నడ్డా నివాళులు అర్పించారు. బండి సంజయ్ అరెస్ట్‌కు నిరసనగా నడ్డా సహా భాజపా నేతలు నల్ల మాస్కులు ధరించారు. వారిద్దరివీ డ్రామాలుrevanth reddy tweet: రాష్ట్రంలో తెరాస, భాజపా నాటకం మొదలైందని టీపీసీసీ రెేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు. భాజపాను ప్రధాన ప్రతిపక్షంగా చూపే ప్రయత్నం జరుగుతోందని విమర్శించారు. బండి సంజయ్ అరెస్టుతో రాజకీయ నాటకం మొదలైందని ఎద్దేవా చేశారు.జనం భయపడుతుంటే..ఎగ్జిబిషన్ కావాలా? 2019 నుమాయిష్ ఎగ్జిబిషన్‌లో అగ్నిప్రమాదంపై హైకోర్టులో విచారణ జరిగింది. నాటి ఘటనను దృష్టిలో ఉంచుకొని.. ఎగ్జిబిషన్ నిర్వహణకు ఫైర్, జీహెచ్ఎంసీ అనుమతి తీసుకోవాలని జీవో ఇచ్చామని ప్రభుత్వం తరఫు లాయర్లు కోర్టు దృష్టికి తీసుకువచ్చారు.విద్యాసంస్థలకు సెలవులు... ఉత్తర్వులు జారీHolidays for Educational Institutes: రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్రంలోని అన్ని విద్యాసంస్థలకు ప్రభుత్వం ఈనెల 8 నుంచి 16 వరకు సెలవులు ప్రకటించింది. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను ఇవాళ జారీ చేసింది. దేశంలో పెరిగిన కేసులుIndia covid cases: దేశంలో కరోనా కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. సోమవారం ఒక్కరోజే 37,379 కేసులు నమోదయ్యాయి. కొవిడ్‌తో 124 మంది ప్రాణాలు కోల్పోయారు. 11,007 మంది కొత్తగా కోలుకున్నారు. దేశంలో రోజువారీ కొవిడ్ పాజిటివిటీ రేటు 3.24 శాతంగా ఉంది. దుమ్మురేపిన మార్కెట్లుStock Market Closing: స్టాక్ మార్కెట్లు మంగళవారం లాభాలతో ముగిశాయి. బీఎస్ఈ- సెన్సెక్స్ 672 పాయింట్లు లాభపడి 59వేల 855వద్ద ముగిసింది. ఎన్ఎస్ఈ- నిఫ్టీ 179పాయింట్ల లాభపడి 17వేల 805 వద్ద స్థిరపడింది. 'శ్రీవల్లి' వచ్చేసిందిPushpa Movie Srivalli Song: అల్లు అర్జున్ నటించిన 'పుష్ప' నుంచి 'శ్రీవల్లి' వీడియో సాంగ్ విడుదలైంది. ఇప్పటికే సూపర్ హిట్టయిన ఈ పాట విజువల్స్ యమా ఆకట్టుకుంటున్నాయి.శార్దుల్‌కు ఏడు వికెట్లుIND vs SA 2nd Test: జోహెన్నెస్‌బర్గ్ వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో దక్షిణాఫ్రికాపై విరుచుకుపడ్డాడు భారత బౌలర్ శార్దుల్ ఠాకూర్. ఏడు వికెట్లు పడగొట్టాడు. దీంతో తొలి ఇన్నింగ్స్‌లో సౌతాఫ్రికా 229 పరుగులకు ఆలౌటైంది. ఆ జట్టుకు 27 పరుగుల స్వల్ప ఆధిక్యం దక్కింది.